ఆత్మకూరు: మేత, నీళ్లు లేక మూగజీవాలు అల్లాడుతున్నాయి. ఎండలు మండుతుండటంలో అవస్థలు తప్పడంలేదు. దీంతో పెంపకందారులు దిక్కుతోచనిస్థితిలో ఉన్నారు. ఈ క్రమంలో ప్రభుత్వ పథకాలు వారికి అక్కరకు రావడంలేదు. మెట్టలో కష్టాలు మెట్టప్రాంతాలైన ఆత్మకూరు, ఉదయగిరి ప్రాంతాల్లో గేదెలు, మేకలు, గొర్రెలు గుక్కెడు నీటికి సైతం తహతహలాడుతున్నాయి. గడ్డిపరకలు కానరాక పశువులకు వలసబాట తప్పడంలేదు. ముదురుతున్న ఎం డలతో మూగజీవాల కష్టాలు అధికమయ్యాయి.
మూగజీవాల మేత, నీళ్ల కోసం పెంపకందారులకు అవస్థలు తప్పడంలేదు. డబ్బెట్టి గడ్డి కొనడానికి రైతులు ఊరువాడా తిరుగుతున్నారు. కాని ఈ ఏడాది మెట్టప్రాంతాల్లో వరిసాగు తగ్గడం, హార్వెస్టర్‌తో కోతలు పూర్తి చేయడంతో గడ్డిశాతం తగ్గిపోయింది. ముదురుతున్న ఎండలతో బీడుభూముల్లో పచ్చిక ఎండిపోయింది. వాగులు, వంకలు, చెలిమిల్లో నీళ్లు అడుగంటుతున్నాయి. గతంలో వేసవిలో పశువుల దాహార్తిని తీ ర్చెందుకు పొలాలు, గ్రామపొలిమే ర్లు, రోడ్డుమార్గాల వెంబడిఅక్కడక్కడ ఏర్పాటు చేసిన నీటితొట్టెలు, చేతిపంపులు, మరమ్మతులకు గురయ్యాయి. మరికొన్ని నిరుపయోగమయ్యాయి.
అక్కరకు రాని పథకాలు వేసవిలో పశువుల మేత అవసరాల కోసం, వాటి వలసలు అరికట్టడానికి, పశుగ్రాస కొరత నివార ణే లక్ష్యంగా ప్రభుత్వం పలు పథకాలను ప్ర వేశపెట్టింది. కాని ఈ పథకాలు అక్కరకు రావడంలేదు. దీంతో మెట్టప్రాంతాల్లో ఏడాదికేడాది పశుసంపద గణనీయంగా తగ్గిపోతున్నది. రెం డేళ్లక్రితం ఉపాధిహామిలో వందశా తం నిధులతో పశుగ్రాసోత్పత్తి కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మూడేళ్లపాటు పశుగ్రాసం సరిపడేలా పక్కాప్రణాళికలతో ఆరు పథకాలకు రూపకల్పన చేశారు.
పశుగ్రాసరకాల పెంపకం, పాతరగడ్డి తయారీ, సుబాబుల్ చెట్ల నీడన గడ్డిరకాల పెంపకం ఆజోలో ఉత్పత్తి తదితర పథకాల ద్వారా పాడిరైతులు లబ్దిపొందేలా వెసులుబాటు కల్పించింది. వీటి అమలుకుకు ఉపాధిహామి పథకంలో భూ మిదున్నకం, గడ్డివిత్తనాలు చల ్లడం, కలుపు తీయటం నీరుపెట్టటం,పశుగ్రాసం కోయడం తదితర పనులకు నిధులు కేటాయిచారు. అయితే ఈ పథకాలు అమలులో జాప్యంతోపాటు, అర్హులైనవారి దరిచేరడంలేదు.
No comments:
Post a Comment