కోవూరు : కోవూరులో ఉప ఎన్నికలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రసన్నకుమార్‌రెడ్డి పోటీ చేసి అత్యధిక మెజార్టీతో గెలుపొందిన విషయం తెలిసిందే. గురువారం నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి శాసనసభలో ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేశారు. ప్రసన్నకుమార్‌రెడ్డి చేసిన ప్రమాణ స్వీకారంతో ఆయన 5వ సారి శాసనసభ్యునిగా అడుగుపెట్టారు. అదేవిధంగా వై.ఎస్.ఆర్‌సిపిలో వైఎస్‌ఆర్ సతీమణి విజయమ్మ ఎమ్మెల్యేగా కొనసాగుతుండగా రెండవ ఎమ్మెల్యేగా ప్రసన్నకుమార్‌రెడ్డి అసెంబ్లీలో కొనసాగనున్నారు.
కోవూరు నియోజక వర్గ ప్రజలు అటు వైఎస్‌ఆర్ అబిమానంతో, ఇటు నల్లపురెడ్డి శ్రీనివాసులరెడ్డిపై ఉన్న మమకారంతో నల్లపురెడ్లకే కోవూరు ప్రజలు మరోసారి పట్టంకట్టి ఆ కుటుంబంపై తమకున్న అభిమానాన్ని ఈ ఉప ఎన్నిక విజయంతో మరోసారి రుజువు చేశారు. దీంతో శాసనసభలో ప్రసన్నకుమార్‌రెడ్డి ప్రమాణస్వీకారం చేస్తున్న సమయంలో జిల్లాలో ఆ పార్టీలోని కార్యకర్తలు, అభిమానులు, నేతల్లో నూతనోత్సాహాలు వెల్లివిరిశాయి.
ఆ పార్టీ కార్యకర్తలు బాణా సంచాలు కాల్చి, మిఠాయిలు పంచుకుని సంబరాల్లో తేలిపోయారు. కోవూరు నియోజక వర్గంలోని ప్రతి పల్లె వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన ప్రసన్నకుమార్ రెడ్డికి తామున్నామంటూ ఓట్ల వర్షాన్ని కురిపించి రాజశేఖర్‌రెడ్డిపై ఉన్న అభిమానాన్ని ఈ రూపంలో రుణం తీర్చుకున్నామని కోవూరు ఓటర్లు ప్రసన్న కుమార్‌రెడ్డి ప్రమాణస్వీకారం సందర్భంగా సంబరాలు జరుపుకున్నారు.
No comments:
Post a Comment