నెల్లూరు: రంగు రంగుల దీపాలు, బెలూన్లు, వెలుగులు విరజిమ్మే కొత్త రంగుల ప్రార్థనా మందిరాలు, కళకళ లాడే కొత్త వస్త్రాలతో క్రైస్తవులు కలర్‌పుల్‌గా క్రిస్మస్ వేడుకలు శనివారం భక్తిశ్రద్ధలతో సాగాయి. క్రీస్తు జనన సందేశాన్ని తెలిపే భక్తిగీతాలు ప్రత్యేక ఆకర్షణగా, ప్రార్థనా మందిరాలో క్రిస్మస్ ఆరాధనలు ఘనంగా జరిగాయి. నగరంలో ప్రతిష్టాత్మకమైన డౌనీహాల్ బాప్టిస్ట్ చర్చిలో సంఘ కాపరి రెవ.గంగిపోగు పీటర్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో క్రిస్మస్ సారాంశాన్ని వివరించారు. అల్లకల్లోల ప్రపంచంలో ఏసుక్రీస్తు ప్రబోధాలు శాంతిని కలిగిస్తాయని అన్నారు. ఈ సందర్భంగా చర్చి గాయక బృందం ఆలపించిన గీతాలు ప్రత్యేకాకర్షణగా నిలిచాయి.
మధ్యాహ్నం కేంద్ర కారాగారంలోని ఖెైదీలను సంఘ సభ్యులు సందర్శించి వారికి క్రిస్మస్ కీర్తనలను, సందేశాలను అందించారు. ఈ కార్యక్రమాల్లో సంఘ అధ్యక్షులు టి.హేమంత్‌కుమార్, కార్యదర్శి కెఐ దేవానందం, కోశాధికారి జిబి భాస్కర్‌రావు, గాయక బృంద సభ్యులు పాల్గొన్నారు. స్థానిక బోసుబొమ్మ వద్ద గల లోన్‌స్టార్ బాప్టిస్ట్ చర్చి మొదటి సర్వీసులో రెవ.కంచర్ల ప్రభుదాస్, రెండవ సర్వీసులో రెవ.ఎస్.విజయరత్నం, 3వ సర్వీసులో రెవ.ప్రసాద్‌లు క్రిస్మస్ సందేశాలు అందించారు. అధిక సంఖ్యలో క్రైస్తవులు ప్రత్యేక ఆరాధనలో పాల్గొన్నారు. స్థానిక సంతపేటలోని రోమన్ కేథలిక్ కెథడ్రిల్, ఫత్తేఖాన్‌పేట పునీత కానుక మాత చర్చిలో వేకువ జామునుంచే ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు.
రోమన్ కేథలిక్ క్రైస్తవులు అధికంగా ఉన్న ఈ ప్రాంతంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని భక్తి శ్రద్ధలతో బాలయేసును, కన్నె మరియను పూజించారు. మూలాపేట బాప్టిస్ట్ సంఘంలో రెవ.విల్సన్, బట్వాడిపాలెం బాప్టిస్ట్ సంఘంలో రెవ.థామస్‌రాజ్‌ల ఆధ్వర్యంలో ప్రత్యేక ఆరాధనలు నిర్వహించారు.దర్గామిట్ట సాల్వేషన్ ఆర్మీ, వేదాయపాలెం బాప్టిస్ట్ చర్చి, పొదలకూరురోడ్ యునెైటెడ్ బాప్టిస్ట్ చర్చిలతో పాటు నగరంలోని పలు క్రైస్తవ ప్రార్థనా మందిరాల్లో క్రిస్మస్ ప్రత్యేక ఆరాధనలు నిర్వహించారు.
No comments:
Post a Comment