Friday, February 19, 2010
సమాచార హక్కు చట్టంపై మరింత అవగాహన అవసరం
నెల్లూరు, మేజర్‌న్యూస్:సమాచార హక్కు చట్టంపై ఇప్పటికే ప్రజల్లో మంచి అవగాహన వచ్చిందని, అయితే దీనిని వినియోగించుకునేందుకు మరింత అవగాహన అవసరమని సమాచార హక్కు చట్టం రాష్ట్ర కమిషనర్ ఆర్.దిలీప్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. నగరంలోని సమాచార హక్కు సంఘం ఏర్పాటు కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన శుక్రవారం మధ్యాహ్నం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.గత నాలుగేళ్లుగా ఈ చట్టం ఏర్పాటైనప్పటి నుంచి మూడేళ్లకు సంబంధించిన వార్షిక నివేదికలను తాము ప్రభుత్వానికి అందజేశామని, ప్రస్తుతం 2010 సంవత్సర వార్షిక నివేదిక అందవేత పనిలో ఉన్నామన్నారు. సమాచార హక్కు చట్టంపై వస్తున్న దరఖాస్తుల సంఖ్యతోపాటు అందులోని నాణ్యత కూడా పెరిగిందన్నారు. సమాచారాన్ని అందజేయాల్సిన అధికారులు సమాచారాన్ని ఇస్తున్నారు కాని జాప్యం మాత్రం జరుగుతున్నట్లు తమ పరిశీలనలో తెలిసిందన్నారు. అంతేకాకుండా దరఖాస్తుదారునికి అరకొర సమాచారం ఇస్తున్నట్లు తెలిసిందని చెప్పారు. దేశవ్యాప్తంగా 29 సమాచార హక్కు చట్టం కమిషన్లు ఉండగా అందులో రాష్ట్రానికి చెందిన తమ కమిషన్ ప్రభుత్వానికి నివేదికలు అందజేయడంలో ముందంజలో ఉందన్నారు. సమాచార హక్కు చట్టంపై కోర్టులకు ఎలాంటి అధికారం లేదని, అయితే చట్టం కమిషనర్ ఇచ్చిన తుది నిర్ణయంపై సంబంధిత దరఖాస్తుదారుడు సంతృప్తి చెందకపోతే సదరు వ్యక్తి కోర్టును ఆశ్రయించవచ్చన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 60 వేలకు పైగా దరఖాస్తులు అందాయని, అందులో 87 శాతం దరఖాస్తులు ఇప్పటికే పరిష్కారమయ్యాయన్నారు. మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయని చె ప్పారు. అదేవిధంగా జిల్లాలో ఇప్పటి వరకు 3,639 దరఖాస్తులు రాగా వాటిలో 3,383 దరఖాస్తులు పరిష్కారమయ్యాయన్నారు. అదేవిధంగా 343 అప్పీళ్లు రాగా వాటిలో 304 పరిష్కారమయ్యాయని చెప్పారు.సమాచార హక్కు చట్టం పై ఇప్పటికే రాష్ట్రంలో 12 సంఘాలు క్రియాశీలకంగా పనిచేస్తున్నాయని చెప్పారు. తాను ఈ కమిటీకి ఛైర్మన్‌గా నియమితులైనప్పటి నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 650 సమావేశాలకు హాజరయ్యామని చెప్పారు. సమాచార హక్కు చట్టంపై రెండు వైపులా చైతన్యం పెరిగిందని, సమాచారం అడిగేవారితోపాటు ఇచ్చే వారికి బాధ్యత పెరిగిందన్నారు. అయితే కొన్నిచోట్ల రికార్డుల నిర్వహణ సక్రమంగా లేదన్నారు. నెల్లూరులో ఇది తన మూడవ పర్యటన ని, గతంలో కన్నా ప్రస్తుతం తనకు మార్పు కనిపించిందని, అయితే ఆ మార్పు మరింత పెరగాలన్నారు. సమాచారహక్కు చట్టం ప్రచారంపై అడిగిన ఒక ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ ప్రచారం చేసే పని ప్రభుత్వానిదని చెప్పారు. విలేకరుల సమావేశంలో జాయింట్ కలెక్టర్ సౌరభ్‌గౌర్, డిఆర్‌ఒ జివి.జయరామయ్యలు పాల్గొన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment