Tuesday, February 9, 2010
అబాకస్ జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన
వెంకటగిరి,మేజర్‌న్యూస్: ఈనెల 7వ తేదిన ఐపిఎ వారు చెనై్నలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి అబాకస్, స్పీడ్ అర్ధమెటిక్ పోటీల నందు వెంకటగిరికి చెందిన శ్రీ అల్లం కృష్ణయ్య మెమోరియల్ స్కూల్ అబాకస్ విద్యార్ధులు పాల్గొన్నారు. వీరు తమ ప్రతిభను కనబరచి రాష్టస్థ్రాయిలో బహుమతులు సాధించి జూన్‌లో బెంగుళూరులో నిర్వహించు జాతీయ స్ధాయి పోటీలకు ఎంపికైనట్లు సంస్ధ యాజమాన్యం తెలిపారు. స్పీడ్‌అర్ధమెటిక్ రాష్ట్ర స్ధాయి పోటీలనందు బి1 కేటగిరిలో అల్లం సాయిరమణ, ఛాంపియన్ ఆఫ్ ఛాంపియన్, కె మోహన సుందరం ద్వితీయ బహుమతి, బి2 కేటగిరిలో టి కిరణ్‌కుమార్ ద్వితియ బహుమతి, పిఆర్ కార్తిక్ తృతీయ బహుమతి, ఎ1 కేటగిరిలో పి అరవింద్ గణేష్ ద్వితియ బహుమతి, బి వెంకటేష్, వై ధర్మతేజ తృతీయ బహుమతి, వై బాలాజీ కన్సలేషన్ సాధించారు.అదేవిధంగా అబాకస్ రాష్టస్ధ్రాయి పోటీల్లో జెట్2 కేటగిరలో కె మోహన్ కృష్ణ ప్రథమ బహుమతి, బి3 కేటగిరిలో కె మోహన సుందరం ద్వితీయ బహుమతి, జి2 కేటగిరలో అల్లం సాయిరమణ తృతియ బహుమతి, జి1 కేటగిరలో జి శ్వేతశ్రీ, జి3లో ఎ కృష్ణ, పిఆర్ కార్తిక్, జెట్2లో కె రామ్ ప్రీతమ్, పి లోహిత కన్సలేషన్ బహుమతులు సాధించారు. ఛాంపియన్ ఆఫ్ ఛాంపియన్ అవార్డును సాధించిన అల్లం సాయిరమణను, బహుమతులు సాధించిన 16మంది విద్యార్ధులను సంస్ధ యాజమాన్యం అభినందించారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment