నెల్లూరు: శుక్రవారం జిల్లా వ్యాప్తంగా అన్ని లాడ్జీ ల్లో దాడులు నిర్వహించి 47 మంది రికార్డు డ్యాన్సర్లను అరెస్టు చేశారు. నెల్లూరులో స్పెషల్‌బ్రాంచ్ పోలీసులు ఒకటి, మూడు స్టేషన్ల పరిధిలోని పలు లాడ్జీల్లో తనిఖీలు చేశారు.
బృందావనంలోని ఆదర్శ్, బాబుఐస్‌క్రీం సందులోని మౌర్యా, గాంధీబొమ్మ సమీపంలోని ఎస్‌ఎస్‌ఆర్ లాడ్జీలపై స్పెషల్‌బ్రాంచ్ పోలీసులు, స్థానిక పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో సు మారు 48 మంది రికార్డు డ్యాన్సర్లను అదుపులోకి తీసుకున్నారు. ఓ నిర్వాహకుడు దాడుల నుంచి తప్పించుకుని పరారయ్యాడు. నిందితులను ఒకటి, మూడో పోలీసుస్టేషన్‌లకు తరలించి కేసులు నమోదు చేశారు. వినాయకచవితి ఉత్సవాల్లో రికార్డు డ్యాన్సులు, స్టేజ్‌డ్యాన్సులు నిషేధిస్తున్నామని 15రోజుల ముందు నుంచి నిర్వాహకులను హెచ్చరిస్తున్నామని ఎస్పీ బి.వి రమణకుమార్ తెలిపారు.
శుక్రవారం రికార్డు డ్యాన్సర్ల అరెస్ట్ నేపథ్యంలో మూడోనగర పోలీసు స్టేషన్ వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ నిందితుల వివరాలను వెల్లడించారు. నగరంలో కొందరు నిర్వాహకులు రాష్ట్రంలోని గుంటూరు, విజయవాడ, తిరుపతి, విశాఖపట్టణం, హైదరాబాద్, ఒంగోలు తదితర ప్రాంతాల నుంచి డ్యాన్సర్లను తీసుకొచ్చారని తెలిపారు. వారిని రహస్యంగా లాడ్జీల్లో ఉంచారని పేర్కొన్నారు. అనంత రం వారితో ఇప్పటికే పలుచోట్ల రికార్డు డ్యాన్సులు వేయిస్తున్నారని చెప్పారు. ఈ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా లాడ్జీలపై దాడులు నిర్వహించామన్నారు. నగరంలో 48 (22 మంది మహిళలు, 25 మంది పురుషులు)మందిని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. వారిలో రమణ అనే వ్యక్తి తప్పించుకున్నారని చెప్పారు. ఉత్సవాల్లో సాంస్కృతిక కార్యక్రమాల ముసుగులో అశ్లీల నృత్యాలు ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు. ఈ సమావేశంలో నెల్లూరు నగర ఇన్‌చార్జి డీఎస్పీ బాలవెంకటేశ్వరరావు, ఎస్‌బీ సీఐ రాంబాబు, నార్త్, సౌత్ సర్కిల్ సీఐలు సురేష్‌కుమార్‌రెడ్డి, ఎస్వీ రాజశేఖర్‌రెడ్డి, ఒకటోనగర ఇన్‌చార్జి ఎస్‌ఐ, మూడోనగర ఎస్‌ఐలు ఖాదర్‌బాషా, నాగేశ్వరరావు పాల్గొన్నా
No comments:
Post a Comment