జలదంకి : ఉదయగిరి నియోజకవర్గ పరిధిలోని జలదంకి మండలం జమ్మలపాలెం గ్రామానికి బుధవారం ఉదయం వైఎస్సార్సీపీ నాయకులు మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి ఉప ఎన్నికల ప్రచారానికి వచ్చా రు. ఈ సందర్భంగా వారికి అడుగడుగునా అడ్డంకులు ఎదురయ్యాయి. జమ్మపాలెంలో జరిగిన ప్రచారంలో మహిళలు ఖాళీబిందెలతో వారికి నిరసన తెలిపారు. మీరు ఎంపీ, ఎమ్మెల్యేలు అయిన తరువాత మూడేళ్లకాలంలో ఒక్కసారికూడా తమ గ్రామానికి రాలేదని, గ్రామసమస్యలు పరిష్కరించలేదని అడ్డుకున్నారు. నీటి ఎద్దడి తీవ్రంగా ఉన్నా ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. ఇంకా పలు గ్రామ సమస్యలపై ప్రశ్నలవర్షం కురిపించారు. ఓ దశలో మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి సమస్యలపై ప్రశ్నిస్తున్న ఓ యువకుడిపై ఆగ్రహించారు. ఏంమాట్లాడుతున్నావ్‌నువ్వు... పెద్దమగాడిలా... అంటూ రెచ్చిపోయారు.
స్థానిక నేతలు కలుగచేసుకుని సముదాయించారు. అనంతరం రాజమోహన్‌రెడ్డి మాట్లాడుతూ మీసమస్యలపై స్పందించని విషయం వాస్తవమేనని అంగీకరించారు. మీగ్రామంలో మంచినీటిసమస్య ఉందనే విషయమే తమకుతెలియదని, మేం ప్రజాప్రతినిధులులగా తిరిగి ఎన్నికైన తరువాత ఖచ్ఛితంగా మీసమస్యలు తప్పకతీరుస్తామని హామీఇచ్చారు. అనంతరం మండలంలోని లింగరాజుఅగ్రహారం, కేశవరం, చోడవరం, గట్టుపల్లి పంచాయతీలలో వారు ప్రచారం నిర్వహించారు. అక్కడ కూడా స్థానికులు పలు సమస్యలపై వీరిని ప్రశ్నించారు. జలదంకి మండలంలో నాలుగురోజులపాటు జరిగే ప్రచారంలో మొదటిరోజే మేకపాటి సోదరులకు చుక్కెదురైంది.

No comments:
Post a Comment