online marketing

Sunday, November 6, 2011

నకిలీ సర్టిఫికెట్ల తయారీ ముఠా అరెస్ట్‌

నెల్లూరు :నగరంలోని ఓ లాడ్జీలో నకిలీ సర్టిఫికెట్లను తయారు చేస్తున్న ఇద్దరు సభ్యుల ముఠాను అరెస్ట్‌ చేసినట్లు సీసీఎస్‌ సిఐ ఎన్‌.సురేష్‌కుమార్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం సీసీఎస్‌ పోలీస్‌ స్టేషన్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు. నెల్లూరు నగరంలోని మూలాపేటలో నివసించే షేక్‌ ఇలియాజ్‌, షేక్‌ సిరాజ్‌ అనే ఇద్దరు అన్నదమ్ములను కొత్తహాలు సెంటర్‌లో గల మహేశ్వరి లాడ్జీలో నకిలీ సర్టిఫికెట్లు తయారు చేస్తుండగా అరెస్ట్‌ చేశామన్నారు. ఉన్నత చదువులు చదివిన నిందితులు కంప్యూటర్‌ పరిఙ్ఞానంతో వివిధ యూనివర్సిటీలకు చెందిన డిగ్రీ, బి.టెక్‌, ఎంటెక్‌, డిప్లమా, ఇంటర్‌, టెన్త్‌ క్లాస్‌ సర్టిఫికెట్లను తయారు చేసి వాటిని బ్రోకర్ల ద్వారా రూ.10 వేల నుండి రూ.20 వేల వరకు అమ్మేవారన్నారు.



నిందితుల్లో సిరాజ్‌ పొదలకూరు మండలంలోని ఓ గ్రామంలో ఉన్నత పాఠశాలలో హిందీ పండిట్‌గా పనిచేస్తున్నాడని ఆయన తెలిపారు. లాడ్జీలో ల్యాప్‌టాప్‌, ప్రింటర్‌ సహాయంతో సర్టిఫికెట్లను తయారు చేస్తుండగా అరెస్ట్‌ చేసి వారి వద్ద నుంచి ల్యాప్‌టాప్‌, ప్రింటర్‌, ప్రింటింగ్‌ పేపర్‌, సీడీలు, రబ్బర్‌ స్టాంపులు, సుమారు 34 వివిధ యూనివర్సిటీలకు చెందిన నకిలీ సర్టిఫికెట్లు స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. జిల్లా ఎస్‌పి రమణకుమార్‌ ఆదేశాలతో నగర ఒఎస్‌డి, డిఎస్‌పి నరసింహ కిషోర్‌ ఆధ్వర్యంలో వీరిని అరెస్ట్‌ చేశామని, తనతోపాటు సీసీఎస్‌ సిబ్బంది హెడ్‌కానిస్టేబుళ్లు కె.వాసుదేవరెడ్డి, కెవి.రమణయ్య, కానిస్టేబుళ్లు శిఖామణి, వెంకటేశ్వర్లు, శేషయ్య, పోలయ్య, సురేంద్ర, వారిస్‌ అహ్మద్‌, ఇలియాజ్‌లను జిల్లా ఎస్‌పి అభినందించి రివార్డులు ప్రకటించారన్నారు.


No comments:

Post a Comment

sale your old used computer
usedsystemsblogspot.in
used computer buyer andhra pradesh