Tuesday, February 16, 2010
‘భారత జ్యోతి’ అవార్డు పొందిన షబ్బీర్
ఉదయగిరి, మేజర్ న్యూస్: స్థానిక మాజీ మండల అధ్యక్షులు షేక్.షబ్బీర్ కి ఇంటి గ్రేటెడ్ పీస్ అండ్ ఫ్రెండ్‌షిప్ సొసైటీ కర్నాటక రాష్ట్రం తరపున భారత జ్యోతి జాతీయ అవార్డు వరించింది. ఈనెల తొమ్మిదవ తేదీన ఆయన ఈఅవార్డు అందుకున్నారు. అంతర్జాతీయ స్థాయి కలిగిన ఈసంస్థ భారత దేశంలో నిస్వార్థ సేవకులు అవినీతి లేని పాలకులను ఎంపిక చేసి అత్యున్నత పురస్కారం అందించటం ఈలక్ష్యం అయితే మారు మూల ప్రాంతానికి చెందిన షేక్.షబ్బీర్ ఈఅవార్డుకు వరుసగా ఎంపిక కావటం అత్యంత విషేషంగా మారింది. వరుసగా రెండు సార్లు మండల పరిషత్ అధ్యక్షుడిగా ఎంపిక కావటం ఆగ్రో డైరెక్టర్, రైల్వే బోర్డు మెంబర్ లాంటి ఉన్నత పదవులు అలంకరించినా అవినీతికి ఆస్కారం ఇవ్వకుండా పదవులు నిర్వహించటం, నేదురుమల్లి జనార్థన్ రెడ్డి ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు తాను ముస్లీం అయినప్పటికీ కళ్యాణ మండపం నిర్మించటం షబ్బీర్ మతసామరస్యవాదిగా నిలబెట్టాయి. రాజీవ్ గాంధీ ఎక్స్‌లెన్స్ అవార్డు, ఇందిరా ప్రీయదర్శినీ అవార్డులు కూడా షబ్బీర్‌కి రావటం విషేషం.పలువురి హర్షం: షబ్బీర్‌కి అవార్డు రావడంపై మాజీముఖ్య మంత్రి నేదురు మల్లి జనార్థన్ రెడ్డి, ఎంపి మేకపాటి రాజమోహన్ రెడ్డి తమ హర్షం వ్యక్తం చేశారు. మైనార్టీ అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ట కాపాడుతూ ప్రజల హృదయాలు దోచుకున్న షబ్బీర్ మరెన్నో జాతీయ అవార్డులు గెలుపోందాలని వారు ఆకాంక్షించారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment