Friday, February 19, 2010
కోళ్లకు కొక్కెర వ్యాధి నివారణ టీకాలు
కావలి రూరల్, మేజర్‌న్యూస్: నాటుకోళ్లకు శనివారం నుంచి 10లక్షల కొక్కెర వ్యాధి నివారణ టీకాలు వేయనున్నట్లు జిల్లా పశు సంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులు డాక్టర్ కెఎం రెహమాన్ వెల్లడించారు. గురువారం స్థానిక పశు సంవర్ధక శాఖ కార్యాలయంలో డివిజన్ స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన పశువుల ఆసుపత్రిని తనిఖీ చేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ 10లక్షల కొక్కెర వ్యాధి నివారణ ఉచిత టీకాలను సిద్ధంగా ఉంచామని తెలిపారు. ఈ మేరకు జిల్లా ఎన్నుకున్న కమిటీలు శనివారం నుంచి జిల్లాలో విస్తృతంగా కోళ్లకు టీకాలను అందిస్తున్నట్లు పేర్కొన్నారు. అదే విధంగా 6లక్షల 24వేల పశువులకు ఇప్పటికే గాలికుంటు వ్యాధి టీకాలను వేశామన్నారు. 2లక్షల 10వేల పశువులకు బొబ్బ వ్యాధి నివారణ మందులను అందించామని చెప్పారు. అమ్మతల్లి, ఆటలమ్మ టీకాలను కూడా అందించామని చెప్పారు. గొర్రెలు, మేకలు మొత్తం 13లక్షలకు పైగా నట్టల నివారణ మందులను వేశామని తెలిపారు. అదే విధంగా డివిజన్‌లో 85పశు సంవర్ధక కేంద్రాలు ఉన్నాయని వాటి ద్వారా మిగిలిన వాటికి కూడా మందులు అందించే ఏర్పాట్లను చేస్తున్నామన్నారు. పశు క్రాంతి పథకం క్రింద జిల్లాలో 572గేదెలను లబ్దిదారులకు పంపిణీ చేశామని, డిసెంబర్ నెలాఖరు నాటికి మరో 500గేదెలను పంపిణీ చేయవలసి ఉందన్నారు. వీటికి అవసరమైన నిధులు తమ వద్ద ఉన్నాయని ఈ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేస్తామని చెప్పారు. దీని యూనిట్ కాస్ట్ విలువ 35వేలు కాగా, బ్యాంకు నుంచి 20వేలు ఇవ్వడం జరుగుతుందన్నారు. 15వేల రూపాయలు రైతులకు సబ్సిడీగా ఇవ్వబడుతుందని తెలిపారు. అయితే గేదెల ఎంపిక యజమని ఇష్టానుసారం ఏ ప్రాంతం నుంచైనా సిబ్బంది సమక్షంలో విక్రయించి ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో డివిజనల్ సహాయ సంచాలకులు డాక్టర్ పి బ్రహ్మయ్య, డాక్టర్ బి పెద్దస్వామి, సిబ్బంది పాల్గొన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment