Tuesday, February 9, 2010
అధికారులు
నెల్లూరు (క్రైం) మేజర్‌న్యూస్:నగరంలో రోజురోజుకి ఇబ్బడిముబ్బడిగా పెరుగుతున్న చోరీలు, ట్రాఫిక్ సమస్యలపై కేవలం నగరంలోని పోలీసు అధికారులు అక్కడ క్కడ అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారే తప్ప వాటి పరిష్కారానికి మార్గాలను వెతకటంలో విఫలమైనారు. అందులో భాగంగానే ఈ నెల 4వ తేది పట్టపగలే నగర నడిబొడ్డున భారీగా చోరీ జరిగింది. ఈ మధ్యకాలంలో మాగుంట లేఅవుట్‌లో రెండు మూడు అపార్ట్‌మెంట్లలో లక్షల రూపాయలలో చోరీ, వేదాయపాళెంలోని మరొక అపార్ట్‌మెంటులో చోరీ, మినీబైపాస్ రోడ్డులోను జరిగినప్పటికీ, వాటి రికవరీలో విషయంలో మాత్రం అటు పోలీసు అధికారులు, ఇటు క్రైం సిబ్బంది సరిగా విచారణ చేపట్టటంలేదనే ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి.నగరంలో 5 క్రైం పోలీసు స్టేషన్లు ఉన్నప్పటికీ వాటిలో పనిచేస్తున్న ఎస్.ఐ స్ధాయి అధికారి నుండి క్రింది స్ధాయి సిబ్బంది వరకు రికవరీ చేయటంలో ఏ మాత్రం శ్రద్ధ చూపించటం లేదు. దొంగలను పట్టుకొన్న తరువాత వారితో ఏం మాట్లడకుండా నేరుగా సి.సి.యస్ లో అప్పగించమని ఒక అధికారి హుకుం జారీ చేసినట్లు సమాచారం. దీంతో నగరంలోని ఏ పోలీసు స్టేషన్ సిబ్బంది క్రైంపై నిఘా ఉంచడంలేదు. నామమాత్రంగా ఉద్యోగాలు చేస్తున్నారే తప్ప అంకితభావంతో పనిచేయడంలేదనే రూమర్లు వినిపిస్తున్నాయి.ఏ స్టేషన్ పరిధిలోనైనా చోరీ జరిగితే అక్కడ సిబ్బందినే బాధ్యులుగా చేస్తే అప్పుడే వారికి కూడా బాధ్యత అనేది ఉంటుంది. దీనిపై జాగ్రత్త వహించాల్సిన అధికారులు దానిని పట్టించుకోకుండా కేవలం అవగాహనా సదస్సులతో సరిపెట్టుకుంటున్నారు. దీనికి తోడు కొద్దినెలల క్రితం నగరంలోని ట్రాఫిక్ నియంత్రించడానికి ఆటోడ్రైవర్లు, యజమానులను పిలిపించి అవగాహనా సదస్సులను పెట్టినప్పటికి ప్రయోజనం లేకుండా పోయింది. ఈ సదస్సు పెట్టిన తరువాత నియమనిబంధనలు తుంగలో తొక్కారు అనడానికి ఉదాహరణగా డియస్‌పి స్ధాయి అధికారి వాహనాన్ని సైతం లెక్కచేయకుండా మితిమీరిన వేగంతో ఢీ కొట్టడమే. నగరంలోని దురుసు డ్రైవింగ్‌పై చర్యలు తీసుకుంటూ, ఇకనైనా పోలీసు అధికారులు స్పందించి డిపార్ట్‌మెంటులోనే దాగిఉన్న లోపాలను సరిదిద్దుకొని చోరీ జరిగిన సొమ్ము రికవరీ చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment