నెల్లూరు:వాసవి క్లబ్ విక్రమసింహపురి ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక బాలాజీనగర్‌లోని వై.కె. ఆచారి ఆంగ్ల మీడియం పాఠశాలలో రక్త, నేత్ర దానాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్ధులకు రక్త, నేత్ర దానాలపై సందేహాలను నివృత్తి చేశారు. ఈ సందర్భంగా క్లబ్ కార్యదర్శి సతీష్‌కుమార్ మాట్లాడుతూ రక్తదానం మరొక మనిషి ప్రాణాన్ని కాపాడుతుందని, నేత్రదానం ఇద్దరి అంధులకు చూపునిచ్చి ప్రపంచాన్ని చూసే భాగ్యాన్ని కలిగిస్తుందని వివరించారు. 18వ ఏటనుండే విద్యార్ధులు రక్త దానం చేయవచ్చని, అలాగే 60 ఏళ్ళ వరకు కూడా రక్త దానాన్ని చేయవచ్చని తెలిపారు. క్లబ్ అద్యక్షులు యుగంధర్ మాట్లాడుతూ గత రెండు యేళ్ళుగా వాసవి క్లబ్ నేత్రదానంపై ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తద్వారా నేత్ర దానం పట్ల ఎంతో స్పందన వస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో క్లబ్ కోశాధికారి సురేంద్ర, జెవివి. మురళి, పాఠశాల కరెస్పాండెంట్ శేషబ్రహ్మం, ఉపాధ్యాయులు, విద్యార్ధినీ విద్యార్దులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment