నెల్లూరు ; జిల్లా ప్రజల జీవన విధానం మారుతోంది. 2001లో జిల్లాలో ల్యాండ్ ఫోన్ కనెక్షన్లు 1 లక్ష ఉండేవి. అలాంటిది పదేళ్లలో వాటి సంఖ్య తగ్గి సెల్‌ఫోన్ల వినియోగం బాగా పె రిగింది. సుమారు 4.5 లక్షల మందిపైగానే మొబైళ్లు వాడుతున్నారు. ఇక టీవీలకు అత్యంత ప్రాధాన్యం ఏర్పడింది. కేబుల్, డీటీహెచ్ ద్వారా మారుమూల పల్లెల్లో ప్రజలు సైతం టీవీ లేని జీవితం లేదన్న విధంగా మారింది. మొత్తం మీద జిల్లాలో 62.9 శాతం మంది టీవీలను వీక్షిస్తున్నారు. 14 శాతం కుటుంబాలు మాత్రమే టీవీలకు దూరంగా ఉంటున్నాయి. 5.4 శాతం మందే రేడియోను వినియోగిస్తున్నారు.
గ్యాస్ వాడకంలో.. జిల్లాలో తాజా లెక్కల ప్రకారం 7,72,825 కుటుంబాలు ఉన్నాయి. 4,47,149 గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. వీటిలో సింగిల్ సిలిండర్లు 1.87 లక్షలు, డబుల్ సిలిండర్లు 1.47 లక్షలు, దీపం కనెక్షన్లు 1.35 లక్షలు ఉన్నాయి. అంటే సింగిల్ సిలిండర్లు, దీపం కనెక్షన్లు కలుపుకుంటే 3.22 లక్షలు అవుతాయి. కుటుంబ సర్వే లో 30.2 శాతం తీసుకుంటే 2.33 లక్షల కు టుంబాలు గ్యాస్ వినియోగిస్తున్నట్లు తేల్చా రు. అంటే జిలా ్లలో సు మారు 90వేల కనెక్షన్లు మాటేమిటన్నది తేలా ల్సి ఉంది.
తగ్గని పూరిళ్లు 2001, జనాభా లెక్కల ప్రకారం జిల్లాలో 6,40,942 కుటుంబాలు ఉండేవి. ఈ పదేళ్లలో 1,31,883 కుటుంబాలు పెరిగాయి. ప్రస్తుతం 18.5 శాతం మంది ఇంకా పూరిళ్లలోనే జీవనం సాగిస్తున్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద 2 లక్షలకుపైగా ఇళ్లు మంజూరు చేసినా 1.42 లక్షల కుటుంబాలు పూరిళ్లలోనే గడుపుతున్నాయి. మరుగుదొడ్ల వినియోగం కూడా 30.2 శాతం కుటుంబాలకే ఉన్నాయి. మిగిలిన 70 శాతం మంది బహిర్భూమి కోసం ఆరు బయటకు వెళుతున్నారు.
తాగునీటి కటకటే జిల్లాలో ప్రస్తుతం 29.66 లక్షల మంది జనాభా ఉన్నారు. వీరికి సురక్షిత మంచినీరు అందించడంలో ప్రభుత్వం వైఫల్యం చెందుతూనే ఉంది. ఇప్పటికీ 13.9 శాతం మందికి తాగునీరు అందడం లేదు. 2001 జనాభా లెక్కల ప్రకారం 26.69 లక్షల మంది జనాభా ఉం డగా, ప్రస్తుతం 2.97 లక్షల మంది జనాభా పెరిగారు. వీరి అవసరాలకు తగిన విధంగా ప్రభుత్వం మంచినీరు అందించడం లేదు.
ఒకరే ముద్దు ఏదిఏమైనా కుటుంబ నియంత్రణ ప్రజలు పాటిస్తున్నారు. ఇద్దరు పిల్లలతో 30.9 శాతం మంది, ఒకరితో 17.2 శాతం మంది సరి పెట్టుకుంటున్నారు. దీంతో జనన రేట్ 0.40 శాతం తగ్గింది. 53 శాతం మంది బ్యాంకు సేవలు వినియోగించుకుంటున్నారు. సైకిళ్లను వీడి పూర్తిగా మోటారు సైకిళ్లపై 14 శాతం మంది, 1.5 శాతం మంది కార్లు వినియోగిస్తున్నారు. సైకిళ్లకు మాత్రం పల్లెల్లో ఆదరణ తగ్గలేదు. విద్యుత్ వినియో గం 92.2 శాతం మంది వినియోగిస్తున్నారు.
No comments:
Post a Comment