నెల్లూరు : రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు గ్రామాల్లో, పట్టణాల్లోని రోడ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఆర్‌అండ్‌బి హైవే, పంచాయతీ రాజ్ శాఖల తారు రోడ్లు గుంటలు ఏర్పడి వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. గ్రామాల్లోని తారు రోడ్లు, సిమెంట్ రోడ్లు వర్షానికి తీవ్రంగా గుంటలు ఏర్పడి చిన్న వాహనం పోవాలన్నా కష్టతరంగా ఉందని ఆయా గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. నాయుడుపేట పట్టణంలోని పంచాయతీ సిమెంట్ రోడ్లు అయితే పూర్తిగా దెబ్బతిన్నాయి. డ్రైనేజ్ సిస్టమ్ కూడా తీవ్రంగా దెబ్బతినింది.
వర్షం అధికంగా కురవడంతో గ్రామాల్లోని చెరువులు పూర్తిగా నిండి పోవడంతో భయపడ్డ గ్రామస్తులు కలుజులు ఎత్తివేయడంతో ప్రమాదం జరగకుండా చెరువు కట్టలు భధ్రతకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. కురిసిన భారీ వర్షాలకు ముందు జాగ్రత్త చర్యలుగా స్థానిక రెవెన్యూ శాఖకు చెందిన తహసీల్దార్ విఠల్ తన సిబ్బందిని ఆయా గ్రామాల్లో అప్రమత్తం చేశారు. వ్యవసాయ శాఖ అధికారులు కూడా పంటలు దెబ్బతినకుండా కాపాడేందుకు రైతులకు ముందు జాగ్రత్త చర్యలు తెలియచేశారు. స్వర్ణముఖి నదిలో నీళ్ళు అధికంగా పారుతున్నాయి. తిమ్మాజికండ్రిగ, మేనకూరు రోడ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి.
మేనకూరు వద్ద ఏర్పాటువుతున్న ఫ్యాక్టరీల దృష్ట్యా రోడ్డు దెబ్బతినడంతో భారీ వాహనాలు రోడ్డుపై నడపలేక లారీ డ్రైవర్లు ఎక్కడికక్కడే నిలుపుదల చేయించారు. జిల్లా కలెక్టర్ ప్రత్యేక శ్రద్ధ వహించి యుద్ధప్రాతిపధికన రోడ్లు రిపేర్లు చేయాలని ప్రయాణీకులు, ప్రజలు కోరుతున్నారు. శనివారం పట్టణంలోని తిరుపతి హైవే రోడ్డు వద్ద పెద్ద పెద్ద గుంతలు ఏర్పడటం కారణంగా గంటల తరబడి ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. పోలీసుల చొరవతో ట్రాఫిక్‌కుఅంతరాయం లేకుండా చర్యలు తీసుకున్నారు.
No comments:
Post a Comment