Saturday, February 13, 2010
బోర్డులు పీకేశారు -నిబంధనలను ఉల్లంఘించారు -రియల్టర్లా మజాకా.
బుచ్చిరెడ్డిపాళెం, (మేజర్ న్యూస్) : బుచ్చిరెడ్డిపాళెంలోని రియల్టర్ల దౌర్జన్యం పరాకాష్టకు చేరుకుంటుంది. ప్రభుత్వ ఆదేశాలను, పంచాయతీ నిబంధనలను నిర్భీతిగా ఉల్లంఘిస్తున్నారు. బుచ్చిమండలం ఇస్కపాళెం పంచాయతీ పరిధిలో పంచాయతీ అనుమతి పొందకుండా నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన పలు లేఅవుట్లలో స్థానిక పంచాయతీ అధికారులు అభ్యంతరాలు తెలుపుతూ బోర్టులు నాటారు. పంచాయతీ వారి అప్రూవల్ పొందకుండా ఏర్పాటు చేసిన ఈ లేఅవుట్లలో ప్లాట్లుకొని ప్రజలు మోసపోవద్దని పత్రికాముఖంగా ప్రకటనలు కూడా ఇచ్చారు. కాని మందీమార్భలం వున్న రియల్టర్లు పంచాయతీవారి ఆదేశాలను బేఖాతరు చేశారు. పలు లే అవుట్లలో పంచాయితీ వారు ఏర్పాటు చేసి వున్న బోర్డులను శుక్రవారం తొలగించి పంచాయతీ వారికి రియల్టర్లు సవాలు విసిరారు. సర్పంచ్‌లైన, ఎంపిటిసిలైనా తమ లేఅవుట్లలో కాలు పెడితే ఖబడ్దార్ అంటూ బోర్డుల వెనుక ఎర్రతిరాతో హెచ్చరించారు. మరికొన్ని లేఅవుట్లలో బోర్డులను తగులబెట్టారు. ఓ బోర్టు వెనుక చాముండేశ్వరి కమిటి పేరుతో ఆ ప్రాంత సర్పంచ్, ఎంపిటిసిలను అసభ్యకరంగా భూతులు వ్రాశారు.అనంతరం ఆ లే అవుట్ల యాజమాన్యం ఫ్లెక్లీలను తొలగించే ప్రయత్నంలో ఇస్కపాళెం ఎంపిటిసి సభ్యులు ఫిరోజ్‌కు రియల్టర్ల మధ్య వాదోపవాదాలు జరిగడంతో ఆ ప్రాంతంలో కొంతసేపు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. అనంతరం పంచాయతీ వారు నాటిన బోర్డును అందరూ చూస్తుండగా తొలగించినా అడ్డుకున్నవారు లేకపోవడం గమనార్హం. ఈ విషయంపై స్థానిక పంచాయతీ అధికారులను వివరణ కోరగా అక్రమ లేఅవుట్లలో పంచాయతీవారు ఏర్పాటు చేసిన బోర్డులను తొలగించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment