Wednesday, February 10, 2010
మహిళలు అభివృద్ది చెందితే సమాజాభివృద్ది
విడవలూరు, (మేజర్‌న్యూస్) : మహిళలు అభివృద్ధ్ది చెందితేనే సమాజాభివృద్ధి చెందుతుందని ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ ఛైర్మన్ కె.ప్రీతమ్‌లాల్ చెప్పారు. విడవలూరు మండలం వావిళ్ళ గ్రామంలో బుధవారం ఎపిజి బ్యాంక్‌ను నూతన భవనంలోకి మార్చారు. ఈ సందర్భంగా బ్యాంక్ ఛైర్మన్ ప్రారంభించారు. బ్యాక్ అవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఛైర్మన్ మాట్లాడుతూ మగవారికంటే మహిళలే నేడు బ్యాంక్‌కు వచ్చిరుణాలు పొందుతున్నారన్నారు. మహిళారుణాలు అనుకుంటే ఏదైనా సాధిస్తారన్నారు. యజమానిపై ఆధారపడకుండా వారే వచ్చిరుణాలు తీసుకుని, ఆర్ధికంగా ఎదుగుతున్నారన్నారు. మహిళలు అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతున్నారని ఛైర్మన్ ప్రీతమ్‌లాల్ చెప్పారు. గతంలో మహిళలు బ్యాంక్‌కు వచ్చేందుకు భయపడేవారని, నేడు మగవారు రావడంలేదన్నారు. రుణాలు తీసుకున్నవారు తిరిగి చెల్లించాలని, బ్యాంకులకు వారిపై నమ్మకం వుంటుందన్నారు. వ్యవసాయ రుణాలు కూడా ఎక్కువగా ఇస్తున్నామని, రుణాలు సకాలంలో చెల్లించితే బ్యాంక్ పురోభివృద్ధిలో వుంటుందన్నారు.ప్రజాసేవలు అందజేయడంలో ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ ముందజలో ఉందదన్నారు. జనసాంద్రతలో మహిళలు 50శాతం మంది వున్నారు. బ్యాంక్ అంటే డబ్బులు తీసుకోవడం చెల్లించడంకాదని, ఇచ్చిన రుణాలను సద్వినియోగం చేసుకోవాలని ఛైర్మన్ చెప్పారు. ఎపిజి బ్యాంక్ రీజనల్ మేనేజర్ రామారావు మాట్లాడుతూ ఎపిజికి 5 జిల్లాల్లో 66 బ్రాంచ్‌లు వున్నాయన్నారు. అన్ని బ్యాంకులు 47 శాతం రుణాలు ఇస్తే తమ బ్యాంక్ 53 శాతం ఇచ్చిందన్నారు. ప్రభుత్వం కూడా బెస్ట్ బ్యాంక్ అని అవార్డు ఇచ్చిందన్నారు. వావిళ్ళలో 1989 బ్యాంక్‌ను స్థాపించారని 10 కోట్ల రూపాయలు డిపాజిట్లు వున్నాయన్నారు. ఎపిజి బ్యాంక్ సీనియర్ మేనేజర్లు ఎస్‌వి రామసుబ్బారావు, హెచ్‌ఎండి బషీర్, విసికె ప్రసాద్, వావిళ్ళ బ్యాంక్ మేనేజర్ జె.మధుసూధన్‌రెడ్డి, సర్పంచ్ కె.సుజాత, ఎంపిటిసి పి.గోపాల్, ఐకెపి ఎంపిఎంలు తిమ్మన్న, గున్నయ్య తదితరులు పాల్గొన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment