ఓ యువతి ఐదుగురిని పెళ్లాడిన సంఘటన ఉత్తరాఖండ్‌లో చోటు చేసుకుంది.
ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని డెహ్రాడూన్‌కు సమీపంలోని రాజోవర్మ అనే యువతి
ఐదుగురిని పెళ్లాడింది. మొదటి భర్త సోదరులను వివాహం చేసుకోవడం ఉత్తరాఖండ్
రాష్ట్రంలోని డెహ్రాడూన్‌కు సమీప ప్రాంతాల్లో ఓ సంప్రదాయం. ఈ ప్రాంతానికి
చెందిన ఇరవయ్యొక్క ఏళ్ల రాజోవర్మ అనే మహిళ ఈ ఆచారాన్ని కొనసాగించింది.
నాలుగేళ్ల క్రితం ఆమె గుడ్డు వర్మ అనే యువకుడిని పెళ్లి చేసుకుంది. తర్వాత
అతడి సోదరులు బైజు వర్మ, శాంతారామ్ వర్మ, గోపాల్ వర్మ, దినేశ్ వర్మను కూడా
వరుసగా వివాహం చేసుకుంది. సంప్రదాయంలో భాగంగానే ఇలా వివాహం చేసుకున్నామని
రాజోవర్మ వెల్లడించింది. తామంతా ఒకే ఇంటిలో నివసిస్తున్నామని, తమ మధ్య
ఎటువంటి విభేదాలు లేవని స్పష్టం చేసింది. తమ వైవాహిక జీవితం ఎంతో ఆనందంగా
ఉందని ఆమె భర్తలు చెబుతున్నారు.
మరో విషయం వారికి పద్దెనిమిది నెలల బాబు కూడా ఉన్నాడు. అయితే ఆ బాబు తండ్రి
ఆ ఐదుగురిలో ఎవరో తెలియదని వారు చెబుతున్నారు. ఐదుగురితో పెళ్లి అంటే మొదట
అందరూ ఇబ్బందిగా భావించారని, తాను మాత్రం అలా భావించలేదని రాజోవర్మ
చెప్పింది. తాము ఐదుగురం అన్నదమ్ములం ఆమెతో సంసారం చేస్తున్నామని, తమలో
ఎవరికీ ఒకరిపై మరొకరికి అసూయ, ద్వేషం లేదని మొదటి భర్త గుడ్డు వర్మ
అన్నాడు.
గుడ్డు వర్మను నాలుగేళ్ల క్రితం పెళ్లి చేసుకున్న రాజోవర్మ ఆ తర్వాత బిజ్జు
వర్మ(32), శాంతారామ్ వర్మ(28), గోపాల్ వర్మ(26)లను పెళ్లి చేసుకుంది. ఆఖరు
తమ్ముడు దినేష్ వర్మకు గతేడాది పద్దెనిమిదేళ్లు దాటాయి. దీంతో అతనిని
గతేడాది పెళ్లి చేసుకుంది. వారంతా ఒకే గదిలో ఉంటున్నారు.
ఆ ఐదుగురు మగాళ్ళు సర్దుకుపోతున్నా , ఆ అమ్మాయికి అది నరకమే భవిష్యత్తులో .
ReplyDeleteఇది ఆచారంగా ఎప్పుడు పరిగణించబడ్తుందంటే , ఆడజాతి అల్పమైనప్పుడు మాత్రమే.
ఈ నాడు ఆడజాతి అధికమై అన్ని రంగాలలఓ మగవారికి దీటుగా ఉన్నారు . నేడు ఇది అనాచారమని
నొక్కి వక్కాణించాల్సిందే.
శర్మ జీ ఎస్
నా బ్లాగు : నా ఆలోచనల పరంపర
http://naalochanalaparampara.blogspot.in/2013/03/blog-post_4589.html