ఇన్వర్టర్లకు పెరుగుతున్న డిమాండ్
రాపూరు: ఇటీవల కాలంలో అప్రకటిత విద్యుత్ కోతలు విపరీతంగా పెరుగుతుండడంతో ప్రత్యామ్నాయ ఏర్పాటు నిమిత్తం ఉపయోగించే ఇన్వర్టర్లకు భారీగా డిమాండ్ పెరిగింది. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలతో పాటు వ్యాపారులు, నివాసితులు సైతం అధిక సంఖ్యలో ఇన్వర్ట్టర్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి కనపరుస్తున్నారు. ప్రస్తుతం విద్యుత్ శాఖ విధిస్తున్న కరెంటు కోతలు వేసవి కాలాన్ని మరపించే రీతిలో తీవ్రతరమవుతున్నట్లు మండల ప్రజానీకం వాపోతున్నారు. పగటి పూట కనీసం ఐదు గంటల పాటు కూడా విద్యుత్ సరఫరా అందకపోవడంతో పాటు రాత్రుళ్లు నిర్వీరామంగా విధిస్తున్న కరెంటు కోతల వలన తీవ్ర అవస్థల పాలవడం ఈ మధ్యకాలంలో మండల ప్రజలకు రివాజుగా మారింది. ఇక గ్రామాల్లో అయితే చెప్పనవసరమే లేదు. కరెంటు సరఫరా ఎప్పుడు వస్తుందో... ఎప్పుడు పోతుందోనన్న అయోమయ పరిస్థితుల్లో ప్రజలు ఎదుర్కొంటున్న అవస్థలు వర్ణనాతీతంగా ఉన్నాయి.
దీంతో కార్యాలయ సేవలందించే నిమిత్తం అధికారులు, వ్యాపారులు, ప్రజలు ప్రత్యామ్నాయ ఏర్పాటుగా తప్పనిసరి పరిస్థితుల్లో ఇన్వర్టర్లను కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడడంతో వాటికి డిమాండ్‌తో పాటు తీవ్ర గిరాకీ ఏర్పడింది. ఈక్రమంలో డిస్టిబ్యూటర్లు రంగ ప్రవేశం చేసి వాడవాడలా వ్యాపార కరపత్రాలను అందిస్తూ ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. అప్రకటిత కరెంటు కోతలు తట్టుకోలేని మధ్యతరగతి ప్రజలు సైతం ఇన్వర్ట్టర్ల కొనుగోలుపెై దృష్టిసారిస్తున్నారు. వివిధ రకాల కంపెనీల పేరుతో ఇన్వర్టర్లను మార్కెట్‌లోకి దిగుమతి చేసి రూ.6 వేల నుంచి రూ.30 వేల వరకు విక్రయాలు జరుపుతున్నట్లు సమాచారం.

No comments:
Post a Comment