ఆత్మకూరు : జిల్లాలో ఈ ఏడాది నిరుపేదలైన 35 మంది జంటలకు ఉచితంగా సామూహిక వివాహాలు నిర్వహించడం జరిగిందని మైనార్టీ కార్పోరేటర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టరు జమీర్ అహ్మద్ తెలిపారు. శుక్రవారం ఏఎస్‌పేట మండలం రాజవోలు గ్రామంలో ప్రార్థన మందిరం వద్ద ఐదు మంది జంటలకు ఆయన సామూహిక వివాహాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంస్థ ఆధ్వర్యంలో మైనార్టీలకు అందించే సేవలను వినియోగించుకోవాలని కోరారు. ఫాస్టర్ స్టీఫన్ ఆధ్వర్యంలో కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. లక్ష్మమ్మ-లక్ష్మయ్య, పుల్లమ్మ-శేఖర్, మమత-శ్రీను, మాధవి-ప్రసాద్, నాగలక్ష్మి-వినోద్ జంటలకు సాంప్రదాయబద్దంగా దైవసేవకుల ప్రార్థనల నడుమ వివాహాలు నిర్వహించారు. అనంతరం ఒక్కోక్క జంటకు రూ.3 వేలు వంతున నగదు చెక్కులను పంపిణీ చేశారు. రూ.15 వేల విలువైన వంట పాత్రలను పంచిపెట్టారు. ఐదు జంటల బంధువులకు భోజన వసతి ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో దైవసేవకులు స్టీఫన్, విజయకుమార్, ఆనందరావు, జాన్‌డేవిడ్, మోషే, దావీదు, తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment