Saturday, November 30, 2013
Saturday, July 27, 2013
Tuesday, July 23, 2013
Thursday, May 2, 2013
ఒక్కసారిగా భగ్గుమన్నాయి. జిల్లా కన్వీనర్.......తొలి రోజే చేదు అనుభవం......
నెల్లూరు - నెల్లూరు నాయకుల మధ్య ఉన్న విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. జిల్లా కన్వీనర్‌గా ఎన్నికైన మేరిగ మురళీధర్ మొదటిసారిగా బుధవారం నెల్లూరుకు రాగా, ఆయనకు స్వాగతం పలుకుతూ పెద్దఎత్తున ఏర్పాట్లు చేశారు. అయితే, ఈ కార్యక్రమానికి ఏడు నియోజకవర్గాల సమన్వయకర్తలు డుమ్మా కొట్టారు. అంతేగాక నిన్నటి వరకు వైసీపీ జిల్లా కార్యాలయం పేరుతో ఉన్న బోర్డు రాత్రికి రాత్రే అదృశ్యమైంది. ఆ స్థానంలో పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి పేరుతో బోర్డు వెలసింది. వెంకటగిరి సమన్వయకర్త కొమ్మి లక్ష్మయ్యనాయుడు నియామకంపై ఆ నియోజకవర్గ నేతలు ఘర్షణకు దిగారు. దీంతో కొత్త కన్వీనర్‌కు తొలి రోజే చేదు అనుభవం ఎదురైంది.
వైసీపీ ఆవిర్భావం నుంచి జిల్లా కన్వీనర్‌గా ఉంటున్న కాకాణికి ఉద్వాసన పలకాలని అధిష్ఠానం నిర్ణయించింది. ఇది తెలుసుకున్న కాకాణి ముందుగానే జిల్లా కన్వీనర్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డిల వర్గీయుడు పాపకన్ను రాజశేఖర్‌రెడ్డి ముఖ్య అనుచరుడు మేరిగ మురళీధర్‌కు జిల్లా పార్టీ పగ్గాలు అప్పగించారు.
కొత్త కన్వీనర్‌కు ఘన స్వాగతం పలికేందుకు జిల్లాలోని పార్టీ ముఖ్యులందరికీ రెండు రోజుల క్రితమే వర్తమానం పంపి, హాజరు కావాలని పిలుపునిచ్చారు. విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకుని పినాకినీ ఎక్స్‌ప్రెస్‌లో నెల్లూరుకు చేరిన మురళీధర్‌కు రైల్వేస్టేషన్‌లో నగర కన్వీనర్ ఆనం వెంకటరమణారెడ్డి, రూరల్ కన్వీనర్ కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిలతో పాటు పలువురు నాయకులు స్వాగతం పలికారు. అక్కడి నుంచి ఊరేగింపుగా గాంధీబొమ్మ సర్కిల్‌కు చేరుకుని గాంధీ, వైఎస్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
మళ్లీ ర్యాలీగా బయలుదేరి కలెక్టర్ బంగ్లా వద్ద ఉన్న వైసీపీ జిల్లా కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడే కారు పార్కింగ్ స్థలంలో విలేఖర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటగిరి నియోజకవర్గానికి వలస నేతలు అవసరం లేదని, పార్టీ నడిపే సత్తా స్థానికులకు ఉందని నెమ్మలపూడి సురేష్‌రెడ్డి ఆధ్వర్యంలో కొందరు మురళీధర్‌తో వివాదానికి దిగారు. తక్షణం కొమ్మి లక్ష్మయ్యనాయుడును వెనక్కు పంపించాలంటూ కార్యకర్తల అరుపులు, కేకలతో ఘర్షణకు దిగారు. దీంతో ఆలస్యంగా మేల్కొన్న కొంతమంది నాయకులు వారికి సర్దిచెప్పి, అక్కడి నుంచి పంపేశారు.
అదృశ్యమైన బోర్డు
రెండేళ్ల క్రితం జిల్లా కన్వీనర్‌గా బాధ్యతలు చేపట్టిన కాకాణి గోవర్ధన్‌రెడ్డి కలెక్టర్ బంగ్లా వద్ద ఓ ఇంటిని అద్దెకు తీసుకుని పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తూ వచ్చారు. అప్పట్లో నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి ఈ కార్యాలయాన్ని ప్రారంభించారు. కాలక్రమేణా మేకపాటి, కాకాణిల మధ్య విభేదాలు తీవ్రం కావడంతో మేకపాటి సోదరులు, వారి వర్గీయులు మేకపాటి అతిథి గృహంలోనే పార్టీ కార్యక్రమాలు, సమావేశాలు నిర్వహిస్తూ వచ్చారు. దీంతో జిల్లా పార్టీ కార్యాలయం బోసిపోయింది. కన్వీనర్ బాధ్యతల నుంచి తనను తప్పించాలని మేకపాటి సోదరులు ప్రయత్నిస్తున్నారని తెలుసుకున్న కాకాణి కూడా ఆ కార్యాలయం వైపు చూడటం మానేశారు. ఈ నేపథ్యంలోనే పార్టీ జిల్లా కన్వీనర్‌గా మేరిగ మురళీధర్ నియమితులు అయ్యారు. ఈయన రాకకు ముందురోజే మంగళవారం రాత్రి జిల్లా పార్టీ కార్యాలయం బోర్డు అదృశ్యమైంది. ఆ స్థానంలో 'వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యనిర్వాహక కమిటీ సభ్యుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి వారి కార్యాలయం'' పేరుతో బోర్డు వెలిసింది. పార్టీ కార్యాలయానికి చేరుకున్న మేరిగ ఆయన అనుచరులు ఈ బోర్డును చూసి అవాక్కయ్యారు. దీంతో కార్యాలయంలోకి అడుగు పెట్టకుండా ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, కన్వీనర్ మేరిగ మురళీధర్ తదితరులు కారు పార్కింగ్ స్థలంలోనే సమావేశం నిర్వహించి నిష్క్రమించారు.
సమన్వయకర్తల డుమ్మా
వైసీపీ జిల్లా కన్వీనర్ మురళీధర్ స్వాగత కార్యక్రమానికి ఏడు నియోజకవర్గ సమన్వయకర్తలు డుమ్మా కొట్టారు. ఆత్మకూరు, కోవూరు, కావలి, నెల్లూరు సిటీ, వెంకటగిరి, సూళ్లూరుపేట, సర్వేపల్లి నియోజకవర్గాల కన్వీనర్లు ఇటు వైపు కన్న్తెత చూడలేదు. నెల్లూరు సిటీ సమన్వయకర్త అనిల్ నెల్లూరులోనే ఉన్నా ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు. వీరంతా కాకాణి వర్గం కావడంతో హాజరు కాలేదని ఆ పార్టీ నేతలే బహిరంగంగా చర్చించుకుంటున్నా రు. ఓ ముఖ్యనేత మాట్లాడుతూ ఓ దళితుడికి పదవి ఇవ్వడంపై ఇష్టంలేకే కొందరు ఇలా చేస్తున్నారని అన్నారు. కనీసం వారం రోజుల తరువాత అయినా వైసీపీ కార్యాలయ బోర్డు మార్చి ఉంటే ఈ రగడ జరిగేది కాదన్నారు. మరో నేత ఈ వివాదాన్ని రాద్దాంతం చేయవద్దంటూ పేర్కొన్నారు.
Saturday, April 13, 2013
ఓ బాలుడు రెబల్ సినిమా చూశా..కారు దొంగతనం.ప్రయత్నించా..
నెల్లూరు: సినిమా ప్రభావంతో ఓ బాలుడు దారుణానికి ఒడిగట్టాడు. ప్రభాస్ హీరోగా నటించిన రెబల్ సినిమాలో లాగా చేయాలని అనుకుని ఓ బాలుడు కారు డ్రైవర్ గొంతును బ్లేడ్‌తో కోశాడు. ఈ విషయాన్ని ఆ బాలుడు స్వయంగా పోలీసుల వద్ద వెల్లడించాడు. ఈ సంఘటన నెల్లూరు జిల్లా సైదాపురం సమీపంలోని షామైన్ వద్ద శుక్రవారం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి - చిల్లకూరు మండలం చింతవరానికి చెందిన హైమవతి కుమారుడు (12) గూడూరులోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్నాడు. చింతవరం నుంచి శుక్రవారం స్కూల్ బస్సులో బయలుదేరిన బాలుడు గూడూరులో సాయిబాబా గుడి వద్ద దిగిపోయాడు. అక్కడి నుంచి పాత బస్టాండ్ సమీపంలోని కారు స్టాండ్ వద్దకు వెళ్లాడు. తన తల్లి కారు బాడుగకు తీసుకుని రావాలని చెప్పిందని యజమానితో చెప్పాడు. దీంతో అతడు ఇన్నోవా కారును బాలుడి వెంట పంపించాడు. సైదాపురం సమీపంలోని షామైన్ బోర్డు వద్ద ఏమరుపాటుగా ఉన్న డ్రైవర్ కరీముల్లా గొంతును బాలుడు బ్లేడుతో కోశాడు. కారు స్లో కావడంతో దిగి పరుగు పెట్టాడు. డ్రైవర్ కేకలు వేయడంతో సమీపంలోని వారు బాలుడిని పట్టుకున్నారు. డ్రైవర్‌ను ఆస్పత్రికి తరలించారు. గురువారం రాత్రి రెబల్ సినిమా చూశానని, అదులో కారు దొంగతనం చేసిన విధంగానే తానూ చేయాలని ప్రయత్నించానని బాలుడు నవ్వుతూ చెప్పాడని పోలీసులు అంటున్నారు.
Friday, April 5, 2013
నేటి నుంచి ప్రతి రెండవ శనివారం.....నెల్లూరులోనే తిరుపల తిరుపతి స్వామివారి ప్రసాదం
నెల్లూరు; నెల్లూరులో నేటి నుంచి ప్రతి రెండవ శనివారం తిరుపల తిరుపతి దేవస్ధానం నుంచి శ్రీవారి ప్రసాదం విక్రయించబడుతుందని టిటిడి మేనేజర్ యల్ రాంగోపాల్ తెలిపారు. శుక్రవారం స్ధానిక టిటిడి కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్వామివారి ప్రసాదం టిటిడి కళ్యాణ మండపంలో మాత్రమే దొరుకుతుందని పేర్కొన్నారు. అలాగే ఏప్రిల్ నేలలో ధార్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నామని వివరించారు. ఈసందర్భంగా పలు భజన, ఉపన్యాస కార్యక్రమాలు జరుగుతాయన్నారు. ప్రస్తుతం టిటిడి చరిత్రలో తిరుమల వాసుని కళ్యాణ మహోత్సవాలు, స్వామికి పలు విశే ష పూజలు గావించేది నెల్లూరులోనే అన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొనే శ్రీవారి భక్తుల కోసం స్వామి వారి ప్రసాదాన్ని ఈవిధంగా అందజేయనున్నామని పేర్కొన్నారు.
Wednesday, March 20, 2013
యువతి ఐదుగురిని పెళ్లాడింది... మొదటి భర్త సోదరులను వివాహం
ఓ యువతి ఐదుగురిని పెళ్లాడిన సంఘటన ఉత్తరాఖండ్‌లో చోటు చేసుకుంది.
ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని డెహ్రాడూన్‌కు సమీపంలోని రాజోవర్మ అనే యువతి
ఐదుగురిని పెళ్లాడింది. మొదటి భర్త సోదరులను వివాహం చేసుకోవడం ఉత్తరాఖండ్
రాష్ట్రంలోని డెహ్రాడూన్‌కు సమీప ప్రాంతాల్లో ఓ సంప్రదాయం. ఈ ప్రాంతానికి
చెందిన ఇరవయ్యొక్క ఏళ్ల రాజోవర్మ అనే మహిళ ఈ ఆచారాన్ని కొనసాగించింది.
నాలుగేళ్ల క్రితం ఆమె గుడ్డు వర్మ అనే యువకుడిని పెళ్లి చేసుకుంది. తర్వాత
అతడి సోదరులు బైజు వర్మ, శాంతారామ్ వర్మ, గోపాల్ వర్మ, దినేశ్ వర్మను కూడా
వరుసగా వివాహం చేసుకుంది. సంప్రదాయంలో భాగంగానే ఇలా వివాహం చేసుకున్నామని
రాజోవర్మ వెల్లడించింది. తామంతా ఒకే ఇంటిలో నివసిస్తున్నామని, తమ మధ్య
ఎటువంటి విభేదాలు లేవని స్పష్టం చేసింది. తమ వైవాహిక జీవితం ఎంతో ఆనందంగా
ఉందని ఆమె భర్తలు చెబుతున్నారు.
మరో విషయం వారికి పద్దెనిమిది నెలల బాబు కూడా ఉన్నాడు. అయితే ఆ బాబు తండ్రి
ఆ ఐదుగురిలో ఎవరో తెలియదని వారు చెబుతున్నారు. ఐదుగురితో పెళ్లి అంటే మొదట
అందరూ ఇబ్బందిగా భావించారని, తాను మాత్రం అలా భావించలేదని రాజోవర్మ
చెప్పింది. తాము ఐదుగురం అన్నదమ్ములం ఆమెతో సంసారం చేస్తున్నామని, తమలో
ఎవరికీ ఒకరిపై మరొకరికి అసూయ, ద్వేషం లేదని మొదటి భర్త గుడ్డు వర్మ
అన్నాడు.
గుడ్డు వర్మను నాలుగేళ్ల క్రితం పెళ్లి చేసుకున్న రాజోవర్మ ఆ తర్వాత బిజ్జు
వర్మ(32), శాంతారామ్ వర్మ(28), గోపాల్ వర్మ(26)లను పెళ్లి చేసుకుంది. ఆఖరు
తమ్ముడు దినేష్ వర్మకు గతేడాది పద్దెనిమిదేళ్లు దాటాయి. దీంతో అతనిని
గతేడాది పెళ్లి చేసుకుంది. వారంతా ఒకే గదిలో ఉంటున్నారు.
Wednesday, February 6, 2013
Monday, January 7, 2013
నెల్లూరుకు చెందిన ఐటీ అధికారి.. విమానంలో వెకిలి చేష్టలు
విమానంలో ఓ మహిళా అధికారిణిపై అనుచితంగా ప్రవర్తించిన ఐటీ అధికారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ నుంచి తిరుపతి వస్తున్న విమానంలో నెల్లూరుకు చెందిన ఐటీ అధికారి జయశంకర్ ఓ మహిళా అధికారిణిపై వెకిలిచేష్టలతో అసభ్యంగా ప్రవర్తించారు. జయశంకర్‌పై విమానం దిగగానే సమీపంలోని పోలీసు స్టేషన్‌లో ఆమె ఫిర్యాదు చేశారు. జయశంకర్ మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు అనుమానించి పరీక్షల నిమిత్తం రుయా ఆసుపత్రికి తరలించారు
Saturday, January 5, 2013
నెల్లూరు నగరం స్మార్ట్ సిటీ.......శాటలైట్ ద్వారా సిగ్నలింగ్ సిస్టమ్‌తో
నెల్లూరు నగరం స్మార్ట్ సిటీగా ఎంపికైందని నెల్లూరు నగర ఎమ్మెల్యే ముంగమూరు శ్రీధర్‌కృష్ణారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ముంగమూరు మాట్లాడుతూ నెల్లూరు స్మార్ట్ సిటీగా ఎంపికైందని ఇక నగర ప్రజలకు ట్రాఫిక్ సమస్య తీరనుందన్నారు. శాటలైట్ ద్వారా సిగ్నలింగ్ సిస్టమ్‌తో రూపొంది స్తున్న స్మార్ట్ సిటీ ద్వారా నేరాలు చేసే వారిని కూడా గుర్తించవచ్చన్నారు.
Subscribe to:
Posts (Atom)