నెల్లూరు:రాష్టవ్య్రాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో 13 లక్షల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు పని చేస్తున్నారని, వీరిలో 25 వేలమంది నెల్లూరు జిల్లాలో పని చేస్తున్నారని, వీరి సమస్యల పరిష్కారం కోసం కలెక్టరేట్ ఎదుట సోమవారం నుండి మూడు రోజులు రిలే నిరాహార దీక్షలు నిర్వహిస్తామని ఎపి స్టేట్ గవర్నమెంట్ కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ జిల్లా కమిటి కన్వీనర్ మన్నెం శ్రీధర్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 2005 నుండి నేటి వరకు వీరి వేతనాలను పెంచలేదని, చాలిచాలని జీతాలతో కాంట్రాక్ట్ ఉద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడే పరిస్థితి ఏర్పడిందన్నారు. రెగ్యులర్ ఉద్యోగుల కనీస స్కేలు మినిమమ్ బేసిక్ సమానంగా వేతనాలను పెంచాలని, డిఏ సౌకర్యం కల్పించాలని, ప్రతి నెల 1వ తేదిన జీతాలు చెల్లించాలని, 15 రోజుల క్యాజువల్ లీవులు, మహిళలకు 180 రోజుల స్రసూతి శెలవులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.
No comments:
Post a Comment