online marketing

Saturday, March 19, 2011

బిల్లుల కోసమే ’మేకపాటి’ రాజకీయాలు

నెల్లూరు, మేజర్‌న్యూస్‌:ఘనత వహించిన, నీతి నిజాయితీ కలిగివున్నామని చెప్పుకునే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి కేవలం కాంట్రాక్ట్‌ పనుల్లో పెట్టిన కోట్ల రూపాయల బిల్లులను రాబట్టుకోవడానికే రాజకీయం చేస్తున్నారని రూరల్‌ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి ఘాటుగా విమర్శించారు. మంత్రి ఆనం నివాసంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీ విప్‌ తీసుకుని కాంగ్రెస్‌ పార్టీ ఆదేశాలను అనుసరించి కాంగ్రెస్‌కు ఓటు వేసినందుకు ఆనం మేకపాటికి ధన్యవాదాలు తెలిపారు. మేకపాటి నేరుగా సిఎం వద్దకు వెళ్లి చేతులు కట్టుకుని కాంగ్రెస్‌కే ఓటు వేస్తామని నమూనా కోడ్‌ అడిగి తీసుకుని నిజాయితీగా కాంగ్రెస్‌కు ఓటు వేయడం జరిగిందన్నారు.

అయితే ఇదే నిజాయితీతో నెల్లూరు స్థానిక సంస్థల్లో కూడా ఓటు వేసి జడ్పీటీసీలు, ఎంపీటీసీలకు కూడా ఇదే అవకాశాన్ని కల్పిస్తారా అని ప్రశ్నించారు. ఇది కేవలం వందల కోట్ల రూపాయల పనులు, బిల్లుల కోసమే మేకపాటి సోదరులు రాజకీయం చేస్తూ నటిస్తున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ను నమ్ముకున్న జడ్పీటీసీలు, ఎంపీటీసీలను ఓటు వేయనీయకుండా బెంగుళూరు మిరియాల తోటలు, కాఫీ చెట్ల కింద దాచడం ఏమిటని ప్రశ్నించారు. మేకపాటి సోదరులు చెప్పేదొకటి, చేసేదొకటని, మిమ్మల్ని నమ్మి ఏ కాంగ్రెస్‌ నాయకుడు ఇక ముందుకు రాడని పేర్కొన్నారు. మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి ఒక్కసారి పాత చరిత్రను మళ్లీ గుర్తు చేసుకోవాలని హితవుపలికారు.

దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌. రాజశేఖర్‌రెడ్డి మెడపట్టి బయటకు నెట్టింది, పార్టీ నుంచి సస్పెండ్‌ చేసింది గుర్తు చేసుకుని ఈ సారైనా కాంగ్రెస్‌ పార్టీలో నీ నిజాయితీని రుజువు చేసుకోవాలని తెలిపారు. రెండున్నర నెలలు పదవిలో ఉండే కాకాణిని దించడానికి ఇంతమంది కావాలా అని ఆనం వ్యంగ్యంగా అన్నారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కనపడని అవినీతి ఇప్పుడు కలెక్టరేట్‌లో కనిపించిందా అని పరోక్షంగా సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డిని విమర్శించారు. ఇంటిపక్కనే ఉన్న ఎరువుల అవినీతి కుంభకోణంలో ఒక అధికారిని బ్లాక్‌మెయిల్‌ చేసి భయపెట్టిన సంగతి ఒక్కసారి గుర్తు చేసుకోవాలని టీడీపీ నాయకులను ఉద్దేశించి విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఆయనతోపాటు బొల్లినేని గిరినాయుడు, యానాదిశెట్టి, చెంచలబాబు యాదవ్‌, యల్లసిరి శ్రీనివాసులురెడ్డి, కాంగ్రెస్‌ నాయకులు గురవారెడ్డి, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

sale your old used computer
usedsystemsblogspot.in
used computer buyer andhra pradesh