నెల్లూరు (క్రైం), మేజర్‌న్యూస్ :పోలీసు సంక్షేమ కార్యక్రమాలను, శాంతి భద్రతలను కాపాడడంలో సౌమ్యుడుగా, ప్రణాళికా బద్ధంగా వ్యవహరించడంలో ఆయనకు ఆయనే సాటి అని, ఎస్‌పి మల్లారెడ్డి వీడ్కోలు సభలో పాల్గొనడం తనకెంతో సంతోషంగా ఉందని కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథి గుంటూరు రేంజ్ ఐజి.కిషోర్ కుమార్ అన్నారు. సోమవారం నగరంలోని స్వర్ణవేదిక కల్యాణ మండపంలో జరిగిన వీడ్కోలు సభలో ఆయన మాట్లాడుతూ జిల్లా ఎస్‌పి మల్లారెడ్డిని రెండవసారి వీడ్కోలు చేసే కార్యక్రమంలో పాల్గొనడం విశేషమన్నారు. గతంలో కర్నూలు ఎస్‌పిగా పనిచేసినపుడు ఎస్‌పి మల్లారెడ్డి కర్నూలు నుంచి బదిలీ అయినప్పుడు, ప్రస్తుతం నెల్లూరు నుంచి కడపకు బదిలీ అవుతున్న సందర్భంలో జరిగే వీడ్కోలు సభలో పాల్గొన్నానని తెలిపారు. జిల్లా కలెక్టర్ కె.రాంగోపాల్ మాట్లాడుతూ ఒకే జిల్లావారమైన తాము ఇద్దరం ఒకే కాలేజిలో చదువుకున్నామని, ఎస్‌పి మల్లారెడ్డి చాలా సౌమ్యుడని తెలిపారు. ఎస్‌పి సమర్థత కారణంగా మూడవసారి మళ్లీ కడప జిల్లాకు ఎస్‌పిగా బదిలీ కావడం గర్వించదగ్గ విషయమన్నారు. రెండు సంవత్సరాల నాలుగు నెలలు పనిచేసిన మల్లారెడ్డి అనేక బందోబస్తు డ్యూటీలు, ఎన్నికలు జరిపించగలిగారన్నారు. జిల్లా జడ్జి రెడ్డెప్పరె డ్డి మాట్లాడుతూ వ్యవస్థ సక్రమంగా ఉండాలంటే పోలీసులు, డాక్టర్లు, రెవెన్యూ సక్రమంగా ఉంటేనే న్యాయ వ్యవస్థ పనిచేస్తుందన్నారు. ఈ నాలుగు సరిగా ఉంటే అన్యాయం జరిగినవారికి న్యాయం జరుగుతుందన్నారు. ప్రస్తుత జిల్లా ఎస్‌పి దామోదర్ మాట్లాడుతూ జిల్లాలోని ఎంతోమంది ప్రేమాభిమానాలను చూరగొన్న ఎస్‌పి మల్లారెడ్డి జిల్లాలోని పోలీస్ శాఖకే గర్వకారణమన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సౌరభ్‌గౌర్, విక్రమసింహపురి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ విశ్వేశ్వరరావులతోపాటు జిల్లా పోలీస్ అధికారులు, ప్రజాసంఘ నాయకులు, పలువురు రాజకీయ నాయకులు పాల్గొన్నారు.
నెత్తురోడిన రహదారులుజిల్లాలో సోమవారం జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో ఏడుగురిని మృత్యువు పొట్టనపెట్టుకుంది. మనుబోలు మండల పరిధిలోని కొమ్మలపూడి క్రాస్‌రోడ్డు వద్ద సోమవారం లారీ-మోటార్‌సైకిల్ ఢీకొన్న ప్రమాదంలో భార్య శ్రీదేవమ్మ(40) మృతి చెందగా, భర్తకు తీవ్ర గాయాలయ్యాయి. అలాగే పొదలకూరు మండలం మహ్మదాపురం గ్రామ శివార్లలో సోమవారం ట్రాక్టర్ బోల్తాపడిన సంఘటనలో ఇద్దరు రైతులు ఉయ్యాల నారాయణరెడ్డి(58), ఉయ్యాల శ్రీనివాసులరెడ్డి(24)లు మృత్యువాతపడ్డారు. అంతేకాకుండా చిల్లకూరు మండల పరిధిలోని మోమిడి గ్రామంలో సోమవారం లారీ ఢీ కొన్న సంఘటనలో గ్రామానికి చెందిన నెల్లిపూడి చిన వెంకటయ్య(40), ఇంగిలాల వెంకటరమణయ్య(35), షేక్ గఫూర్ (38)లతోపాటు లారీ డ్రైవర్ అక్కడి కక్కడే మృతి చెందారు.
No comments:
Post a Comment