నెల్లూరు: ఓ మహిళా న్యాయవాదిపై గుర్తు తెలియని దుండగులు కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచి బంగారం ఎత్తుకెళ్లిన సంఘటన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని కావలిలో గురువారం చోటు చేసుకుంది. కావలిలోని వెంగళరావు నగర్‌లో ఉంటున్న రాధమ్మ అనే మహిళా న్యాయవాదిపై గురువారం ఉదయం కొందరు గుర్తు తెలియని దుండగులు కత్తితో దాడి చేశారు. కత్తితో తీవ్రంగా గాయపర్చారు. ఆమె మెడలోని 60 గ్రాముల బంగారం, నగదు ఎత్తుకు పోయారు. ఇంట్లో ఇంకా ఏమైనా విలువైనవి ఉన్నావో చూసేందుకు ఇళ్లంతా చెల్లాచెదురు చేసి వెళ్లిపోయారు.
ఉదయం రాధమ్మ రక్తపు మడుగులో ఉండటాన్ని గమనించిన స్థానికులు ఆమెను వెంటనే దగ్గరలోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు. రాధమ్మ ఇంట్లో ఒంటరిగా ఉంటుంది. భర్త లేడు. దీంతో వచ్చిన వారు కేవలం దొంగతనానికే వచ్చారా? లేక మరో కారణం ఏమైనా ఉందా? న్యాయవాది కావడంతో కేసుల విషయంలో ఘర్షణ కారణంగా హత్యా ప్రయత్నం చేశారా? అనే కోణాల్లో దర్యాఫ్తు చేస్తున్నారు. రాధమ్మ ఆరోగ్యం నిలకడగానే ఉందని తెలుస్తోంది.

No comments:
Post a Comment