నెల్లూరు: నేను డిగ్రీ చదివాను.... వయస్సు 21 సంవత్సరాలు ఉన్నాయి.... ఇలాంటప్పుడు ప్రేమించి పెళ్లి చేసుకోవడం నేరమా? అని స్వయంగా పోలీసులకు ఫోన్ చేసి చెప్పినా పట్టించుకోకుండా తన భర్త వెంకటేశ్వర్లు కుటుంబీకులను పొదలకూరు పోలీసులు అదుపులోకి తీసుకుని వేధిస్తున్నారంటూ పొదలకూరు మండలం చిట్టేపల్లికి చెందిన కోవూరు కామాక్షి ఆవేదన వ్యక్తం చేశారు.. ఆమె ఆదివారం ‘ప్రేమించి పెళ్లి చేసుకున్న తీరును వివరించింది. ఆమె మేరకు చదువుకునే రోజుల్లో కామాక్షికి వెంకటేశ్వర్లుతో పరిచయం ఏర్పడింది.
ఆ పరిచయం వారి మద్య ప్రేమగా మారింది. ప్రేమ విషయం పెద్దలకు చెప్పారు. అయితే కామాక్షి కుటుంబీకులు వారి పెళ్లికి అంగీకరించలేదు. ఈనెల తేదీన చెన్నై చేపాక్ స్టేడియం సమీపంలో ఉన్న నాగారతమ్మ కోవెలలో వారు స్నేహితుల సమక్షంలో వివాహం చేసుకున్నారు. ఆ విషయం తెలుసుకున్న కామాక్షి కుటుం బీకులు వారి కోసం గాలింపు ప్రారంభించారు. చెన్నై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అక్కడి పోలీసులు కామాక్షిని విచారణ చేస్తే వారు మేజర్ అని తెలిసింది. దాంతో తాము ఏమి చేయలేమని పోలీసులు కామాక్షి కుటుంబీకులకు చెప్పారు.కామాక్షి కుటుంబీకులు పోదలకూరుకు వచ్చి అక్కడి పోలీసులకు కామాక్షిని వెంక టేశ్వర్లు కిడ్నాప్ చేశారంటూ ఫిర్యాదు చేశారు.
పొదలకూరు పోలీసులు వెంకట్శేర్లు కుటుంబీకులను అదుపులోకి తీసుకుని వేధించడం ప్రారంభించారు. ఆ విషయం తె లుసుకున్న కామాక్షి,వెంకటే శ్వర్లు పొదలకూరు ఎస్సై, సీఐలతో మాట్లాడారు. తనను ఎవరు కిడ్నాప్ చేయలేదని, తన ప్రమేయంతోనే వెంకటేశ్వర్లుతో వెళ్లి చెన్నైలో వివాహం చేసుకున్నానని కామాక్షి పోలీసు అధికారులకు పోన్‌లో వివరించారు. అయినా వారు శాంతించకుండా వెంకటేశ్వర్లు కుటుంబీకులను పోలీస్ స్టేషన్‌లోనే ఉంచి వేధిస్తున్నారు. వారిని వదలకుంటే ఎస్పీ వద్దకు వెళ్లి పోలీసులపై ఫిర్యాదు చేస్తానని కామాక్షి ‘న్యూస్‌లైన్’కు చెప్పారు

No comments:
Post a Comment