నెల్లూరు : ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా రూరల్ శాసనసభ్యుడు ఆనం వివేకానంద రెడ్డికి శుక్రవారం క్లాస్ పీకారు. అసెంబ్లీ ప్రాంగణంలో ఆనం వివేకానంద సిగరేట్ తాగుతూ కిరణ్ కుమార్ రెడ్డికి కనిపించారు. అక్కడ సిగరేట్ తాగడంపై ముఖ్యమంత్రి ఆనంపై ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశారు. పబ్లిక్ ప్లేసులో సిగరేట్ తాగటం ఏంటంటూ ఆనంకు క్లాస్ పీకారు. అసెంబ్లీలో దమ్ము కొట్టవద్దని సూచించారు. ఆనం అసెంబ్లీలోని సిఎం చాంబర్ వద్ద సిగరేట్ తాగడం విశేషం.
కాగా అంతకుముందు ఆనం వివేకానంద రెడ్డి మీడియాతో మాట్లాడారు. నెల్లూరు పార్లమెంటు సభ్యుడిగా తన సోదరుడు, ఆర్థిక శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పోటీ చేయాల్సిన అవసరం లేదని అన్నారు. ఆ స్థానం నుండి పోటీ చేయడానికి జిల్లాలోని ముగ్గురం ఎమ్మెల్యేలం సిద్ధంగా ఉన్నామని చెప్పారు. తాను పోటీ చేసేందుకు సిద్ధమన్నారు. కాగా ఇన్నాళ్లు కాంగ్రెసు పార్టీ ఎంపిగా ఉన్న మేకపాటి రాజమోహన్ రెడ్డి వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి వెళ్లి పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆయన రాజీనామాను స్పీకర్ మీరా కుమార్ గురువారం ఆమోదించారు. దీంతో అక్కడి పార్లమెంటు స్థానానికి త్వరలో ఉప ఎన్నికలు జరగనున్నాయి. అక్కడ ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పోటీ చేయాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సవాల్ విసిరింది. దీనిపై ఆనం స్పందించారు.

No comments:
Post a Comment