నాయుడుపేట: జిల్లాలో మేజర్ పంచాయతీగా ఉన్న నాయుడుపేట పంచాయతీని నగరపాలక టౌన్ పంచాయతీగా మార్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని స్థానిక పంచాయతీ పాలక వర్గం తీర్మానించింది. ఇటీవల జరిగిన పంచాయతీ సమావేశంలో మున్సిపాలిటిపై చర్చ జరిగింది. మేజర్ పంచాయతీలను మున్సిపాలిటిలుగా చేయాలన్న ఆలోచనతో ప్రభుత్వం ఉన్నందున పాలకవర్గం తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపాలన్న దానిపై స్పందించిన పాలక వర్గం మున్సిపాలిటిగా మార్చితే పట్టణంలోని రోడ్ల అక్రమణలతో పాటు సందు గొందులలో ప్రభుత్వ స్థలాలు, రోడ్లు ఆక్రమణల తొలగింపు జరగడమేకాక ఇంటి పన్నుతో పాటు కోళాయి వ్యాపారం పన్నులు అధికంగా పెరగుతాయి.
అంతేకాకుండా మున్సిపాలిటిగా తీర్మాణం చేస్తే పాలక వర్గంపై ప్రజల్లో ఒక రకమైన ఆందోళన, ఆలోచనలు ఏర్పడుతాయన్న భావనలు లేకపోలేదు. దానికి తోడు పాలక వర్గం నాయకులకు రాబోయే ఎన్నికల్లో ఓట్లు దెబ్బతగులుతుందన్న భయం కూడా ఉంది. పట్టణ ప్రజల అభివృద్ధి దృష్ట్యా మున్సిపాలిటి తిర్మాణానికి వెనుకడుగు వేసినట్లు కనబడుతుంది. పంచాయతీ అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధులు మున్సిపాలిటిలు వచ్చే విధంగా నిధులు విడుదలవ్వాలంటే నగరపాలక టౌన్ పంచాయతీగా మార్పు చేయాలని పంచాయతీ తీర్మానించి ప్రభుత్వానికి పంపినట్లు తెలిసింది.
నగరపాలక టౌన్ పంచాయతీగా మార్పు చేస్తే మున్సిపాలిటిల వలే పరిపాలన కొనసాగుతుందని ఈవోకు బదులు కమీషనర్ అధికారిగా ఉంటారు. పరిపాలన విభాగం మొత్తం మున్సిపాలిటీ వలే జరుగుతుంది. నగర పాలక టౌన్ పంచాయతీగా ఉంటే పన్నుల పెంపు అక్రమణల తొలగింపు లాంటి వాటిపై ఒత్తిడి ఉండదు. అదే మున్సిపాలిటి అయితే తప్పనిసరి పై సమస్యలపై ప్రభుత్వ చర్యలు ఉంటాయి. ఈవన్నీ దృష్టిలో ఉంచుకొని రాజకీయ అంశాలను పరిగణంలోకి తీసుకొని ప్రస్తుత పాలక వర్గం నగరపాలక టౌన్ పంచాయతీ మార్పుకు మొగ్గు చూపింది. పంచాయతీ పాలక వర్గం తెదేపాకు చెందినది అయినందున కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నందున ఆ పార్టీ స్థానిక నాయకులు పంచాయతీ తీర్మాణానికి మద్దుతు పలుకుతారో లేక మున్సిపాలిటి మార్పుకు ప్రాధాన్యత ఇస్తారో వేచి చూడాల్సి ఉంది.

No comments:
Post a Comment