వెంకటగిరి:స్మగ్లర్లకే స్మగ్లర్లు ఉండటం విశేషం అయితే ఏకంగా అటవీశాఖ అధికారులనే డుమ్మాకొట్టించి దాదాపు 125 ఎర్రచందనం దుంగలను కొత్త తరహాలో స్మగ్లర్లు చోరీచేయడం విశేషం. ఎర్రచందనం దుంగలను అటవీప్రాంతాల నుండి తీసుకురావడం స్మగ్లర్లకు పెను సవాల్ అయితే. ఈ కొత్త రకం చోరీకి పాల్పడిన వ్యక్తులు ఎంచుకున్న వైనం చూస్తే చాలా విచిత్రంగా ఉంది. ఇందుకు సంబంధించిన వివరాలు పరిశీలిస్తే స్థానిక వెంకటగిరి అటవీశాఖ కార్యాలయం గూడౌన్‌లో స్మగ్లర్ల నుండి స్వాదీనం చేసుకున్న ఎర్రచందనం దుంగలను, వాహనాలను నిల్వ చేస్తారు. అయితే ఆ దుంగలపై కన్ను పడిన చిత్తూరు జిల్లా కెవిబి పురం మండలం వడ్డికండ్రిగ గ్రామానికి చెందిన జయరామయ్య, నె ల్లూరు జిల్లా వెంకటగిరి మండలం అమ్మపాళెం గ్రామానికి చెందిన ఆటపాక మునెయ్యలు తెలివైన ప్రణాళికను వేశారు.
దీంతో చిత్తూరుజిల్లా కెవివిపురం మండలం రాయపేటకు చెందిన రఘునాధ్‌రెడ్డితో కలిసి పక్కా ప్రణాళికతో ఫారెస్ట్ గూడౌన్ నుంచే ఎర్రచందనం దుంగలను చోరి చేసేందుకు పూనుకున్నారు. దీంతో ఇటీవల గత రెండున్నర నెలల నుండి వర్షాల కురుస్తున్న సమయంలో, విద్యుత్ సరఫరా లేని సమయంలో మాటువేసి రోజువారీగా కొన్ని దుంగలను చోరీచేసి బొప్పాపురం చెరువులో దాచిపెట్టారు. చివరకు ఏకంగా 125 దుంగలను లారీకి లోడ్‌చేసి చెనై్నకు తరలిస్తుండగా శ్రీకాళహస్ర్తి మండలంలోని కనపర్తి రోడ్డు వద్ద చిత్తూరు జిల్లా అటవీశాఖ సిబ్బంది దుంగలతో సహ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.
కాగా ఈ దుంగలపై వెంకటగిరి అటవీశాఖకు సంబంధించిన నెంబర్లు వేసి ఉండటంతో అక్కడి అధికారులు నెల్లూరు జిల్లా అటవీశాఖ అధికారులకు సమాఛారమిచ్చారు. దీంతో సబ్‌డిఎఫ్‌ఓ పవన్‌కుమార్ స్థానిక అటవీశాఖ అధికారులు కలిసి చోరీకి కారణమైన రఘునాధ్‌రెడ్డిని పట్టుకుని స్థానిక పోలీసులకు అప్పగించారు. ఇంకా సంబంధం ఉన్న జైరామయ్య, అటపాక మునెయ్యలు పరారీలో ఉన్నారు. అయితే కొత్త తరహాలో ఈ చోరీ జరగడంతో ఈ విషయంపై ప్రజలు ముక్కున వేలేసుకోవడం విశేషం.
No comments:
Post a Comment