online marketing

Wednesday, May 4, 2011

లంచం తీసుకున్న ఇద్దరు ఇంజనీర్లకు మూడేళ్లు జైలు

నెల్లూరు: లంచం తీసుకున్న అభియోగంలో నేరం రుజువు కావడంతో రాజంపేట విద్యుత్‌ శాఖ ఉద్యోగులైన నిందితులు అసిస్టెంట్‌ ఇంజనీర్‌ యనమల హరికృష్ణ, సబ్‌ ఇంజనీర్‌ బరిగల రామ్మోహన్‌రావులకు ఒక్కొక్కరికి మూడేళ్ల జైలుశిక్ష, రూ.6వేలు జరిమానా విధిస్తూ ఏసీబీ స్పెషల్‌ కోర్టు న్యాయమూర్తి ఎం.వెంకటరమణ మంగళవారం తీర్పు ఇచ్చారు. వివరాలిలా ఉన్నాయి. కడప జిల్లా రాజంపేట మండలంలోని తాళ్లపాక గ్రామం సెంటర్‌లో కొట్లు కట్టుకొని 2003న షేక్‌ అజాముద్దీన్‌జాన్‌ తండ్రి విద్యుత్‌ సరఫరాకోసం ఆ శాఖాధికారులకు దరఖాస్తు పెట్టుకున్నారు.

అయితే 2004లో దరఖాస్తుదారుడు మరణించాడు. అనంతరం మృతి చెందిన అతని కుమారుడు అజాముద్దీన్‌ విద్యుత్‌ శాఖాధికారులను కలసి తన తండ్రి నిర్మించిన కొట్లకు విద్యుత్‌సరఫరా కోసమై ఆయన పెట్టుకున్న దరఖాస్తు విషయమై అధికారులకు తెలిపాడు. అనంతరం అధికారులు స్పందించి ఆ కొట్లకు మీటరును ఏర్పాటు చేసి సర్వీస్‌ నెంబర్‌ను కూడా ఇచ్చారు. అయితే విద్యుత్‌ సరఫరా ఇవ్వకపోవడంతో 5.10.2005న నిందితులు ఎఇ యనమల హరికృష్ణ, సబ్‌ ఇంజనీర్‌ బరిగల రామ్మోహన్‌రావులను కలిసి సరఫరా ఇప్పించాల్సిందిగా ఫిర్యాది అజాముద్దీన్‌ కోరారు.

విద్యుత్‌ సరఫరా ఇవ్వాలంటే రూ.5 వేలు లంచం ఇవ్వాల్సిందిగా నిందితులిద్దరూ ఫిర్యాదిని డిమాండ్‌ చేశారు. లంచం ఇవ్వడం ఇష్టంలేని ఫిర్యాది తిరుపతిలోని ఏసీబీ అధికారులను సంప్రదించి విషయాన్ని వివరించారు. అనంతరం అప్పటి ఏసీబీ డీఎస్పీ రామదాసు ఆధ్వర్యంలో పన్నిన వలలో విద్యుత్‌ శాఖ కార్యాలయంలో నిందితులైన ఆ అధికారులిద్దరూ ఫిర్యాది నిజాముద్దీన్‌ నుండి రూ.5 వేలు లంచం పుచ్చుకుంటుండగా రెడ్‌ హ్యాండెడ్‌గా దొరిి పోయారు. ఈ కేసు విచారణలో సాక్ష్యాధారాలు రుజువు కావడంతో న్యాయమూర్తి పై మేరకు తీర్పు ఇచ్చారు. ప్రాసిక్యూషన్‌ తరపున స్పెషల్‌ పిపి రమేష్‌బాబు వాదించారు.

No comments:

Post a Comment

sale your old used computer
usedsystemsblogspot.in
used computer buyer andhra pradesh