Friday, February 19, 2010
రేపే గంథోత్సవం
తడ, మేజర్‌నూస్ : ఆదివారం వేనాడులో వైభవంగా జరగనున్న గంథోత్సవానికి ఏర్పాట్లన్ని పూర్తయినాయి. ఏర్పాట్లపై శుక్రవారం తడ ఎస్‌ఐ హరికృష్ణ దర్గా వద్దకు వెళ్లిభద్రతపై గ్రామస్తులతో చర్చించారు. వేనాడుకు సుదూర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు రానున్న నేపధ్యంలో ముందు జాగ్రత్తగా వాహనాలకు పార్కింగ్‌లతోపాటు ఆకతాయిలనుండి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ముందు జాగ్రత చర్యలుపై ఉరుసు నిర్వాకులతో చర్చించారు. శుక్రవారం నుంచే దర్గా వద్ద విద్యుత్ దీపాల అలంకరణతో పాటు కిలో మీటరు పొడవున సుందర వనంగా సీరియల్ సెట్లను అలకరించారు. గంధోత్సవం దగ్గరకు రావడంతో గురువారం నుంచే దర్గా వద్ద భక్తుల తాకిడి అధికంగా వుంది.ఆసియా ఖండంలోనే అతిపెద్ద దర్గాగా పేరుగాంచి 144 అడుగుల పొడవుతో స్వయంభుగా వెలసిన ఈ అల్లాతాత దర్గాను 1996లో తొలిసారిగా అస్కార్ అవార్డు గ్రహీత, సినీ సంగీత దర్శకులు ఎఆర్ రెహమాన్ సందర్శించారు. ఈదర్గాను సందర్శించినంతరం ఆయనకు కాలం కలసి రావడంతో పాటు దర్గాయొక్క ప్రాముఖ్యత నాలుగు దశలకు వ్యాపించింది. అప్పటి నుండి వారి కుటుంబ సభ్యుల ఆద్వర్యంలో గంథోత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీగా మారింది. గంధోత్సవాన్ని పురష్కరించుకొని 5రోజుల క్రితం జెండా ఆవిష్కరణ అంగరంగ వైభంగా చేశారు. ఆదివారం రాత్రి గ్రామంలో ఉరేగింపుగా ఉత్సవం నిర్వహించి అర్థరాత్రి గంధోత్సవాన్ని వైభవంగా నిర్వహించనున్నారు. అదే రోజు ఎఆర్ రెహమాన్ దర్గాను సందర్శించే అవకాశం ఉండడంతో పోలీసులు భారీగా భధ్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment