ఆత్మకూరు: ఏఎస్‌పేట మండలం అనుమసముద్రం గ్రామంలో ఉన్న గుల్షన్ఫ్రాయి (సుఫీస్వామి) ఆధ్వర్యంలో గురువారం గౌసేఆజమ్ దస్తగిర్ గంథమహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నెల్లూరు, హైదరాబాద్, సికింద్రాబాద్, కర్నూలు, కడప, ఒంగోలు, తదితర ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తొలుత గుల్షన్ఫ్రాయి ఆశ్రమంలో గంధాన్ని దంచి తయారు చేశారు.అనంతరం ఫకీర్ల వాయిద్యాల మధ్య, బుర్జువుల కీర్తనలతో గుల్షన్ఫ్రాయి కుమారుడు సయ్యద్ మిర్జాబ్ఫ్రాయి గంధ కలశాన్ని శిరసుపై ఉంచుకుని ఏఎస్‌పేట ఖాజానాయబ్ రసూల్ దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి అనంతరం జమ మసీదు దగ్గర ఉన్న గౌసేఆజమ్ దస్తగిర్ వద్దకు గంథం చేరింది. గంథాన్ని నిషానికి పూసి ఫాతేహా కార్యక్రమాన్ని నిర్వహించారు. సలామ్ పాడి గంథాన్ని భక్తులకు పంచిపెట్టారు. ఈ సందర్భంగా దర్గాను విద్యుద్దీపాలతో సుందరంగా అలంకరించారు. భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
No comments:
Post a Comment