online marketing

Saturday, November 30, 2013

MLA STYLE - Difference between Film STAR and VOTER



Saturday, July 27, 2013

Nellore Panchayat 2nd time polling Results


      Congrees         TDP    YSRCP CPI OTHERS
Nellore    49 38    88  03    54

Tuesday, July 23, 2013

VOTERS TIME TO DRUNK BRANDY NELLORE ....

Nellore Panchayat results 2013

congress tdp ysrcp cpi/cpm others
109 91 108           01 45

Thursday, May 2, 2013

ఒక్కసారిగా భగ్గుమన్నాయి. జిల్లా కన్వీనర్‌.......తొలి రోజే చేదు అనుభవం......


నెల్లూరు - నెల్లూరు నాయకుల మధ్య ఉన్న విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. జిల్లా కన్వీనర్‌గా ఎన్నికైన మేరిగ మురళీధర్ మొదటిసారిగా బుధవారం నెల్లూరుకు రాగా, ఆయనకు స్వాగతం పలుకుతూ పెద్దఎత్తున ఏర్పాట్లు చేశారు. అయితే, ఈ కార్యక్రమానికి ఏడు నియోజకవర్గాల సమన్వయకర్తలు డుమ్మా కొట్టారు. అంతేగాక నిన్నటి వరకు వైసీపీ జిల్లా కార్యాలయం పేరుతో ఉన్న బోర్డు రాత్రికి రాత్రే అదృశ్యమైంది. ఆ స్థానంలో పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి పేరుతో బోర్డు వెలసింది. వెంకటగిరి సమన్వయకర్త కొమ్మి లక్ష్మయ్యనాయుడు నియామకంపై ఆ నియోజకవర్గ నేతలు ఘర్షణకు దిగారు. దీంతో కొత్త కన్వీనర్‌కు తొలి రోజే చేదు అనుభవం ఎదురైంది.

వైసీపీ ఆవిర్భావం నుంచి జిల్లా కన్వీనర్‌గా ఉంటున్న కాకాణికి ఉద్వాసన పలకాలని అధిష్ఠానం నిర్ణయించింది. ఇది తెలుసుకున్న కాకాణి ముందుగానే జిల్లా కన్వీనర్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డిల వర్గీయుడు పాపకన్ను రాజశేఖర్‌రెడ్డి ముఖ్య అనుచరుడు మేరిగ మురళీధర్‌కు జిల్లా పార్టీ పగ్గాలు అప్పగించారు.

కొత్త కన్వీనర్‌కు ఘన స్వాగతం పలికేందుకు జిల్లాలోని పార్టీ ముఖ్యులందరికీ రెండు రోజుల క్రితమే వర్తమానం పంపి, హాజరు కావాలని పిలుపునిచ్చారు. విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకుని పినాకినీ ఎక్స్‌ప్రెస్‌లో నెల్లూరుకు చేరిన మురళీధర్‌కు రైల్వేస్టేషన్‌లో నగర కన్వీనర్ ఆనం వెంకటరమణారెడ్డి, రూరల్ కన్వీనర్ కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిలతో పాటు పలువురు నాయకులు స్వాగతం పలికారు. అక్కడి నుంచి ఊరేగింపుగా గాంధీబొమ్మ సర్కిల్‌కు చేరుకుని గాంధీ, వైఎస్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

మళ్లీ ర్యాలీగా బయలుదేరి కలెక్టర్ బంగ్లా వద్ద ఉన్న వైసీపీ జిల్లా కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడే కారు పార్కింగ్ స్థలంలో విలేఖర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటగిరి నియోజకవర్గానికి వలస నేతలు అవసరం లేదని, పార్టీ నడిపే సత్తా స్థానికులకు ఉందని నెమ్మలపూడి సురేష్‌రెడ్డి ఆధ్వర్యంలో కొందరు మురళీధర్‌తో వివాదానికి దిగారు. తక్షణం కొమ్మి లక్ష్మయ్యనాయుడును వెనక్కు పంపించాలంటూ కార్యకర్తల అరుపులు, కేకలతో ఘర్షణకు దిగారు. దీంతో ఆలస్యంగా మేల్కొన్న కొంతమంది నాయకులు వారికి సర్దిచెప్పి, అక్కడి నుంచి పంపేశారు.

అదృశ్యమైన బోర్డు

రెండేళ్ల క్రితం జిల్లా కన్వీనర్‌గా బాధ్యతలు చేపట్టిన కాకాణి గోవర్ధన్‌రెడ్డి కలెక్టర్ బంగ్లా వద్ద ఓ ఇంటిని అద్దెకు తీసుకుని పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తూ వచ్చారు. అప్పట్లో నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి ఈ కార్యాలయాన్ని ప్రారంభించారు. కాలక్రమేణా మేకపాటి, కాకాణిల మధ్య విభేదాలు తీవ్రం కావడంతో మేకపాటి సోదరులు, వారి వర్గీయులు మేకపాటి అతిథి గృహంలోనే పార్టీ కార్యక్రమాలు, సమావేశాలు నిర్వహిస్తూ వచ్చారు. దీంతో జిల్లా పార్టీ కార్యాలయం బోసిపోయింది. కన్వీనర్ బాధ్యతల నుంచి తనను తప్పించాలని మేకపాటి సోదరులు ప్రయత్నిస్తున్నారని తెలుసుకున్న కాకాణి కూడా ఆ కార్యాలయం వైపు చూడటం మానేశారు. ఈ నేపథ్యంలోనే పార్టీ జిల్లా కన్వీనర్‌గా మేరిగ మురళీధర్ నియమితులు అయ్యారు. ఈయన రాకకు ముందురోజే మంగళవారం రాత్రి జిల్లా పార్టీ కార్యాలయం బోర్డు అదృశ్యమైంది. ఆ స్థానంలో 'వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యనిర్వాహక కమిటీ సభ్యుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి వారి కార్యాలయం'' పేరుతో బోర్డు వెలిసింది. పార్టీ కార్యాలయానికి చేరుకున్న మేరిగ ఆయన అనుచరులు ఈ బోర్డును చూసి అవాక్కయ్యారు. దీంతో కార్యాలయంలోకి అడుగు పెట్టకుండా ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, కన్వీనర్ మేరిగ మురళీధర్ తదితరులు కారు పార్కింగ్ స్థలంలోనే సమావేశం నిర్వహించి నిష్క్రమించారు.

సమన్వయకర్తల డుమ్మా

వైసీపీ జిల్లా కన్వీనర్ మురళీధర్ స్వాగత కార్యక్రమానికి ఏడు నియోజకవర్గ సమన్వయకర్తలు డుమ్మా కొట్టారు. ఆత్మకూరు, కోవూరు, కావలి, నెల్లూరు సిటీ, వెంకటగిరి, సూళ్లూరుపేట, సర్వేపల్లి నియోజకవర్గాల కన్వీనర్లు ఇటు వైపు కన్న్తెత చూడలేదు. నెల్లూరు సిటీ సమన్వయకర్త అనిల్ నెల్లూరులోనే ఉన్నా ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు. వీరంతా కాకాణి వర్గం కావడంతో హాజరు కాలేదని ఆ పార్టీ నేతలే బహిరంగంగా చర్చించుకుంటున్నా రు. ఓ ముఖ్యనేత మాట్లాడుతూ ఓ దళితుడికి పదవి ఇవ్వడంపై ఇష్టంలేకే కొందరు ఇలా చేస్తున్నారని అన్నారు. కనీసం వారం రోజుల తరువాత అయినా వైసీపీ కార్యాలయ బోర్డు మార్చి ఉంటే ఈ రగడ జరిగేది కాదన్నారు. మరో నేత ఈ వివాదాన్ని రాద్దాంతం చేయవద్దంటూ పేర్కొన్నారు.

Saturday, April 13, 2013

ఓ బాలుడు రెబల్ సినిమా చూశా..కారు దొంగతనం.ప్రయత్నించా..

నెల్లూరు: సినిమా ప్రభావంతో ఓ బాలుడు దారుణానికి ఒడిగట్టాడు. ప్రభాస్ హీరోగా నటించిన రెబల్ సినిమాలో లాగా చేయాలని అనుకుని ఓ బాలుడు కారు డ్రైవర్ గొంతును బ్లేడ్‌తో కోశాడు. ఈ విషయాన్ని ఆ బాలుడు స్వయంగా పోలీసుల వద్ద వెల్లడించాడు. ఈ సంఘటన నెల్లూరు జిల్లా సైదాపురం సమీపంలోని షామైన్ వద్ద శుక్రవారం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి - చిల్లకూరు మండలం చింతవరానికి చెందిన హైమవతి కుమారుడు (12) గూడూరులోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్నాడు. చింతవరం నుంచి శుక్రవారం స్కూల్ బస్సులో బయలుదేరిన బాలుడు గూడూరులో సాయిబాబా గుడి వద్ద దిగిపోయాడు. అక్కడి నుంచి పాత బస్టాండ్ సమీపంలోని కారు స్టాండ్ వద్దకు వెళ్లాడు. తన తల్లి కారు బాడుగకు తీసుకుని రావాలని చెప్పిందని యజమానితో చెప్పాడు. దీంతో అతడు ఇన్నోవా కారును బాలుడి వెంట పంపించాడు. సైదాపురం సమీపంలోని షామైన్ బోర్డు వద్ద ఏమరుపాటుగా ఉన్న డ్రైవర్ కరీముల్లా గొంతును బాలుడు బ్లేడుతో కోశాడు. కారు స్లో కావడంతో దిగి పరుగు పెట్టాడు. డ్రైవర్ కేకలు వేయడంతో సమీపంలోని వారు బాలుడిని పట్టుకున్నారు. డ్రైవర్‌ను ఆస్పత్రికి తరలించారు. గురువారం రాత్రి రెబల్ సినిమా చూశానని, అదులో కారు దొంగతనం చేసిన విధంగానే తానూ చేయాలని ప్రయత్నించానని బాలుడు నవ్వుతూ చెప్పాడని పోలీసులు అంటున్నారు.

Friday, April 5, 2013

నేటి నుంచి ప్రతి రెండవ శనివారం.....నెల్లూరులోనే తిరుపల తిరుపతి స్వామివారి ప్రసాదం

నెల్లూరు; నెల్లూరులో నేటి  నుంచి ప్రతి రెండవ శనివారం తిరుపల తిరుపతి దేవస్ధానం నుంచి శ్రీవారి ప్రసాదం విక్రయించబడుతుందని టిటిడి మేనేజర్‌ యల్‌ రాంగోపాల్‌ తెలిపారు. శుక్రవారం స్ధానిక టిటిడి కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్వామివారి ప్రసాదం టిటిడి కళ్యాణ మండపంలో మాత్రమే దొరుకుతుందని పేర్కొన్నారు. అలాగే ఏప్రిల్‌ నేలలో ధార్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నామని వివరించారు. ఈసందర్భంగా పలు భజన, ఉపన్యాస కార్యక్రమాలు జరుగుతాయన్నారు. ప్రస్తుతం టిటిడి చరిత్రలో తిరుమల వాసుని కళ్యాణ మహోత్సవాలు, స్వామికి పలు విశే ష పూజలు గావించేది నెల్లూరులోనే అన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొనే శ్రీవారి భక్తుల కోసం స్వామి వారి ప్రసాదాన్ని ఈవిధంగా అందజేయనున్నామని పేర్కొన్నారు.

Wednesday, March 20, 2013

యువతి ఐదుగురిని పెళ్లాడింది... మొదటి భర్త సోదరులను వివాహం

ఓ యువతి ఐదుగురిని పెళ్లాడిన సంఘటన ఉత్తరాఖండ్‌లో చోటు చేసుకుంది. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని డెహ్రాడూన్‌కు సమీపంలోని రాజోవర్మ అనే యువతి ఐదుగురిని పెళ్లాడింది. మొదటి భర్త సోదరులను వివాహం చేసుకోవడం ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని డెహ్రాడూన్‌కు సమీప ప్రాంతాల్లో ఓ సంప్రదాయం. ఈ ప్రాంతానికి చెందిన ఇరవయ్యొక్క ఏళ్ల రాజోవర్మ అనే మహిళ ఈ ఆచారాన్ని కొనసాగించింది. నాలుగేళ్ల క్రితం ఆమె గుడ్డు వర్మ అనే యువకుడిని పెళ్లి చేసుకుంది. తర్వాత అతడి సోదరులు బైజు వర్మ, శాంతారామ్ వర్మ, గోపాల్ వర్మ, దినేశ్ వర్మను కూడా వరుసగా వివాహం చేసుకుంది. సంప్రదాయంలో భాగంగానే ఇలా వివాహం చేసుకున్నామని రాజోవర్మ వెల్లడించింది. తామంతా ఒకే ఇంటిలో నివసిస్తున్నామని, తమ మధ్య ఎటువంటి విభేదాలు లేవని స్పష్టం చేసింది. తమ వైవాహిక జీవితం ఎంతో ఆనందంగా ఉందని ఆమె భర్తలు చెబుతున్నారు. మరో విషయం వారికి పద్దెనిమిది నెలల బాబు కూడా ఉన్నాడు. అయితే ఆ బాబు తండ్రి ఆ ఐదుగురిలో ఎవరో తెలియదని వారు చెబుతున్నారు. ఐదుగురితో పెళ్లి అంటే మొదట అందరూ ఇబ్బందిగా భావించారని, తాను మాత్రం అలా భావించలేదని రాజోవర్మ చెప్పింది. తాము ఐదుగురం అన్నదమ్ములం ఆమెతో సంసారం చేస్తున్నామని, తమలో ఎవరికీ ఒకరిపై మరొకరికి అసూయ, ద్వేషం లేదని మొదటి భర్త గుడ్డు వర్మ అన్నాడు. గుడ్డు వర్మను నాలుగేళ్ల క్రితం పెళ్లి చేసుకున్న రాజోవర్మ ఆ తర్వాత బిజ్జు వర్మ(32), శాంతారామ్ వర్మ(28), గోపాల్ వర్మ(26)లను పెళ్లి చేసుకుంది. ఆఖరు తమ్ముడు దినేష్ వర్మకు గతేడాది పద్దెనిమిదేళ్లు దాటాయి. దీంతో అతనిని గతేడాది పెళ్లి చేసుకుంది. వారంతా ఒకే గదిలో ఉంటున్నారు.

Wednesday, February 6, 2013

Monday, January 7, 2013

నెల్లూరులో ఫ్లెమింగో ఫెస్టివల్‌ ప్రారంభం


నెల్లూరు జిల్లాలోని సూళ్లూరుపేటలో ఈనెల 8 నుంచి మూడు రోజులపాటు పక్షుల పండుగ (ఫ్లెమింగో ఫెస్టివల్‌)ను రేపు కేంద్రమంత్రి టూరిజం శాఖమంత్రి చిరంజీవి బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో ప్రారంభించనున్నారు. ఘనంగా నిర్వహించే ఈ కార్యక్రమానికి ఆర్థిక శాఖమంత్రి ఆనం రాంనారాయణరెడ్డి తదితరులు పాల్గొననున్నారు.

నెల్లూరుకు చెందిన ఐటీ అధికారి.. విమానంలో వెకిలి చేష్టలు


 విమానంలో ఓ మహిళా అధికారిణిపై అనుచితంగా ప్రవర్తించిన ఐటీ అధికారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్‌ నుంచి తిరుపతి వస్తున్న విమానంలో నెల్లూరుకు చెందిన ఐటీ అధికారి జయశంకర్‌ ఓ మహిళా అధికారిణిపై వెకిలిచేష్టలతో అసభ్యంగా ప్రవర్తించారు. జయశంకర్‌పై విమానం దిగగానే సమీపంలోని పోలీసు స్టేషన్‌లో ఆమె ఫిర్యాదు చేశారు. జయశంకర్‌ మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు అనుమానించి పరీక్షల నిమిత్తం రుయా ఆసుపత్రికి తరలించారు

Saturday, January 5, 2013

నెల్లూరు నగరం స్మార్ట్‌ సిటీ.......శాటలైట్‌ ద్వారా సిగ్నలింగ్‌ సిస్టమ్‌తో

నెల్లూరు నగరం స్మార్ట్‌ సిటీగా ఎంపికైందని నెల్లూరు నగర ఎమ్మెల్యే ముంగమూరు శ్రీధర్‌కృష్ణారెడ్డి తెలిపారు.  ఈ సందర్భంగా ముంగమూరు మాట్లాడుతూ నెల్లూరు స్మార్ట్‌ సిటీగా ఎంపికైందని ఇక నగర ప్రజలకు ట్రాఫిక్‌ సమస్య తీరనుందన్నారు. శాటలైట్‌ ద్వారా సిగ్నలింగ్‌ సిస్టమ్‌తో రూపొంది స్తున్న స్మార్ట్‌ సిటీ ద్వారా నేరాలు చేసే వారిని కూడా గుర్తించవచ్చన్నారు. 

Wednesday, December 5, 2012

తీర ప్రాంత ప్రజలు క్షణం..క్షణం భయం..భయంగా

వరుణుడు ఎట్టికేలకు జిల్లా ప్రజానీకంపై కరుణ చూపారు. జిల్లాలో ఎక్కడ చూసిన భారీ వర్షాలకు ఆదివారం అర్ధరాత్రి నుండి వరుణుడు కరుణ చూపడంతో వర్షాలు ఆశించిన స్థాయిలోనే కురుస్తున్నాయి. జిల్లాలోని రైతాంగం ఆనందానికి అవదులు లేకుండా పోతున్నాయి. అన్ని చెరువులు నేడు కొత్త నీరు జలకళతో కళకళలాడుతున్నాయి. వాగులు, వంకలు పరవళ్ళు తోక్కుతూ పారుతున్నాయి. నగరంలోని అన్ని ప్రధాన రహదారులు జలమయంగా మారాయి. దీనితో వాహన చోదకులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని ముఖ్య రహదారులు భారీ వర్షాలకు దెబ్బతిన్నాయి. మంగళవారం ఉదయం నుండి వర్షాలు అధిక శాతంలో కురుస్తుండడంతో సామాన్య ప్రజానీకం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 

మూడు రోజలుగా కురుస్తున్న వర్షాలకు జిల్లాలో తడ అత్యధికంగా 2.10 సెంటీ మీటర్లు నమోదు అయ్యింది. అదేవిధంగా అత్యల్పంగా ఉదయగిరిలో 1.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనది. మూడు రోజలుగా కురుస్తున్న వర్షాలకు జిల్లా అంతటా విస్తార ంగా వర్షాలు కురిశాయి. నగరంలోని అన్ని ప్రదానా రహదారులు జలమయంగా మారాయి. జిల్లాలోని అన్ని ప్రధానా రహదారులు దెబ్బ తిన్నాయి. భారీగా కురుస్తున్న వర్షాల నుండి ఇప్పటికే వేసుకొన్న నారుమళ్ళును కాపాడుకొవడానికి రైతులు నానాకష్టాలు పడ్డారు. తీర ప్రాంత ప్రజలు క్షణం..క్షణం భయం..భయంగా గడిపారు. 

భారీ వర్షాలకు పెరుగుతున్న అలల ఉదృతీకి తోడు, ఈదురు గాలులకు ప్రజలు తీవ్ర భయాదోళనకు లోనైయారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఎటువంటి కూలి పనులు లేక కూలీలు పూట గడవక అవస్థలు ఎదుర్కొన్నారు. కొన్ని సమస్యత్మాక గ్రామాలకు ఆర్టీసి అధికారులు బస్సు సర్విసులను నిలిపివేశారు. భారీ వర్షాలకు జిల్లాలోని కొన్ని చిన్నచిన్న బ్రిడ్జిలు, చప్టాలు స్వల్పంగా దెబ్బతినడంతో రాకపోకలకు అంతరాయం కల్పింగింది. నగరంలో చిన్న చిన్న వ్యాపారులు చేసుకొనే వారు ఈ వర్షానికి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అప్పు చేసి కొన్న సరుకులు అమ్ముడుపోకా లభోదిభోమంటూన్నారు. నగరంలోని ఆత్మకూరు, విజయమహల్‌గేల్‌, మాగుంటలేఅవుట్‌ అండర్‌ బ్రిడ్జీలలో నీరు చేరడంతో వాహన రాకపోకలకు అంతారాయం కల్గింది.నగరంలోని ఆర్‌డిఒ, తహసిల్దార్‌ కార్యాలయాలు రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షానికి ఉరుస్తున్నాయి. ముఖ్యంగా ఆర్‌డిఒ కార్యాలయం లోపలి గోడలు కొన్ని చోట్ల పగుళ్లు ఇచ్చివుండడంతో కార్యాలయంలోకి వర్షపు నీరు ప్రవహిస్తోంది. దీంతో కార్యాలయంలోని పలు ఫైళ్లు తడుస్తున్నట్లు తెలుస్తోంది. పురాతన కట్టడం కాబట్టి గోడలు పగుళ్లు ఇచ్చి కొద్దిపాటి చినుకు పడితే వర్షపునీరు కార్యాలయం లోపలికి గోడల నుంచి ప్రవేశిస్తున్నాయి. దీంతో సిబ్బంది అనేక ఇబ్బందులకు గురికాక తప్పడం లేదు. అలాగే తహసిల్దార్‌ కార్యాలయం ఎదుట వర్షపు నీరు నిల్వ ఉండడంతో ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. దూరప్రాంతాల నుంచి తమ సమస్యలను అధికారుల వద్ద విన్నవించు కునేందుకు తరలి వస్తుండడంతో వారు ఈ ప్రాంతంలో పలు ఇబ్బందులకు గురవుతున్నారు. ఇకనైనా సంబంధిత అధికారులు స్పందించి ఆర్‌డిఒ కార్యాలయంలో ఉన్న స్వల్ప సమస్యను తీర్చాల్సిన అవసరం ఎంతైనా వుంది. అలాగే ప్రాంగణంలో వర్షపు నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఎంతైనా వుంది.

Tuesday, October 9, 2012

ఆత్మాభిమానం దెబ్బతిన్న యువకుడు తల్లి చూస్తుండగానే ఆత్మహత్య

నెల్లూరు: నెల్లూరు నగరంలో 18 ఏళ్ల ఓ యువకుడిని సెల్‌ఫోన్‌ చోరీ చేశాడని తీవ్రంగా కొట్టడంతో ఆ యువకుడు మనస్తాపంతో తల్లి ఎదుటే ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. స్థానికులు ఇచ్చిన రహస్య సమాచారం మేరకు వివరాలిలా వున్నాయి. స్థానిక టెక్కేమిట్టలో తమిళనాడు రాష్ట్ర అరక్కోణంకు చెందిన ఆర్ముగం సుమారు 20 ఏళ్ల క్రితం నెల్లూరుకు వలస వచ్చి టెక్కేమిట్టలోని రెైల్వేగేటు సమీపంలో పూరిపాక వేసుకుని నివసిస్తున్నాడు. ఇతనికి మహేష్‌, రూపేష్‌ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. మహేష్‌ చదువుకుంటుండగా రూపేష్‌ పెయింటింగ్‌ పనికి వెళ్తూ ఇంటికి సహాయపడేవాడు. రూపేష్‌ వారి ఇంటి సమీపంలో నివసించే కమతం రమణయ్య కుమారుడు రమేష్‌ తో పెయింటింగ్‌ పనికి వెళ్లేవాడు. గత నెల వినాయ చవితి సందర్భంగా రూపేష్‌ రమేష్‌తో పాటు ఉండగా రమేష్‌ సెల్‌ఫోన్‌ కనిపించలేదు.

దీంతో రమేష్‌ కోపోద్రిక్తుడెై నువ్వే సెల్‌ఫోన్‌ దొంగిలించావని అంటూ రూపేష్‌పెై దాడి చేసి తీవ్రంగా కొట్టాడు. అప్పటికీ శాంతించని రమేష్‌ రూపేష్‌ను తీసుకుని వారి ఇంటి వద్దకే వెళ్లగా రూపేష్‌ తల్లిని ఇంటిలో నుండి పిలిచి ఆమె ఎదుటే రూపేష్‌ను అసభ్య పదజాలంతో దూషిస్తూ మరలా కొట్టాడు. కొద్దిసేపటికి రమేష్‌ వెళ్లిపోగా తల్లి ఎదుటే తనకు ఇంత అవమానం జరగడంతో ఆత్మాభిమానం దెబ్బతిన్న రూపేష్‌ తల్లి చూస్తుండగానే ఇంటి పక్కనే వున్న రెైల్వేట్రాక్‌ వెైపు పరుగెత్తుకుని వెళ్లి అప్పుడే అటు వెళ్తున్న రెైలుకు అడ్డం పడ్డాడు. రూపేష్‌ను రెైలు ఢీకొనడంతో అక్కడికక్కడే రూపేష్‌ మరణించినట్లు విశ్వసనీయ సమాచారం. దీంతో మృతుడు రూపేష్‌ తల్లిదండ్రులు బోరున విలపిస్తూ కుమారుడి మృతదేహం వద్ద కుప్పకూలిపోయారు. ఈ విషయం తెలిసి రమేష్‌ వారి వద్దకు వెళ్లి వారిని కేసులు పెట్టకుండా బెదిరించి రూపేష్‌ మృతదేహాన్ని కాల్చి బూడిద చేసేలా వారిపెై ఒత్తిడి తెచ్చారు. 

అనంతరం కొద్ది రోజులు రమేష్‌ పరారీలో ఉండి విషయం చల్లబడిందని తెలిసి బయటకు వచ్చినట్లు సమాచారం. మీకు మరో కొడుకు వున్నాడని, ఈ విషయం బయటకు చెబితే వాడిని చంపేస్తానంటూ మృతుడి తండ్రిని రమేష్‌ , అతని కుటుంబ సభ్యులు బెదిరించినట్లు, తాము రాష్ట్రం కాని రాష్ట్రం వచ్చి బతుకుతున్నామని, ఇక్కడ తమకేదెైనా జరిగితే దిక్కే లేదని, అందుకే విషయం బయటకు చెప్పలేకపోయామని రూపేష్‌ తండ్రే మీడియా అని తెలియక విలేకరులకు తెలిపాడు. ఆలస్యంగా వెలుగు చూచిన ఈ సంఘటనపెై రెైల్వే పోలీసులకు కాని, ఇటు లా అండ్‌ ఆర్డర్‌ పోలీసులకు కాని ఎటువంటి సమాచారం ఇవ్వకుండా ఆ వ్యక్తులు రూపేష్‌ కుటుంబ సభ్యులను తీవ్రంగా భయభ్రాంతులకు గురిచేసి వారిని నోరు మూయించారు. దీనిపెై పోలీసులకు ఎటువంటి సమాచారం లేకపోవడంతో కేసు మూత పడినట్లేనని రమేష్‌ కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. ఇకనెైనా పోలీసులు ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుని ఈ కేసును పరిశోధించి నిజాలను నిగ్గు తేల్చి బాధితులకు న్యాయం చేసి నేరస్తులను శిక్షించాల్సివుంది

సైకో కత్తితో వీరంగం...

చేజర్ల: చేజర్లలోని స్థానిక బస్టాండు సెంటరు వద్ద సైకోగా మారిన మొద్దు వెంకట రమణయ్య కత్తితో వీరంగం సృష్టించడంతో ఇద్దరు యువకులు గాయాల బారినపడి తీవ్ర రక్తస్రావంతో కొట్టుమిట్టాడుతున్న సంఘటన సోమవారం చోటుచేసుకుంది. వివరాల ప్రకారం మొద్దు వెంకట రమణయ్య గత కొంతకాలంగా చేజర్ల బస్టాండు సెంటరువద్దగల దుకాణాల సెంటర్లో చిన్నచిన్న పనులు చేస్తూ జీవిస్తున్నాడు. ఆదివారం డబ్బులు విషయంలో జరిగిన చిన్న ఘర్ణణతో అతను సైకోగామారి ఆదివారం ఉదయం కత్తితో అహ్మద్‌బాషా, రియాజ్‌ అనే యువకులపెై దాడిచేసి గొంతుపెై గాయపరిచాడు. అతని సమీపంలోని మరొక యువకుడు రియాజ్‌ మోచేతిపెై గాయపరిచాడు. 

బస్టాండు సెంటరు వద్ద రిక్షాతోలుకుంటూ జీవనం గడుపుతున్న అహ్మద్‌బాషాకు తీవ్ర రక్తస్రావం కావడంతో వీరిద్దరిని 108సాయంతో వెైద్యచికిత్సలకోసం నెల్లూరు ప్రభుత్వ వెైద్యశాలకు తరలిం చారు. సైకోగామారిన మొద్దు రమణయ్య బస్టాండు సెంటరు వద్ద వీరంగం సృష్టిస్తూ దగ్గరికి వెళ్లినవారిపెై దాడిచేయడం మొదలుపెట్టాడు. ఈ దాడిని అడ్డుకోబోయిన హెడ్‌ కానిస్టేబుల్‌ పరంధామయ్యపెై సైతం ఆ సైకో దాడికి దిగడంతో అతను తృటిలో ప్రమాదంనుండి తప్పించుకు న్నాడు. బస్టాండులోని ప్రజలు అతని వద్దకు వెళ్లాలంటే భయాందోళనలకు గురయ్యారు. అందరూ కలసి సమిష్టిగా అతన్ని పట్టుకొని అతనివద్ద నుండి కత్తిని తీసివేసి పోలీస్‌ సిబ్బంది సహకారంతో పోలీస్టేషన్‌లో అప్పగించడం జరిగింది. 

అయితే ఇతడు గతంలో ఆదురుపల్లి సెంటరు వద్ద ఒక మహిళ చెవిని కోయడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేసి అతన్ని గ్రామం నుండి తరిమివేయడం జరిగింది. ఇతను చేజర్ల మండలం పెళ్లేరు గ్రామానికి చెందిన వ్యక్తిగా స్థానికులు తెలిపారు. ఇతను ఏ గ్రామంలోవున్నా అక్కడ ఏదోఒక గొడవచేసి పలువురుని గాయపరచిన సంఘటనలు అనేకం ఉన్నాయి. చేజర్ల బస్టాండు వద్ద జరిగిన సంఘటనతో ప్రజలు సైకో ప్రవర్తనపెై భయాందోళనలు చెందుతూ బిక్కుబిక్కుమంటున్నారు. ఇతను బయట సంచరిస్తే అనేకమందిని గాయపరచి ప్రాణాలు తీసే ప్రమాదంవుందని గ్రామస్తులు తెలుపుతు న్నారు. స్థానిక ఎస్‌ఐ రంగనాథ్‌గౌడ్‌ సైకోను అదుపులోకి తీసుకొని అతనిపెై కేసు నమోదుచేసి కోర్టుకు హాజరుపరచనున్నట్లుగా ఆయన తెలిపారు. 

ప్రజల సహకారంతో ఇటువంటి వ్యక్తులను అదుపుచేయడం జరుగుతుందన్నారు. ఎవరెైనా అనుమానిత వ్యక్తులుగా సంచరిస్తుంటే పోలీస్టేషన్‌లో సమాచారాన్ని అందించాలన్నారు. ఇటువంటి వారిపెై చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. హెడ్‌కానిస్టేబుల్‌ పరంధామయ్య, కానిస్టేబుల్‌ రఫిలు పాల్గొన్నారు.

Monday, September 24, 2012

ఎస్2 మల్టిఫ్లెక్స్‌లోకి చిత్ర బృందం


నెల్లూరు : ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల చిత్రం ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ చిత్ర యూనిట్ నెల్లూరులో సోమవారం సందడి చేసింది. చిత్ర విజయయాత్రను నెల్లూరు నుంచే ప్రారంభించారు. నగరంలో చిత్రం ప్రదర్శిస్తున్న ఎస్2 మల్టిఫ్లెక్స్‌లోకి చిత్ర బృందం ఒక్కసారిగా రావడంతో అభిమానులు కేరింతలు కొట్టారు. దర్శకుడు శేఖర్ కమ్ములతో పాటు చిత్రంలో నాగరాజు పాత్రధారి సుధాకర్, అభి(కౌషిక్), శ్రీను(అబుజిత్), సురేష్ (సంజీవ్) హాల్‌లో ప్రేక్షకుల మధ్య సందడి చేశారు. సినిమాలోని డైలాగ్స్ చెబుతూ ఆకట్టుకున్నారు. 

శేఖర్ కమ్ముల మాట్లాడుతూ సినిమా ఎలా ఉందంటూ అడిగిన ప్రశ్నకు బాగుందని యువత నుంచి కేరింతలతో సమాధానం వచ్చింది. నెల్లూరు నుంచి విజయయాత్రను ప్రారంభించడం సంతోషంగా ఉందని శేఖర్ కమ్ముల అన్నారు. యువత తమ జీవితాలను సంతోషంగా గడపాలని సూచించారు. అభిమానులు ఆటోగ్రాఫ్‌ల కోసం ఎగబడ్డారు. ఈ కార్యక్రమంలో డిస్ట్రిబ్యూటర్లు వెంకటరెడ్డి, బుజ్జి, పురప్రముఖులు ఉదయభాస్కర్, బట్టేపాటి నరేంద్ర, కామేశ్వరరావు, శివ, ఎస్2 మల్టిప్లెక్స్ యాజమాన్య బృందం పాల్గొన్నారు. 

Sunday, September 23, 2012

కరెంటు కోతలు వేసవి కాలాన్ని మరపించే రీతిలో .. మధ్యతరగతి ప్రజలు సైతం ఇన్వర్ట్టర్ల కొనుగోలు


ఇన్వర్టర్లకు పెరుగుతున్న డిమాండ్‌
రాపూరు: ఇటీవల కాలంలో అప్రకటిత విద్యుత్‌ కోతలు విపరీతంగా పెరుగుతుండడంతో ప్రత్యామ్నాయ ఏర్పాటు నిమిత్తం ఉపయోగించే ఇన్వర్టర్లకు భారీగా డిమాండ్‌ పెరిగింది. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలతో పాటు వ్యాపారులు, నివాసితులు సైతం అధిక సంఖ్యలో ఇన్వర్ట్టర్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి కనపరుస్తున్నారు. ప్రస్తుతం విద్యుత్‌ శాఖ విధిస్తున్న కరెంటు కోతలు వేసవి కాలాన్ని మరపించే రీతిలో తీవ్రతరమవుతున్నట్లు మండల ప్రజానీకం వాపోతున్నారు. పగటి పూట కనీసం ఐదు గంటల పాటు కూడా విద్యుత్‌ సరఫరా అందకపోవడంతో పాటు రాత్రుళ్లు నిర్వీరామంగా విధిస్తున్న కరెంటు కోతల వలన తీవ్ర అవస్థల పాలవడం ఈ మధ్యకాలంలో మండల ప్రజలకు రివాజుగా మారింది. ఇక గ్రామాల్లో అయితే చెప్పనవసరమే లేదు. కరెంటు సరఫరా ఎప్పుడు వస్తుందో... ఎప్పుడు పోతుందోనన్న అయోమయ పరిస్థితుల్లో ప్రజలు ఎదుర్కొంటున్న అవస్థలు వర్ణనాతీతంగా ఉన్నాయి.

దీంతో కార్యాలయ సేవలందించే నిమిత్తం అధికారులు, వ్యాపారులు, ప్రజలు ప్రత్యామ్నాయ ఏర్పాటుగా తప్పనిసరి పరిస్థితుల్లో ఇన్వర్టర్లను కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడడంతో వాటికి డిమాండ్‌తో పాటు తీవ్ర గిరాకీ ఏర్పడింది. ఈక్రమంలో డిస్టిబ్యూటర్లు రంగ ప్రవేశం చేసి వాడవాడలా వ్యాపార కరపత్రాలను అందిస్తూ ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. అప్రకటిత కరెంటు కోతలు తట్టుకోలేని మధ్యతరగతి ప్రజలు సైతం ఇన్వర్ట్టర్ల కొనుగోలుపెై దృష్టిసారిస్తున్నారు. వివిధ రకాల కంపెనీల పేరుతో ఇన్వర్టర్లను మార్కెట్‌లోకి దిగుమతి చేసి రూ.6 వేల నుంచి రూ.30 వేల వరకు విక్రయాలు జరుపుతున్నట్లు సమాచారం. 

Friday, September 21, 2012

నెల్లూరులో పలుచోట్ల రికార్డు డ్యాన్సులు.47 మంది రికార్డు డ్యాన్సర్లను అరెస్టు


నెల్లూరు: శుక్రవారం జిల్లా వ్యాప్తంగా అన్ని లాడ్జీ ల్లో దాడులు నిర్వహించి 47 మంది రికార్డు డ్యాన్సర్లను అరెస్టు చేశారు. నెల్లూరులో స్పెషల్‌బ్రాంచ్ పోలీసులు ఒకటి, మూడు స్టేషన్ల పరిధిలోని పలు లాడ్జీల్లో తనిఖీలు చేశారు.

బృందావనంలోని ఆదర్శ్, బాబుఐస్‌క్రీం సందులోని మౌర్యా, గాంధీబొమ్మ సమీపంలోని ఎస్‌ఎస్‌ఆర్ లాడ్జీలపై స్పెషల్‌బ్రాంచ్ పోలీసులు, స్థానిక పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో సు మారు 48 మంది రికార్డు డ్యాన్సర్లను అదుపులోకి తీసుకున్నారు. ఓ నిర్వాహకుడు దాడుల నుంచి తప్పించుకుని పరారయ్యాడు. నిందితులను ఒకటి, మూడో పోలీసుస్టేషన్‌లకు తరలించి కేసులు నమోదు చేశారు. వినాయకచవితి ఉత్సవాల్లో రికార్డు డ్యాన్సులు, స్టేజ్‌డ్యాన్సులు నిషేధిస్తున్నామని 15రోజుల ముందు నుంచి నిర్వాహకులను హెచ్చరిస్తున్నామని ఎస్పీ బి.వి రమణకుమార్ తెలిపారు.

శుక్రవారం రికార్డు డ్యాన్సర్ల అరెస్ట్ నేపథ్యంలో మూడోనగర పోలీసు స్టేషన్ వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ నిందితుల వివరాలను వెల్లడించారు. నగరంలో కొందరు నిర్వాహకులు రాష్ట్రంలోని గుంటూరు, విజయవాడ, తిరుపతి, విశాఖపట్టణం, హైదరాబాద్, ఒంగోలు తదితర ప్రాంతాల నుంచి డ్యాన్సర్లను తీసుకొచ్చారని తెలిపారు. వారిని రహస్యంగా లాడ్జీల్లో ఉంచారని పేర్కొన్నారు. అనంత రం వారితో ఇప్పటికే పలుచోట్ల రికార్డు డ్యాన్సులు వేయిస్తున్నారని చెప్పారు. ఈ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా లాడ్జీలపై దాడులు నిర్వహించామన్నారు. నగరంలో 48 (22 మంది మహిళలు, 25 మంది పురుషులు)మందిని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. వారిలో రమణ అనే వ్యక్తి తప్పించుకున్నారని చెప్పారు. ఉత్సవాల్లో సాంస్కృతిక కార్యక్రమాల ముసుగులో అశ్లీల నృత్యాలు ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు. ఈ సమావేశంలో నెల్లూరు నగర ఇన్‌చార్జి డీఎస్పీ బాలవెంకటేశ్వరరావు, ఎస్‌బీ సీఐ రాంబాబు, నార్త్, సౌత్ సర్కిల్ సీఐలు సురేష్‌కుమార్‌రెడ్డి, ఎస్వీ రాజశేఖర్‌రెడ్డి, ఒకటోనగర ఇన్‌చార్జి ఎస్‌ఐ, మూడోనగర ఎస్‌ఐలు ఖాదర్‌బాషా, నాగేశ్వరరావు పాల్గొన్నా

Thursday, May 17, 2012

చిరంజీవి ఉప ఎన్నికల ప్రచారం కోసం మోహన్ బాబు సొంత కారులో..

నెల్లూరు: రాజ్యసభ సభ్యుడు, తిరుపతి మాజీ శాసనసభ్యుడు చిరంజీవి గురువారం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఉప ఎన్నికల ప్రచారం కోసం హైదరాబాదు నుండి తిరుపతి విమానంలో వచ్చారు. సినీ నటుడు మోహన్ బాబు కూడా అదే విమానంలో తిరుపతి వచ్చారు. ఇద్దరు ఒకే విమానంలో రావడం విశేషం. అంతేకాదు తిరుపతిలో దిగిన అనంతరం చిరంజీవి ఉప ఎన్నికల ప్రచారం కోసం మోహన్ బాబు సొంత కారులో నెల్లూరుకు వచ్చారు. మోహన్ బాబు మరో కారులో తిరుపతి సమీపంలో తాను నిర్వహిస్తున్న విద్యానికేతన్ కళాశాలకు వెళ్లారు. కావలి వచ్చిన చిరంజీవి మాజీ శాసన సభ్యురాలు మాగుంట పార్వతమ్మ నివాసంలో విలేకరులతో మాట్లాడారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో చట్టానికి ఎవరూ అతీతులు కారని అవినీతి, అక్రమాల కేసులో ఎ-1 ముద్దాయిగా ఉన్న వైఎస్ జగన్మోహన్‌ రెడ్డి ఎప్పుడైనా అరెస్టు కాక తప్పదని అన్నారు. నెల్లూరు పార్లమెంటు ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం ఆయన అల్లూరు, దగదర్తి, బోగోలు, కావలి ప్రాంతాల్లో రోడ్‌షోలు నిర్వహించారు. అనంతరం కావలిలో మాజీ ఎమ్మెల్యే మాగుంట పార్వతమ్మ నివాసంలో విలేకరులతో మాట్లాడారు. చట్టం తనపని తాను చేసుకొని పోతుందని దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి ఎప్పుడూ అనేవారని, ప్రస్తుతం జగన్ విషయంలోను ఇదే జరుగుతోందని చెప్పారు. జగన్ బ్లాక్‌మెయిల్ రాజకీయాలకు పాల్పడుతున్నాడని రోడ్‌ షోలో చిరంజీవి అన్నారు. దోచుకున్న సొమ్మును దాచుకోడానికి అవసరమైన భద్రత కోసం సిఎం కుర్చీ కావాలని పాకులాడుతున్నాడే తప్ప ప్రజలపై ఎలాంటి ప్రేమ లేదన్నారు. వైయస్ మరణానంతరం కాంగ్రెస్‌పార్టీని కాపాడాలని సాక్షాత్తు ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ కోరితే పట్టెడన్నం పెట్టిన తల్లి లాంటి పార్టీని తన స్వార్థం కోసం కాలదన్ని బ్లాక్‌మెయిల్ రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. తెలుగుదేశం పార్టీతో కలిసి ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు జగన్ ప్రయత్నించగా, దాన్ని అడ్డుకోడానికి తాను ప్రయత్నించానన్నారు. కొందరు అధికార దాహంతో రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేయడం వల్లే ఉప ఎన్నికలు వచ్చాయని అంతకుముందు తిరుపతి రేణిగుంట విమానాశ్రయంలో అన్నారు. పారిశ్రామికవేత్తలను కొందరు స్వార్థపరులు ప్రలోభపెట్టి.. అవినీతిలో కూరుకుపోయేలా చేయడం వల్లే వారు జైళ్లకు పోవాల్సిన పరిస్థితి దాపురించిందని, అందుకు సత్యం రామలింగరాజు, నిమ్మగడ్డ ప్రసాద్‌లే ఉదాహరణ అని చెప్పారు. దీనివల్ల రాష్ట్రానికి రావడానికే పారిశ్రామికవేత్తలు భయపడుతున్నారని చెప్పారు. ఉప ఎన్నికలలో మెజారిటీ స్థానాలు కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.

Sunday, May 13, 2012

మానవత్వం మరచిన తల్లి

మానవత్వం మరచిన తల్లి
- ముళ్లపొదల్లో పసిపాప
- మాతృదినోత్సవం రోజు దారుణం
- ఆదరించిన అంగన్‌వాడీ మణెమ్మ
పొదలకూరు : అయ్యో ‘పాప’ం ఆ తల్లికి ఎంత కష్టమొచ్చిందో చేతులు ఎలా వచ్చాయోకానీ మాతృదినోత్సవం రోజున ముక్కుపచ్చలారని పసికందును ముళ్లపొదల పాలుచేసింది. ఆడపిల్ల అనుకుందో, తప్పటడుగు పాపమో, ఏమైతేనేమి కనీసం బొడ్డుకూడా ఊడని పసిబిడ్డను నిర్దయగా వదిలేసి వెళ్లింది. ఈ ఉదతం పొదలకూరులో ఆదివారం చోటుచేసుకుంది. పట్టణంలోని శివాలయం వీధి సమీపంలో ముళ్లచెట్ల పొద కింద పసిపాప ఏడుస్తుండటాన్ని స్థానిక అంగన్‌వాడీ కార్యకర్త మణెమ్మ గమనించింది. వెంటనే ఆ పసిబిడ్డను తన ఇంటికి తీసుకువచ్చి సఫర్యలుచేసి పాలుపట్టించింది. అనంతరం ఈ విషయాన్ని సిడిపిఓ దృష్టికి తీసుకువచ్చింది. ఈ సందర్భంగా సిడిపిఓ సత్యకుమారి మాట్లాడుతూ పాపకు మూడు రోజుల వయస్సు ఉంటుందన్నారు. పాప సంరక్షణ నిమిత్తం నెల్లూరులోని శిశుగృహంకు తరలిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ కార్యకర్త మణెమ్మ పాల్గొంది.

Saturday, May 12, 2012

స్కాన్సిస్‌ యూనివర్సిటీ నిర్వహించిన సర్వే స్నేహం సెక్స్‌ కోసమేనని తేల్చిచెప్పి....

స్ర్తీ, పురుషూల మధ్య స్నేహం ఎంత పవిత్రమైనదైనా కావచ్చు... కానీ అంతర్లీనంగా ఆ బంధాన్ని కట్టిపడేసేది మాత్రం ‘అదే’... అన్న అభిప్రాయం సర్వే సర్వత్రా వినవస్తూనే ఉంటుంది... ఇప్పుడు అదే నిజమని సర్వేలోనే తేలింది... విస్కాన్సిస్‌ యూనివర్సిటీ నిర్వహించిన సర్వే స్నేహం సెక్స్‌ కోసమేనని తేల్చిచెప్పింది. ష్నేహం’ త్యాగాన్ని కోరుతుందని, ప్రేమ గుడ్డిదని ఎవరైనా అంటే పప్పులో కాలేసినట్లే. ‘దేరీజ్‌ నో రియల్‌ లవ్‌...ఆల్‌ ఆర్‌ లస్ట్‌’...ఆడా, మగా మద్య నిజమైన ప్రేమ అంతా వ ట్టిదేనని...అదంతా ఆ ర్షనేనని లండన్‌కు చెందిన విస్కాన్సిన్‌ యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ సర్వే ఆధారాలతో సహా తేల్చి చెప్పింది. ఆపోజిట్‌ జెండర్‌ మద్య స్నేహం కేవలం సెక్స్‌ కోసమేనని ఆ సంస్థ కుండబద్దలు కొట్టింది. ఎన్నెన్నో జన్మల బంధం నీదీ నాదీ...అన్నా...స్నేహానికన్న మిన్న...

అని పాటలెన్ని పాడుకున్నా అంతిమంగా ఆడా మగా మద్య స్నేహం ‘ఆ దాహాన్ని’ తీర్చుకునేందుకేనని ఈ సర్వే నివేదిక బట్టబయలు చేసింది. ఏ దేశంలో చూసినా...ఖండాంతరాలు దాటినా కామానికి ఉన్న సహజ స్వభావం అదేనని సర్వే నిపుణులు వెల్లడించారు. అయితే గతంలో లాగా ఇప్పుడు కామం తీర్చుకునే ందుకు జీవితంలో సెటిల్‌ అయ్యేంతవరకు ఎవరూ ఆగడం లేదు. టీనేజ్‌గా పేరున్న థర్టీన్‌ ఏజ్‌నుంచే కామకలాపాలు అవకాశమున్న చోటల్లా ఆడేందుకు అబ్బాయిలూ...అమ్మాయిలూ పోటీలు పడుతున్నారట. సినిమా, మీడియా, ఇంటర్నెట్‌ ద్వారా చేతివేళ్ల దూరంలో ఉండే పోర్నోసైట్‌లు అమూల్యమైన బాల్యాన్ని పెడతోవ పట్టిస్తున్నాయి.

ఇంటర్నెట్‌, సోషల్‌ నెట్‌ వర్కింగ్‌ సైట్ల పుణ్యమే
ఇంటర్నెట్‌లో దర్శనమిచ్చే సోషల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్లు, ఆర్క్యూట్‌, ఫేస్‌బుక్‌లాంటి సైట్లతో యువత ఆపోజిట్‌ జెండర్‌తో స్నేహాలు చేసేందుకు భీజం పడుతోంది. దీనిద్వారా స్నేహం పేరుతో పరిచయం ఎల్లలు దాటుతోంది. ఒకరి పర్సనల్‌ విషయాలు మరొకరితో షేర్‌ చేసుకోవడం, ఛాటింగ్‌లతో మనసు తీరక వారు స్నేహం ముసుగులో కలుసుకునే తీరిక చేసుకుంటున్నారు. ఇదే వారి జీవితాలను అల్లకల్లోలం చేస్తోంది. ఆపోజిట్‌ అట్రాక్షన్‌తో తెలియనివారితో సెక్స్‌లో పాల్గొంటూ అవసరం లేని సుఖాలను అర్దంకాని వయసులోనే అనుభవిస్తున్నారు.

స్నేహం పేరుతో సెక్సే
ఎక్స్‌క్యూజ్‌మీ...మీరే కాలేజ్‌ అని అడిగి స్నేహం కోసం చేతులు చాచే మగాళ్లలో అధికులు మనసులో ఓ మూల సెక్సే లక్ష్యంగా స్నేహం చేస్తున్నారట. మిమ్మల్నెక్కడో చూశాను అని కొందరు...మీరు చాలా అందంగా ఉన్నారు ఇట్స్‌ మై కాంప్లిమెంట్‌ అని స్నేహం పేరుతో దగ్గరయ్యే పురుషుల్లో కామవాంఛే అంతిమ లక్ష్యమని ఈ నివేధిక స్పష్టం చేసింది. స్నేహం పేరుతో మహిళలకు దగ్గరయ్యే పురుషుల్లో 90శాతంమంది సెక్సే కావాలని ఆఫర్‌ చేస్తారని...అందినకాడికి ఆడదానితో కామం తీర్చుకునే చర్యలకు నిస్సిగ్గుగా పాటుపడతారని ఈ సంస్థ ఆదారాలతో రుజువు చేసింది. అయితే సమాజంలో మహిళలు ఎంతగా పరిణితి సాధించి అభివృద్దివైపు అడుగులు వేస్తున్నప్పటికీ...సెక్స్‌ కావాలని ప్రపోజ్‌ చేయడంలో పురుషులదే అగ్రస్థానమని సర్వేలో వెల్లడైంది. సాంప్రదాయానికి విలువిచ్చే ఆసియా దేశాలకు తోడు...అభివృద్ది చెందిన యూరప్‌, అమెరికా దేశాలలోనూ స్నేహం పేరుతో మొగ్గతొడిగిన పరిచయమే సెక్స్‌వైపు అడుగులు వేయిస్తోందని ఈ సర్వే రుజువు చేసింది.

శోధనలో తేలిందిదే
సంచలనం సృష్టించిన ఈ సర్వే సంస్థ తన పరిశోధనకోసం 18నుంచి 52ఏళ్ల మధ్య వయస్సున్న 400మంది స్ర్తీ, పురుషులను ఎంచుకున్నారు. ఎంపిక చేసిన వీరిని వయసుల వారీగా విభజించారు. 18నుంచి 23 ఏళ్లకు ఒక వర్గంగా, 27నుంచి 52ఏళ్ల వరకు మరో గ్రూపుగా వీరిని విభజించారు. వీరి వ్యవహారాన్ని, వారిలోని స్నేహభావాన్ని అధ్యయనం జరిపేందుకు 88 జంటలను విడివిడిగా గదుల్లో ఉంచి వారికి ఏకాంతాన్ని కల్పించారు. కొంత కాలం తర్వాత వారిలో స్నేహ భావం ఎంతలా పెరిగిందని ప్రశ్నించగా...అందులోని అందరు పురుషులూ ఒకటే మాట చెప్పారట. తమకు స్నేహం సంగతి దేవుడెరుగు ఎప్పుడు పక్కలోకి చేరి సెక్స్‌ ఎంజాయ్‌ చేద్దామా అన్న కోరికలతో రగిలి పోయామని వారు సెలవిచ్చారట. అయితే మహిళామణులు మాత్రం తాము ‘ఆ’ దృష్టితో చూడలేదని చెప్పారట.

నో హీరోస్‌... అంతా స్వార్దమే
సినిమాల్లో చెప్పినట్లుగా...హీరో యిజాన్ని చూపేందుకు కథానాయకుడు హీరోయిన్‌ వెంటపడుతున్నా ప్రవరాఖ్యుడి టైప్‌లో పక్కకు తప్పుకునే సిత్రం ఈ కాలంలో లేదని వీరు రుజువు చేశారు. కామంలేని స్నేహం...లైలా మజ్నూ లవ్‌లు లేవని నిర్దద్వంగా తేల్చిచెప్పిన ఈ సర్వే చూసి మనవాళ్లు ఇది ఎప్పుడో మాకు తెలిసిన విషయమే అన్నట్లుగా విరగబడి నవ్వుతున్నారట. అసలు మహిళల శరీరాకృతే సెక్స్‌ను ప్రేరేపించేదిలా ఉంటుందని...కొందరిని చూస్తేనే బ్రహ్మకైనా రిమ్మ తెగులు తరహాలో కామం ప్రకోపిస్తుందని పురుష పుంగవులు కటువుగా అంటున్నారు. కామా తురాణాం...న భయం...న లజ్జ అన్న సామెతను వారు అక్షరాల పాటిస్తున్నట్లవుతోంది. అయితే అసలు ఆపోజిట్‌ జెండర్‌ అంటేనే సెక్స్‌ అనేవారు లేకపోలేదు. మనసుల్లో అంతగా కోరిక రెచ్చిపోవడానికి అతివల అంగంగా సౌష్టవంతోపాటు, వారు ధరించే వస్త్ర ధారణ కూడా కారణమేనని విశ్లేషకులు గతంలో వ్యాఖ్యానించారు. అందం ఉన్నది అనుభవించడానికే అన్నట్లుగా ప్రవర్తించే వెస్ట్రన్‌ పౌరులు తాజాగా సెక్స్‌కు అంతగా ప్రాధాన్యత ఇవ్వడంలేదట.

అభివృద్ధి చెందిన దేశాల్లో అయితే
ప్రపంచంలోని అభివృద్దిచెందిన దేశాలైన అమెరికా, యూరోపియన్‌ దేశాల్లో అమ్మాయిలకు, అబ్బాయిలకు మధ్య అంతగా తేడా ఉండటంలేదు. వారి మధ్య స్నేహంలో స్వచ్చత కాస్త ఎక్కువగానే ఉంటోంది. టీనేజ్‌ వచ్చే వరకు వారిలో స్నేహాలు, పేరెంట్స్‌ వత్తిళ్లు ఎక్కువగానే ఉంటున్నాయి. ఇక టీనేజ్‌ అంటే 5 వ తరగతినుంచే వారిలో సెక్స్‌ ఎడ్యుకేషన్‌ ఇక్కడ అమలుజరుగుతోంది. వారిలో సెక్స్‌ వల్ల కలిగే అనర్దాలు, చిన్న వయసులో పిల్లలను కనడంవల్ల జరిగే నష్టాలపై తరగతుల్లో భోధించడమేకాదు, కొత్త తరహాలో వారికి ప్రాక్టికల్‌గా అర్దమయ్యేలా 8వ తరగితినుండి పిల్లలకు ఆడా, మగా తేడా లేకుండా అప్పుడే పుట్టిన సైజులో ఉన్న బొమ్మలను వారికి ఇచ్చి వారిని అన్ని విధాలుగా కేర్‌ తీసుకోవాలని క్లాసులు నిర్వహిస్తున్నారు.

అందులో టైం ఫీడ్‌ చేసి పాలు పట్టడం, డైపర్స్‌ మార్చడం, పడుకోబెట్టడం వ ంటి పనులను పిల్లలతో చేయించడంతో వారికి కష్టసుఖాలు తెలిసివస్తున్నాయని నిస్సందేహంగా చెప్పొచ్చు. ఇక వీరివయసు 18 దాటితే వీరిపై తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల అజమాయిషీ లేకుండా స్వాతంత్య్రం రాజ్యాంగమే కల్పిస్తోంది. దీంతో వారు ఏమి చేసినా చెల్లుబాటు అవుతోంది. అయితే వీరికి అంతకుముందే టీనేజ్‌ పేరెంట్స్‌పై ప్రాక్టికల్‌ పాఠాలు భోధించడంతో వీరు కొంతమేర పరివర్తనతో వ్యవహరిస్తున్నారని తాజా ఘణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అయితే ఇటీవలీ కాలంలో భారీగా టీనేజ్‌ గర్బాలు తగ్గుముఖం పట్టాయని అబివృద్ది చెందిన దేశాల లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. అయితే వీరు స్నేహంలో మాత్రం టీనేజ్‌ దాటాక అబ్బాయి, అమ్మాయితో....అమ్మాయి, అబ్బాయితో తప్ప ఇద్దరు ఒకే జెండర్‌ కలిసి స్నేహం చేయడం కలలోకూడా కన్పించదట.

కొసమెరుపు
గుప్పెట మూసిఉంటేనే ఇబ్బందంతా అని భావించిన కొన్ని దేశాలు వాటిని ఓపెన్‌ చేయించేపనిలో పడ్డాయి. సెక్స్‌ను అందించేందుకు థాయ్‌లాండ్‌ ఇప్పటికే వ్యభిచారాన్ని చట్టబద్దం చేసిన విషయం తెలిసిందే. అయితే ఇటీవలే అదే దారిలో యువతకు ఉపాధి అవకాశాలంటూ స్పెయిన్‌ ఏకంగా గ్రాడ్యుయేషన్‌ స్థాయిలో వ్యభిచారంపై ఒక కోర్సును ప్రవేశపెట్టింది.
sale your old used computer
usedsystemsblogspot.in
used computer buyer andhra pradesh