online marketing

Sunday, April 8, 2012

మహిళలను వ్యభిచారం ముగ్గులో దింపి వారి ద్వారా డబ్బున్న వారిపై వల వేసి, వారి శృంగార కార్యకలాపాలను సీడీలు.

అమాయకులయిన మహిళలను వ్యభిచారం ముగ్గులో దింపి వారి ద్వారా డబ్బున్న వారిపై వల వేసి, వారి శృంగార కార్యకలాపాలను సీడీలు, ఫొటోల ద్వారా బ్లాక్‌మెయిల్‌ చేస్తుందన్న ఆరోపణలతో అరెస్టయిన తారాచౌదరి ఖాతాలో పెద్ద గద్దలే ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసుల ప్రాధమిక విచారణలో కళ్లు చెదిరే విభ్రాంతికర వాస్తవాలు వెల్లడయినట్లు సమాచారం. వివిధ సందర్భాల్లో విచారణకు హాజరయిన తారాచౌదరిని చూస్తే పోలీసులే హడలిపోయేవారట. తన చేయి పట్టుకున్నారని గొడవ చేస్తానని బెదిరిం చడం, తనకు పైస్థాయిలో ఆఫీసర్లు తెలుసని చెప్పడంతో టాస్క్‌ఫోర్స్‌ పోలీ సులు కూడా హడలిపోయి పారిపోయేవారట. తారా చౌదరి కహానీ తెలిసిన పోలీసులు చివరకు మహిళా కానిస్టేబుళ్ల సమక్షంలో మాట్లాడవలసిన పరి స్థితి ఏర్పడింది. 

తారాచౌదరి బాధితులు, వారికి సంబంధించి ఎదుర్కొం టున్న సమస్యల పూర్తి వివరాలన్నీ ‘సూర్య’ సేకరించింది. వారి గుట్టుమట్లను తెలుసుకుంది. కోర్టు ఆదేశాలతో ప్రస్తుతం పోలీసు కస్టడీలో ఉన్న తారాచౌదరి చేతిలో రాజకీయ నాయకుల గుట్టు మట్లు చిక్కుకుపోయాయి. నిజానికి ఆమె ప్రధాన వ్యాపారం వ్యభిచారం కాదని, అందుకోసం వచ్చిన డబ్బున్న వారిని ఫొటోలు, వీడియోలు తీసి బ్లాక్‌మెయిల్‌ చేయడమేనని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం.. తన వద్దకు వచ్చే డబ్బున్న వారు, రాజకీయ నాయకులు శృంగారంలో ఉన్నప్పుడు ఆ దృశ్యాలను ఫొటోలు, వీడియోలు తీసి తర్వాత వారిని బెదిరించేదంటున్నారు. 

అందులో భాగంగానే గుంటూరు జిల్లాకు చెందిన ఓ అధికార పార్టీ ఎంపీని తన దగ్గర ఉన్న సీడీని చూపించి చాలాకాలం బ్లాక్‌మెయిల్‌ చేసినట్లు తెలిసింది. పారిశ్రామికవేత్త కూడా అయిన సదరు ఎంపీని మానసికంగా వేధించినట్లు చెబుతున్నారు. తన సామాజికవర్గానికి అన్యాయం జరుగుతుందని, తనకు గుర్తింపు లేదని నాయకత్వంపై విరుచకుపడే అంత పెద్ద నేతకే తారాచౌదరి చెమటలు పట్టించిందంటే ఆమె బ్లాక్‌మెయిలింగ్‌ ఏ స్థాయిలో ఉండేదో ఊహించుకోవచ్చంటున్నారు. అదేవిధంగా ఒక నగరానికి మొదటి పౌరుడిగా పనిచేసిన సదరు ఎంపీ పుత్ర రత్నం కూడా తారా చౌదరి ఖాతాలో ఉన్నట్లు చెబుతున్నారు. కోటి రూపాయలు ఇవ్వకపోతే సీడీ బయటపెడతానని బెదిరిస్తుండటంతో సదరు ఎంపీ లక్ష్మణరావు అనే సన్నిహితుడిని మధ్యవర్తిగా పంపి, చివరకు వ్యవహారాన్ని 25 లక్షల రూపాయలకు సెటిల్‌ చేసుకున్నట్లు సమాచారం. 

అదే జిల్లాకు చెందిన ఓ పారిశ్రామికవేత్తను చంపాలని కర్నూలుజిల్లాకు చెందిన ఓ డీఎస్పీని బెదిరించినట్లు తెలుస్తోంది. సదరు డీఎస్పీ తారామణి ఒడిలో పడుకుని, పక్కనే ఆప్యాయంగా నిల్చుని ఉన్న ఫొటోలు కూడా దాడుల్లో దొరికినట్లు సమాచారం. దానితోపాటు శృంగారానికి సంబంధించిన సీడీని కూడా చూపించి, ప్రస్తుతం కర్నూలులో వ్యాపారం చేస్తున్న ఆ పారిశ్రామిక వేత్తను చంపాలని ఆ డీఎస్పీపై ఒత్తిడి తీసుకురాగా, తాను ఆ పనిచేయలేనని, ముందు సీడీలు, ఫొటోలు ఇవ్వాలని ఆయన కాళ్లావేళా పడి ప్రాధేయపడినట్లు తెలుస్తోంది. 

కాగా, రాష్ట్ర రాజకీయ చరిత్రను మార్చి, తెలుగు రాజకీయాల్లో భూకంపం పుట్టించిన ఓ దివంగత మాజీ ముఖ్యమంత్రి ద్వితీయ కళత్రం సైతం తారాచౌదరికి దన్నుగా నిలిచినట్లు సమాచారం. ప్రస్తుతం జగన్‌ పార్టీలో క్యారెక్టర్‌ పాత్ర పోషిస్తున్న ఆమెకూ తారా చౌదరికీ లింకులేమిటన్నదే ఆసక్తికరంగా మారింది. 
ఇదిలాఉండగా, ఆదిలాబాద్‌ జిల్లాకు చెందిన ఓ ప్రధాన ప్రతిపక్ష పార్టీకి చెందిన ప్రజాప్రతినిధి కూడా తారా చౌదరి చేతికి చిక్కినట్లు సమాచారం. సాంకేతికంగా ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ, గత కొద్ది నెలల నుంచీ ఆ పార్టీకి దూరంగా ఉంటున్న సదరు నేత కొన్నాళ్లు కేంద్ర రాజకీయాల్లో కూడా ముఖ్య భూమిక పోషించడం గమనార్హం. 

ఇక ఇద్దరు ఏపీఎస్‌లు కూడా తారామణి శృంగార సామ్రాజ్యంలో సేదదీరిన వారేనని తెలుస్తోంది. ప్రస్తుతం పదవీ విరమణ చేసిన వారిద్దరూ తారాచౌదరిని ఇతర జిల్లాల్లో ఓ వీవీఐపీ స్థాయికి చేర్చారని తెలుస్తోంది. ఆమె గుంటూరు, ప్రకాశం, ఇతర జిల్లాలకు వెళుతున్న సమయంలో సదరు ఐపీఎస్‌లు స్థానిక డీఎస్పీలకు ఫోన్లు చేసి బందోబస్తు చేసి, మర్యాదల్లో లోటు రాకుండా చూడాలని ఆదేశించేవారట. కమ్మవారిపాలెం దేవాలయానికి వెళ్లిన సమయంలో బందోబస్తుకు వెళ్లిన సమయంలో పోలీసులు పక్కకు జరగమన్నందుకు వారిపై తారాచౌదరి చిందులుతొక్కిందట. 

మహిళల హక్కుల కోసం ఉద్యమిస్తూ ప్రతిరోజూ టీవీ చర్చల్లో కనిపించే ఇద్దరు రాష్ర్ట స్థాయి మిహళా సంఘ నేతలు కూడా తారా చౌదరికి దన్నుగా నిలిచి, అందుకు ప్రతిఫలంగా నజరానా తీసుకున్నారంటే నోరెళ్లబెట్టక తప్పదు. గతంలో సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మీడియా సమావేశం నిర్వహించిన సందర్భంగా తారా చౌదరి అమాయకురాలని, పోలీసులు ఆమెను వేధిస్తున్నారని ఆమె తరఫున వకాల్తా తీసుకున్నారు. సినీ రచయిత చిన్నకృష్ణ కేసులో మహిళా కమిషన్‌ వద్ద యాగీ చేసి, వారి ద్వారా పోలీసులను హడలెత్తించిన తారా చౌదరికి ఓ రాజ్యాంగపరమైన సంస్థకు చైర్మన్‌గా పనిచేసిన ఓ మాజీ మహిళా ఎమ్మెల్యే అండగా నిలవడం అప్పట్లోనే విమర్శలకు తావిచ్చింది.

మహిళలపై ఎక్కడ అత్యాచారాలు, అరాచకాలు, కట్నం వేధింపులు జరిగినా అక్కడ ప్రత్యక్షమై ఆందోళన జరిపి, సాయంత్రానికి మళ్లీ టీవీ చర్చల్లో హాజరయ్యే ఈ ఇద్దరు మహిళా సంఘ నేతలకూ, తారాచౌదరికీ సంబంధాలేమిటన్నది ప్రశ్న. అప్పుడు తారా పక్షాన నానా యాగీ చేసిన ఈ మహిళా సంఘాల నేతలిద్దరూ ఇప్పుడు నోరుమెదపకపోవడం విచిత్రం. జిల్లాల నుంచి వచ్చే వారికి హోంగార్డు ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బులు తీసుకునే తారా చౌదరికి అందులో ఒక ఐపీఎస్‌ ఏకపక్షంగా సాయం చేసేవారని తెలిసింది. ఏకంగా ఆయన తారామణి అందించిన అప్లికేషన్లకు తన విజిటింగ్‌ కార్డు పెట్టి మరీ ఉద్యోగాలకు సిఫార్సు చేసేవారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో తరచూ పాల్గొని, సకల కళావల్లభుడిగా పేరున్న మరో ఐపీఎస్‌ కూడా తారాచౌదరి సృష్టించిన శృంగార సామ్రాజ్యంలో తేలిపోయిన వారేనంటున్నారు. పదవీ విరమణ చేసిన ఈ ఐపీఎస్‌ల వ్యవహారంపై అటు పోలీసు శాఖలోనూ చర్చ జరుగుతోంది. 

ప్రస్తుతం పోలీసుల కస్టడీలో ఉన్న తారాచౌదరి పెదవి విప్పితే మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఆమెను కస్టడీలోకి తీసుకున్నారని తెలియడంతో రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు, అధికార, అనధికార వర్గాల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.

No comments:

Post a Comment

sale your old used computer
usedsystemsblogspot.in
used computer buyer andhra pradesh