నెల్లూరు :స్థానిక విక్రమసింహపురి విశ్వవిద్యాలయం డిపార్ట్‌మెంట్ ఆఫ్ బిజినెస్ మేనేజ్‌మెంట్ ఆధ్వర్యంలో ఈ నెల 20వ తేదీ జాతీయ స్థాయి మేనేజ్‌మెంట్ సదస్సును నిర్వహిస్తున్నట్లు అసిస్టెంట్ ప్రొఫెసర్ విజేత జడ్డా శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ది ఫౌండేషన్ హెడ్-2011 అనే పేరుతో విశ్వవిద్యాలయ పరిధిలోని అనుబంధ కళాశాలలో తొలిసారిగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎంబిఎ విద్యార్థులను ఆహ్వానించామని తెలిపారు. ఈ సదస్సులో అత్యుత్తమ యంగ్ మేనేజర్, బిజెనెస్ క్విజ్, అడ్వర్‌టైజ్‌మెంట్ల రూపకల్పన అనే అంశాల్లో పోటీ నిర్వహించి బహుమతులు అందిస్తామన్నారు. ఈ సదస్సులో రాయలసీమ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ జెవి.ప్రభాకర్‌రావు, విసి ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు, రిజిష్ట్రార్ వి.నారాయణరెడ్డిలు ముఖ్య అతిథులుగా పాల్గొంటారని తెలిపారు. ఈ సదస్సులో పాల్గొనదలచిన ఎంబిఎ విద్యార్థులు 98489 18640, 99893 20068 నెంబర్లను సంప్రదించాలని కోరారు.
Saturday, March 19, 2011
జాతీయస్థాయి సదస్సు

Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment