నెల్లూరు: భానుడు విశ్వరూపం చూపాడు.. ప్రజానీకం విలవిల లాడారు..ఈ వేసవి సీజన్‌లో అత్యధికంగా గురువారం 42.4 డిగ్రీల ఉష్ణోగత్ర నమోదయింది. ఉదయం 8 గంటల నుంచే వేసవి ప్రతాపం తీవ్రం కావడంతో ప్రజల పరిస్థితి అస్తవ్యస్తంగా తయారైంది. వేసవి తాపానికి తట్టుకోలేక పలువురు ఇళ్లకే పరిమితమయ్యారు.
ఎండలోనే పనులు చేయాల్సిన కార్మికుల పరిస్థితి అత్యంత భయానకంగా తయారైంది. ఎండ ప్రభావం నుంచి తప్పించుకునేందుకు ప్రజానీకం నానాతంటాలు పడ్డారు. మహిళలైతే పైట కొంగులను నెత్తిపై వేసుకుని కాస్తై వేసవి తాపాన్ని నివారించుకునే ప్రయత్నం చేశారు. నీడనిచ్చే వస్తువు ఏది చేతిలో ఉన్నా దానిని అడ్డంగా పెట్టుకుని ఎండ నుంచి సేద తీరారు.
నెల్లూరు నగరంలో ఉదయం 12.30 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ప్రధాన రహదారులన్నీ నిర్మానుష్యంగా మారాయి. కొబ్బరి బొండాంలు, మజ్జిగకు మంచి డిమాండ్ ఏర్పడింది. ఎండవేడిమితో గ్రామాల్లో ఉపాధి పనులకు వెళ్లేందుకు కూలీలు భయపడుతున్నారు. ఉపాధి పనులు జరగడం కనాకష్టంగా మారింది. ఈ పరిస్థితి రెండు రోజులు ఉంటుందని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

No comments:
Post a Comment