online marketing

Monday, May 7, 2012

పిల్లలు ఏదైనా చెబుతున్నప్పుడు టివి చూడడం, అనాలోచిత చర్యలకు

పిల్లలు ఉన్నత స్థితికి చేరుకోవాలని ప్రతి తల్లిదండ్రి కోరుకుంటారు. చిన్న వయస్సులో పిల్లలు బుడిబుడి అడుగులు వేస్తుంటే ఆ చిన్నారి భవిష్యత్‌ వైపు నడుస్తున్నట్లుగా ఊహిస్తారు. పలక, బలపం చేపడితే మాబిడ్డ ఉద్యోగస్తుడయ్యాడంత సంబర పడుతారు. పిల్లల్ని ఎవరైనా, ఏదేనా అంటే రక్షణగా నిలిచిపోరాడుతారు. తమను ఎలాంటి కష్టాలు లేని తీరాలకు తీసుకెళ్తారనుకుంటారు. కానీ పిల్లలు చేస్తున్నదేంటంటే ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే అమ్మనాన్నలను, ఆత్మీయబంధాలను కాదనుకుని ప్రాణాలు తీసుకుంటున్నారు. చిన్న కారణం, ఆవేశం ఆ కుటుంబాలను విషాదాల్లోకి నెడుతున్నాయి. మరి అంతగా ప్రేమించిన వారిని అఘాధంలోకి నెడితే వచ్చిందేంటి. ఉన్న వారికి కన్నీరు తప్పా.

అందుకే యువత ఒక్కసారి ఒక్క క్షణం ఆలోచించాలి. ఏదో సాధించామనే తృప్తిపడాలి. కానీ అర్ధాంతరంగా ప్రాణాలు తీసుకుంటే సాధించిందేంటి బూడిద తప్పా. చదువుకున్న వారి కన్న అక్షరాలు దిద్దిన వారే మేలు అనేది పల్లెల్లో వినిపించే సామెత. కానీ ఇటీవల కాలంలో విద్యార్థులే ఎక్కువగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కుటుంబాన్ని ఉద్దరిస్తారని, తమకు అండగా నిలుస్తారనుకునే తల్లిదండ్రులకు నిరాశ మిగుల్చుతున్నారు.

తల్లిదండ్రులు ఇలా...
ఇళ్లల్లో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులంతా పరస్పర గౌరవాలతో మెలగాలి. పరుష పదాలతో దూషించడం, హింసించడం, అవమానించడం, దెబ్బలాడడం వంటి చర్యలు పిల్లల భవిష్యత్‌పై తీవ్ర ప్రభావం చూపుతాయన్న విషయం గుర్తింపుకోవాలి. తల్లిదండ్రులపై అసంతృప్తికి లోనైన పిల్లలు తప్పుదారి పట్టే అవకాశం ఉంది. కుటుంబంలో అశాంతి, తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరు చెడ్డఅలవాట్లు వంటి కారణాల రీత్య పిల్లల్లో విపరీతమై ఆలోచనలు చోటుచేసుకుంటాయి. పిల్లల్లో స్నేహాలు, పాఠశాలల్లో వారి ప్రవర్తన, చదువు విషయాలు తల్లిదండ్రులు పరిశీలిస్తుండాలి.

స్నేహపూర్వకం...
15 సంవత్సరాలు దాటిన పిల్లలతో తల్లిదండ్రులు స్నేహితులుగా వ్యవహరించాలి. వ్యక్తిత్వాన్ని పిల్లలు ఆదర్శంగా తీసుకునేలా ప్రవర్తించాలి. ఎదుటి వ్యక్తికి ఎంతటి గౌరవ మర్యాదలు ఇస్తారో, ఎదిగే పిల్లలకు కూడా ఇవ్వాలి. ఇంట్లో వారి ఉనికిని గుర్తించి వారి భాగస్వామ్యానికి స్వాగతించాలి. పిల్లలు ఏదైనా చెబుతున్నప్పుడు టివి చూడడం, అనాలోచిత చర్యలకు పాల్పడరాదు.

ఇలా గుర్తించవచ్చు...
మాదకద్రవ్యాలకు అలవాటు పడడం, గ్యాంగ్‌లతో తిరగడం, ఆయుధాలు ఉపయోగించడం, ఎప్పుడు దిగులుతో కుంగిపోవడం, తనను తాను ఎక్కువగా నింధించుకోవడం, ఆత్మహత్యాయత్నం చేయడం, చదువులో బాగా వెనుకబడి పోయి నేరాలకు పాల్పడడం వంటి సందర్భాలపై తల్లిదండ్రులు పర్వేక్షిస్తూ పరిస్థితి విషమిస్తే వైద్యులను సంప్రదించాలి. పిల్లలు దీర్ఘకాలం మౌనం ఉండడం, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనకుండా, స్నేహితులు లేకుండా ఒంటరిగా ఉండడం, ఆహారపు అలవాట్లకు అలసత్వం ప్రదర్శించడం వంటి లక్ష్యణాలు ఉంటే వైద్యపరీక్షలు చేయించాలి. తిరుగుబాటుకు దారితీసే నిబంధనలు పెట్టరాదు. చెడు అలవాట్లు ఉన్న స్నేహితులు లేకుండా చూడాలి. అతిసంరక్షణ ప్రమాదం అన్న విషయం గుర్తించుకోవాలి. సమస్య వస్తే కుటుంబంలోని సభ్యులంతా కలిసి చర్చించి నిర్ణయించుకోవాలి. తప్పు చేసినప్పుడు సున్నితంగా దండించడం, మంచి పని చేసినప్పుడు మెచ్చుకుంటుండాలి.

పిల్లలు మరీ మీరు...
విద్యార్థులు కూడా ప్రతి చిన్న విషయాన్ని క్షణికావేశంలో ఏకంగా ప్రాణాలను తీసుకోవడం అనేది సరైంది కాదు. మీకు ఉన్న సమస్యను తల్లిదండ్రులకు, స్నేహితులకు, సన్నిహితంగా ఉండే ఉపాధ్యాయులతో చర్చించాలి. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది. చావు ఒక్కటే కాదు. జీవితంలో ఎన్నో సాధించినా ప్రత్యేక గుర్తింపు సాధించాలి. కానీ జీవితాన్ని అర్థాంతరంగా ముగించరాదు. మీరు ఎంచుకున్న విషయాన్ని స్పష్టంగా తల్లిదండ్రులకు వివరించాలి. మీకు ఉన్న ఆశక్తిని తల్లిదండ్రులకు వివరించి, వారిని ఒప్పించి నచ్చిన పని చేయండి.

1 comment:

  1. చాలా బాగా చెప్పారు సర్ , పిల్లల పెరుగుదలను వారి ప్రవర్త నని .. దగ్గర వుండి తల్లి దండ్రులే చూసుకోవాలి .... అతిగా గారాబం కుడా పనికి రాదు ... పిల్లలకి జీవితం లో గొప్ప వ్యక్తుల గురించి చిన్నపుడే చెప్పాలి... ఆ వ్యక్తులు పడిన కష్టాలు , విజయాలను చెప్పాలి .... నయితిక విలువలు కలిగిన ఎన్నో కథలని చెప్పాలి ..... వీటన్నిటికి తల్లి దండ్రులే భాద్యత వహించాలి ....

    ReplyDelete

sale your old used computer
usedsystemsblogspot.in
used computer buyer andhra pradesh