నెల్లూరు, తడ: భారతదేశంలోని బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ మెక్‌నిథావ్ రియానకీస్ సోమవారం దక్షణ భారతదేశంలోని అతిపెద్ద సమీకృత వాణిజ్య నగరం శ్రీసిటీలో విస్తృతంగా పర్యటిం చారు. చెనై్న నుంచి ఉదయం వచ్చిన హై కమిషనర్ మెక్ శ్రీసీటీలో సోలర్ క్యానల్ తయారు చేసే , షన్‌సోనార్ మెత్తటి ఆటబొమ్మలను తయారు చేసే పల్స్‌ప్లస్ యూనిట్లను సందర్శించారు. శ్రీసిటీ లో పర్యటించిన అనంతరం బిజినెస్‌సెంటర్‌లో ఏర్పాటు చేసిన విలేకరల సమావేశంలో శ్రీసిటీ మేనే జింగ్ డైరక్టర్ రవీంద్ర సన్నారెడ్డితో హైకమీషనర్ మెక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మెక్ మాట్లా డుతూ ఇక్కడ tజరుగుతున్న అభివృద్ధి పనులను ప్రత్యేకంగా అభినందిం చారు. ప్రస్తుతం రూ. 120 కోట్ల పెట్టుబడితో ఏర్పాటైన మూడు బ్రిటన్ కంపెనీలు త్వరలో ఉత్పత్తులను ప్రారంభించనున్నానమని తెలిపారు.
తమ దేశం తరుపున మరో 5 కంపెనీలు కూడా శ్రీ సిటీకి రానున్నాయని చెబుతూ ఇంకా ఎక్కువ కంపెనీలు శ్రీసిటికి వచ్చే విధంగా తన వంతు కృషి చేస్తామనన్నారు. ప్రస్తుతం ఉన్న మూడు కంపెనీల ద్వారా దాదాపు 600 మంది స్థానికులకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయని ఓ ప్రశ్నకు సమాధానంగా మెక్ చెప్పారు. ఈ సమావేశంలో రవీంద్రా సన్నారెడ్డి మాట్లాడుతూ గత మూడేళ్ళ కాలంలో మొదటి దశ అభివృద్ధి పనుల్లో భాగంగా శ్రీసిటిలో 22 దేశాలకు చెందిన 70 కంపెనీలు ఏర్పాటయ్యాయని ఆయన పేర్కొన్నారు. త్వరలో ప్రారంభమైయ్యే 2వ దశ పనుల్లో ఘననీయమైన అభివృద్ధి సాధిస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీసిటీ ప్రతినిధులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment