నెల్లూరు: నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడు అనం వివేకానందరెడ్డిపై మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గం ఉదయగిరి శాసనసభ్యుడు మేకపాటి చంద్రశేఖరరెడ్డి, మరో నేత వెంకట్రామిరెడ్డి ఆదివారం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు. ఆనం వివేకానందరెడ్డి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావులా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. వివేకానంద నెల్లూరు కేసిఆర్‌లా తయారయ్యారన్నారు.
ఆనం వివేకానందరెడ్డికి నెల్లూరు జిల్లాలో సమవుజ్జీ లేకనే నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ రెండుసార్లు అధికారంలోకి వచ్చిందంటే కారణం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డియే అన్నారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీకి రాష్ట్రంలో పార్టీని గెలిపించే సీన్ లేదన్నారు. సోనియాగాంధీవల్ల కాంగ్రెస్ పార్టీ గెలవలేదన్నారు.

No comments:
Post a Comment