నెల్లూరు : జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్యనేతలు హుటాహుటిన శుక్రవారం రాష్ట్ర రాజధానికి పయనమయ్యారు. శనివారం ఉభయ సభలు సమావేశం కానున్నాయి. అసెంబ్లీ స్పీకర్, డిప్యూటీ స్పీకర్, శాసన మండలి చైర్మన్, డిప్యూటీ చైర్మన్‌లను ఎన్నుకునేందుకు ఉభయసభలూ ప్రత్యేకంగా సమావేశ పరుస్తున్నారు. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చిన నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. అన్ని పార్టీల నేతలూ వ్యూహ రచనలో తలమునకలయ్యారు. దీంతో జిల్లా నుంచి అన్ని రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధులు, ముఖ్యనేతలు ఇప్పటికే హైదరాబాద్‌కు చేరుకున్నారు. రాష్ట్ర రాజకీయాలు ఆసక్తిగా మారిన నేపథ్యంలో ప్రజాప్రనిధులు వెంట ద్వితీయ శ్రేణి నేతలు కూడా రాజధానికి వెళ్లారు. జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల్లో కొందరు జిల్లా కేంద్రం నుంచి బయలుదేరి వెళ్లగా, సొంత పనుల నిమిత్తం తిరుపతి, బెంగళూరు, చెన్నైలలో ఉన్న మరి కొందరు నేతల కూడా హైదరాబాద్‌కు చేరుకున్నారు.
జిల్లాకు చెందిన మంత్రి ఆనం రామనారాయణరెడ్డి గురువారం హైదరాబాద్‌కు వెళ్లిన సంగతి తెలిసిందే. నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి,ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి, కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి కొద్ది రోజులుగా హైదరాబాద్‌లోనే ఉన్నారు. పార్టీ సమావేశాల దృష్ట్యా హైదరాబాద్‌కు వెళ్లి శుక్రవారం తెల్లవారు జామున నెల్లూరుకు వచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్, జెడ్పీ చైర్మన్ కాకాణి గోవర్ధన్‌రెడ్డి శుక్రవారం మధ్యాహ్నం హుటాహుటిన రాష్ట్ర రాజధానికి వెళ్లారు. ఆయన రేణిగుంట నుంచి విమానంలో వెళ్లారు. సరేపల్లి ఎమ్మెల్యే ఆదాల ప్రభాకరరెడ్డి మూడురోజులుగా హైదరాబాద్‌లోనే ఉన్నారు.
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి, నగర ఎమ్మెల్యే ముంగమూరు శ్రీధర్ కృష్ణారెడ్డి కలిసి రేణిగుంట నుంచి విమానంలో వెళ్లారు. గూడూరు ఎమ్మెల్యే బల్లి దుర్గాప్రసాద్ ‘సింహపురి’ రైలులో వెళ్లారు. సూళ్లూరుపేట ఎమ్మెల్యే పరసా వెంకటరత్నం గురువారం రాత్రి తిరుపతి నుంచి వోల్వో బస్సులో బయలుదేరి శుక్రవారం ఉదయం హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి, వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ శుక్రవారం చెన్నై నుంచి విమానంలో బయలుదేరి హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రమణ్యం గురువారం ఖమ్మం పర్యటనలో ఉన్నారు. శుక్రవారం ఉదయానికే రాజాధానికి చేరుకున్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎండపల్లి శ్రీనివాసులరెడ్డి శుక్రవారం రాత్రి తిరుపతి నుంచి హైదరాబాద్‌కు బయలుదేరి వెళ్లారు.

No comments:
Post a Comment