ఆత్మకూరు : మండలంలో 10వ తరగతి విద్యార్థులు 550 మార్కులకుపైగా సాధిస్తే వారు పైతరగతులలో కూడా చదివినంతవరకు తమ సొంత ఖర్చులతో ఉచిత చదువునందిస్తానని రియల్‌ఎస్టేటర్ ఇందూరు నరసింహారెడ్డి, మాధవి దంపతులు తెలిపారు. గురువారం అనంతసాగరం మండలం వెంగంపల్లి జడ్పీహైస్కూల్‌లో వారు 10వ తరగతి విద్యార్థులకు పరీక్షఅట్టలు, పెన్నులు, పెన్సిల్స్, ఎరేజర్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ భవిష్యత్తు విద్యార్థుల చేతిలోనే ఉందని, కష్టపడి చదివితే మంచి ఫలితాలు వస్తాయని పేర్కొన్నారు.
మండలంలో ఎవరికైనా 10వ తరగతి పరీక్షల్లో 550 మార్కులకు పైగా వస్తే ఆపై తరగతులు చదివించేందుకు కష్టఖర్చునైనా భరిస్తామని ఈ సందర్భంగా వారు విద్యార్థులకు హామీ ఇచ్చారు. ప్రతి ఒక్కరు మంచి ఫలితాలు సాధించి గురువులకు, తల్లిదండ్రులకు, మీ ఊరికి గుర్తింపు తీసుకునిరావాలని తెలిపారు. అనంతరం 10వ తరగతి విద్యార్థులకు పరీక్ష అట్టలు, పెన్నులు, పెన్సిల్స్, ఎరేజర్స్‌ను రియల్‌ఎస్టేటర్ ఇందూరు నరసింహారెడ్డి, మాధవి దంపతులు అందచేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు వి.సుజనమ్మ, ఉపాధ్యాయ సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

No comments:
Post a Comment