నెల్లూరు: రాపూరు మండలం పెంచలకోన లో వెలిసిన పెనుశిల లక్ష్మి నరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాలు మే నెల 1 నుంచి ప్రారంభమయ్యే శ్రీ పెంచలస్వామి బ్రహ్మోత్సవాలు విజయవంతం చేయాలని ఆలయ పాలకమండలి చైర్మన్ నెల్లూరు రవ్రీంద్రారెడ్డి కోరారు. పెంచలకోనలో గురువారం ఏర్పాటుచేసిన సమీక్షలో ఆయన పాల్గొని మాట్లాడతూ కోనలో ఆరు రోజుల పాటు వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతాయన్నారు. ఈ దీనికి ఐదు లక్షల మంది భక్తులు హాజరయ్యే అవకాశం ఉందన్నారు. ఉత్సవాలకు వచ్చే భక్తులకు సౌకర్యాలు ఏర్పాటుచేయడమే లక్ష్యంగా పనిచేయాలని ఆయన అన్నారు. రోడ్లు మరమత్తులు చేయాలని, మలుపుల వద్ద సూచిక బోర్డులు ఏర్పాటుచేయాలన్నారు. అగ్నిమాపక కేంద్రం వారు ఉత్సవాల్లో వాహనాన్ని ఏర్పాటు చేయాలన్నారు. ఉత్సవాల సందర్భంగా అడవుల్లో మద్యం విక్రయాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ అధికారులను కోరారు. ఆర్టీసీ వారు ప్రత్యేక బస్సులను నడపాలన్నారు. కార్యక్రమంలో ఆయల పాలక మండలి అధికారులు, ఇతర అధికారులు పాల్గొన్నారు. బారీగా ఏర్పాట్లు ఈ ఏడాది జరిగే శ్రీవారి బ్రహోత్సవాలకు వచ్చే భక్తుల కోసం ఏర్పాట్లు చేయాలని ఆలయ ధర్మకర్తల మండలి గురువారం చైర్మన్ ఛాంబర్‌లో ఏర్పాటుచేసిన సమీక్షలో నిర్ణయించారు. కోన క్షేత్రంలో మంచినీటి వసతి ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. భక్తులకు పూర్తిస్తాయిలో సౌకర్యాలు ఏర్పాటుచేయాలనే లక్ష్యంతో పనిచేయాలని నిర్ణయించా
No comments:
Post a Comment