సూళ్ళూరుపేట : సాంకేతికంగా అభివృద్ధి చెందుతూ ముందుకు దూసుకుపోతున్న ఇస్రో మరో అడుగు ముందుకు వేసి దేశంలోకెళ్లా అతి వేగవంతమైన, అత్యుత్తమ సూపర్ కంప్యూటర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు అధికారికంగా ప్రకటించింది. 14కోట్ల రూపాయలను వెచ్చించి తయారు చేసిన సూపర్ కంప్యూటర్‌కు ‘సతీష్ ధావన్’ గా, గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్‌కు ‘సాగ 220’ గా ఇస్రో నామకరణ చేసింది. కేరళలోని తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్‌లో సోమవారం ఇస్రో చైర్మన్ రాధాకృష్ణన్ సూపర్ కంప్యూటర్‌ను ప్రారంభించారు. ముఖ్యంగా ఇస్రో శాస్తవ్రేత్తలు గగన తలంలో పరిజ్ఞానానికి సంబంధించి అతి క్లిష్టమైన సమస్యలను ఛేధించేందుకు కంప్యూటర్ ఉపయోగపడనుంది. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారుచేసిన కంప్యూటర్‌లో గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్‌కు చెందిన టెస్లా 2070తోపాటు సిపియికు చెందిన 400 ఇన్‌టెల్ క్వాడ్ కోర్ జెన్ పరికరాలను విప్రో సంస్ధ తయారుచేసింది. ఇందులో 500జిగాప్లాప్స్‌కు చెందిన సమాచారాన్ని గుప్తంగా ఉండేందుకు వీలుంటుంది. కాలుష్య రహితంగా తయారుచేసిన సూపర్ కంప్యూటర్ 150కిలోవాట్ల విద్యుత్‌ను మాత్రమే వాడనుంది.
No comments:
Post a Comment