online marketing

Sunday, December 26, 2010

నగర రహదారుల అభివృద్ధికి రూ.6కోట్ల మంజూరు

నెల్లూరు: నగరంలో లెైలా తుపాన్‌ తాకిడికి దెబ్బతిన్న రహదారుల అభివృద్ధికి రూ.6కోట్లు మంజూరు చేస్తున్నట్లు రాష్ట్ర ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. శనివారం నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంఖుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లెైలా తుపాన్‌ వలన నగరంలో కొన్ని రోడ్లు దెబ్బతిన్నాయనీ, తాను మున్సిపల్‌ శాఖా మంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్రంలో రూ.83కోట్లు మంజూరు చేయగా, ఒక్క నెల్లూరునగరానికే ఆరు కోట్లు మంజూరు చేశామన్నారు. 18వ డివిజన్‌లోని 2.53 కోట్ల పనులు పూర్తి చేయడం జరిగిందన్నారు.నెల్లూరు పట్టణానికి గత ఒకటిన్నరేడాది కాలంలో రూ53.20కోట్ల నిధులు మంజూరు చేసినట్లు మంత్రి గుర్తుచేశారు. 123 కోట్లతో సమ్మర్‌ స్టోరేజి ట్యాంక్‌ పనులను పూర్తిచేశామన్నారు. 
పెైపెలెైన్‌ పొడిగింపు ఒక్క నెలలో పూర్తిస్థాయిలో పూర్తిచేస్తామన్నారు. దీని కోసం మరో 20కోట్లు అదనంగా మంజూరు చేసి రిజర్వాయర్‌ పెైపులెైన్ల కోసం టెండర్లు పిలిచామన్నారు. స్థానిక ఎమ్మెల్యేల కోరిక మేరకు 14.5కోట్లను మంజూరు చేశామనీ, మరో ఏడు కోట్లు రోడ్ల కోసం త్వరలో మంజూరు చేస్తామని తెలిపారు. కొత్త బడ్జెట్‌లో నగర డ్రైనేజీ కోసం 450 కోట్ల నిధులను మంజూరు చేసి సిఎం, కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రుల చేతుల మీదుగా శంఖుస్థాపన చేయించనున్నట్లు వెల్లడించారు.

అంతక్రితం స్థానిక సండేమార్కెట్‌ సెంటర్‌లో 15.77 లక్షలతో నిర్మించనున్న సిమెంటు రోడ్‌ పనులకు మంత్రి శంఖుస్థాపన చేశారు. అలాగే 27వ డివిజన్‌లోని గాయత్రినగర్‌ 4వ వీథిలో రూ.10.13లక్షలతో నిర్మించనున్న సిమెంట్‌ రోడ్‌, డ్రైనేజీ పనులకు మంత్రి శంఖుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు నగర, రూరల్‌ ఎమ్మెల్యేలు ముంగమూరు శ్రీధరకృష్ణారెడ్డి, ఆనం వివేకానందరెడ్డి, అదనపు జెసి టి.సీతారామయ్య, నగర కమిషనర్‌ టిఎస్‌ఆర్‌ 

No comments:

Post a Comment

sale your old used computer
usedsystemsblogspot.in
used computer buyer andhra pradesh