కోవూరు : కోవూరు ఉప ఎన్నిక నామినేషన్‌ల పర్వం నిన్నటితో ముగియగానే ఒక్కసారిగా ఎన్నికల ప్రచారం ఊపందుకోగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థి ప్రసన్నపై నియోజకవర్గంలో కొంతమేర వ్యక్తిగతంగా విభేదాలున్నా ఆయన గెలుపునకు వైఎస్.రాజశేఖర్‌రెడ్డి బొమ్మే శ్రీరామరక్షగా నిలబడుతుందని అభిమానులు, ఓటర్లు, రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రసన్న ఎంతో ధీమాగా నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీతో తాను గెలుపొందుతానని ఒకింత ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. అయితే నియోజకవర్గ పరిధిలోని కొన్ని మండలాల్లో నాయకులు ప్రసన్న ధీమాపై ఆందోళన చెందడమే గాక ఇదే రీతిలో ఉంటే రాబోయే రోజుల్లో ఏమి జరుగుతుందోనని ఆందోళన పడుతున్నారు. కోవూరుకు ఈ నెల 3వ తేదీ జగన్ వచ్చి పలు మండలాల్లో ప్రచారాన్ని చేయనున్న దృష్ట్యా వైఎస్ చేసిన సంక్షేమ కార్యక్రమాలు, ఆయన కుమారుడుగా జగన్ పర్యటన ప్రసన్న గెలుపు దిశకు అత్యంతగా తోడ్పడుతుందని వైఎస్‌ఆర్‌సి పార్టీ నాయకులు, కార్యకర్తలు భావిస్తున్నారు. గెలవడం ప్రధానం కాదు, మెజారిటీయే మాకు అత్యంత ప్రాముఖ్యత అంటూ బడా నాయకులు సైతం అత్యంత ఆత్మవిశ్వాసంతో ఉండడంతో ద్వితీయశ్రేణి నాయకుల నుండి చోటా నాయకులు సైతం తమ అభ్యర్థి మెజారిటీపై బెట్టింగ్‌లు చేస్తున్నారు. అయితే నియోజకవర్గంలోని చాలా మండలాల్లో వైఎస్‌ఆర్ పార్టీకి చెందిన యువత హుషారు చూస్తే ప్రస్తుతం నాయకులు సైతం ఉత్సాహంగా ప్రచారాలను కొనసాగిస్తున్నారు. ఎన్నికల్లో చివరి వరకు ప్రజల నాడిని తెలుసుకోవాలంటే పరమేశ్వరుడికి కూడా అర్థం కానట్లు పోలింగ్ నాటికి ఓటరు ఎవరికి ఓటు వేస్తాడో అనేది చెప్పలేమని తలలు పండిన రాజకీయ విశ్లేషకులు సైతం ఒప్పుకోదగ్గ విషయం. ఈ నెల 21వ తేదీ వెలువడే ఫలితాలే వీరి భవితవ్యం తెలుస్తుంది. అప్పటి వరకు ఎదురుచూడక తప్పదనేది నిత్య సత్యం
No comments:
Post a Comment