online marketing

Sunday, August 28, 2011

సాంకేతిక పరిజ్ఞానం విశిష్టత ప్రజలకు చేరువ కావాలి

నెల్లూరు :సాంకేతిక పరిజ్ఞానం ప్రజలకు మరింత చేరువ కావాలని, దాని ఉపయోగం అన్ని రంగాల్లోను వినియోగించుకోవాలని శనివారం విక్రమ సింహపురి యూనివర్సిటీ ఇంచార్జి ఉప కులపతి ఆచార్య ఎన్‌. ప్రభాకరరావు అన్నారు. ఈ జాతీయ సదస్సును ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఆర్ధిక సహకారంతో నిర్వహిస్తున్నామన్నారు. 2 రోజుల జాతీయ కాన్ఫరెన్స్‌ను ఉప కులపతి ఘనంగా ప్రారంభించారు. రాష్ట్రం, దేశం నలుమూలల నుండి 90కి పైగా ఔత్సాహిక పరిశోధన విద్యార్ధులు, అధ్యాపకులు తమ పరిశోధన పత్రాలను సదస్సుకు పంపించారు. ఈ 2 రోజుల జాతీయ సదస్సులో సమాచార, ప్రచార మాధ్యమాలు వ్యవస్థ భధ్రతా వ్యవ స్థలకు సంబంధించి చర్యలు, ఉపయోగకరమైన సంవాదాలు జరుగుతాయని తెలిపారు.

కంప్యూటర్‌ విభాగం 5వ జాతీయ స్థాయి సదస్సులు నిర్వహించి ఈ ప్రాంతంలో విద్యా సంబంధమైన, పరిశోధనా రంగంలో మంచి చైతన్యం కలిగించిందని కొనియాడారు. ఈ కార్యక్రమానికి ఆచార్య నారాయణరెడ్డి కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కంప్యూటర్‌ సైన్స్‌ విభాగాన్ని ప్రశంసిస్తూ వారు ప్రతిసారి నూతనమైన విషయాల మీద సదస్సులు నిర్వహించి మంచి చైతన్యానికి నాంది పలుకుతున్నాయని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఆచార్య ఎంవి. రమణమూర్తి ముఖ్య ప్రసంగీకులుగా తన ప్రసంగ పాఠాన్ని అందిస్తూ సాంకేతిక పరిజ్ఞానం కాలానుగుణంగా వచ్చే మార్పులకు ధీటుగా రుపుదిద్దాలని, సాంకేతికత మరింత చౌకగా, ఆధారపడేదిగా ఉండాలన్నారు. అంతకుమునుపు ఆచార్య టి. సుధ సదస్సుకు డైరెక్టర్‌గా వ్యవహరిస్తూ సదస్సు ముఖ్య ఉద్యేశ్యాలు ప్రకచించారు. ఆమె ఈ సదస్సులో రానున్న 2 రోజుల్లో జరగబోయే సైబర్‌ థ్రెట్‌ అనాలసిస్‌, వైర్‌లెస్‌ నెట్‌ వర్క్‌ సెక్యూరిటీ, జిఐఎస్‌ భధ్రతా వ్యవస్థలాంటి ముఖ్యమైన విషయాలపై చర్చ జరుగుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో కె. నరసింహారావు అతిథులను సదస్సులో పాల్గొన్న ఔత్సాహికులను పరిచయం చేశారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ అధ్యాపకులు, యూనివర్సిటీ పీజీ సెంటర్‌ కావలి స్పెషల్‌ ఆఫీసర్‌ పి. శివశంకర్‌, విద్యార్ధులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

sale your old used computer
usedsystemsblogspot.in
used computer buyer andhra pradesh