online marketing

Wednesday, April 11, 2012

కృష్ణపట్నం పోర్టులో పరిపాలనా భవనం కంపించింది సునామీ ప్రభావం వుండవచ్చని హెచ్చరికలు..

నెల్లూరు : సునామీ భయంతో ముత్తుకూరు తీర ప్రాంతంలో బుధవారం రోజున అలజడి చెలరేగింది. మద్యాహ్నం నుంచి రెండుసార్లు భూమి కంపించడంతో ప్రజలు భీతావహులయ్యారు. ముఖ్యంగా తీరగ్రామాల ప్రజలు ఆందోళనకు గురయ్యారు. కృష్ణపట్నం, నేలటూరు, ముత్తుకూరు పరిసర ప్రాంతాల్లో స్వల్పంగా భూమి కంపించింది. కృష్ణపట్నం పోర్టులో పరిపాలనా భవనం కంపించింది. సాయంత్రం సునామీ ప్రభావం వుండవచ్చని హెచ్చరికలు జారీ అయ్యాయి. దీంతో పోర్టులో పనిచేస్తున్న సిబ్బందిని హుటాహుటిన బస్సుల్లో ముత్తుకూరుకు తరలించారు. బెర్తుల వద్ద లంగరు వేసిన నాలుగు నౌకలను వెంటనే సముద్రంలోకి పంపివేశారు.

ఎగుమతి, దిగుమతులను తాత్కాలికంగా నిలిపి వేశారు. జిల్లా అధికారుల ఆదేశాల మేరకు మండల అధికారులు తీరగ్రామాల్లో పర్యటించారు. నేలటూరు పట్టపుపాళెంలో మత్స్యకారులతో మాట్లాడారు. అవసరమైతే మత్స్యకారులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని తహసీల్దారు సుశీల తెలిపారు. బుధవారం మధ్యాహ్నం నుంచి సముద్రంలో అలల తాకిడి పెరిగింది. సముద్రం స్వల్పంగా ముందుకు వచ్చింది. సాయంత్రం ఆరు గంటల వరకు సునామీ భయంతో మత్స్యకారులు బిక్కుబిక్కుమంటూ గడిపారు. 2006 డిసెంబరు నాటి సునామీ పరిస్థితులను గుర్తు తెచ్చుకొని భయపడ్డారు. అయితే రాత్రికి సునామీ ముప్పు తప్పిందని తెలియడంతో ఊపిరి పీల్చుకున్నారు.

సునామీ ప్రకంపనంతో భీతిల్లిన కోడూరు బీచ్ తోటపల్లిగూడూరు: సునామీ కారణంగా మండలంలోని కోడూరు బీచ్‌లో బుధవారం మధ్యాహ్నం పర్యాటకులు భీతిల్లారు. ఏ క్షణంలోనైనా సముద్రం ఉప్పొంగి ప్రమాదాన్ని సృష్టించవచ్చని భయబ్రాంతులతో సముద్రం సరిహద్దుకు చేరకుండా దూరంగానే ఉండిపోయారు. జాలర్లు తమ బోట్లను సురక్షిత ప్రాంతాలకు చేర్చారు. సముద్రంలో అలల ఉధృతి తీవ్రత ఎక్కువగా కనిపించింది. ముందస్తు జాగ్రత్త చర్యగా ఎస్ఐ సాంబశివరావు సముద్రతీరం వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.

No comments:

Post a Comment

sale your old used computer
usedsystemsblogspot.in
used computer buyer andhra pradesh