
ప్రధానంగా అన్ని వర్గాల యువకులు ఇందుకోసం పెద్దఎత్తున డబ్బు ఖర్చుచేస్తున్నారు. గతంలో ఇంటర్నెట్ సెంటర్ల నుండి నీలిచిత్రాలను సెల్‌ఫోన్లలోకి డౌన్‌లోడ్ చేసుకునేవారు. ఆ తరువాత బ్లూటూత్ ద్వారా ఒకరి సెల్ నుండి మరొకరు డౌన్‌లోడ్ చేసుకునేవారు. దీనికి ఖర్చుపెద్దగా ఉండేదికాదు. ఇలాంటి వ్యవహారాలు చేస్తున్న ఇంటర్‌నెట్ సెంటర్లమీద పోలీసులు పలుమార్లు దాడులు చేశారు. దాంతో ఆ కేంద్రాలు కొంత మేర నియంత్రణను పాటిస్తున్నాయి. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. నేరుగా ఆయా సెల్‌ఫోన్ కంపెనీలే నీలిచిత్రాలు, సెక్స్‌బొమ్మలు, సినీ తారల అర్ధనగ చిత్రాలను అందిస్తున్నాయి. బిఎస్‌ఎన్‌ఎల్ వంటి సంస్థ కూడా ఇందుకు మినహాయింపు కాదు. అదే ఎక్కువగా పంపిస్తోంది. యువత బలహీనతలను ఆసరా చేసుకొని సెల్ కంపెనీలు క్యాష్ చేసుకుంటున్నాయి. దాదాపు అన్ని కంపెనీలూ తమ వినియోగదారులకు ఇలాంటి సమాచారంతో మేసేజ్‌లు పెడుతున్నాయి. ఒక సారి ఒకే అని నొక్కితే ఇక అంతే సంగతులు. వరుసగా రోజువారి మేసేజ్‌లు వస్తుంటాయి. రోజుకు మూడు రూపాయల చొప్పున ఆయా సెల్ కంపెనీలు జమ చేసుకుంటాయి. మనం ఇవ్వకపోయినా సెల్‌లో డబ్బులు పడగానే ఆటోమేటిక్‌గా కట్ అవుతాయి. సెల్‌పోన్లలో నీలిచిత్రాలు షికార్లు చేస్తున్నాయి. ఈ మోజులో పడి యువత పెడదారి పడుతోంది. ముఖ్యంగా చదువులను నిర్లక్ష్యం చేస్తోంది. ప్రదానంగా కళాశాల యువత చదువులను కూడా నిర్లక్ష్యం చేస్తోంది. మొన్నటి దాకా ఇంటర్నెట్ ద్వారా తమ పిల్లలు చెడిపోతున్నారని తల్లిదండ్రులు ఆందోళన చెందారు. ఇప్పుడు ఏకంగా అరచేతిలోకే నీలిచిత్రాలు వస్తుండడంతో తమ బిడ్డల భవిష్యత్‌పై వారు మరింత భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. కొందరు యువకులు ఇలా నీలిచిత్రాలు చూస్తూ అమ్మాయిలను వేధిస్తూ ఆకతాయిలుగా మారుతున్నారు. కేవలం సమాచారాన్ని చేరవేసే సెల్‌ఫోన్ ఇప్పుడు సమాజాభివృద్ధికి ఆటంకంగా మారిందని సర్వత్రా చర్చనీయాంశమైంది. వివిధ కంపెనీలు సెల్ ఫోన్లకు నీలి చిత్రాలు పంపిస్తూ జిల్లాలో అధిక మొత్తంలో యువత నుంచి సొమ్మును దోచుకుంటున్నాయి. డబ్బు విషయం అలా ఉంచినా యువత చెడుమార్గం పడుతుండడమే పెద్ద ఆందోళనకరం. ఇలాంటి వ్యవహారాలపై అధికారులు దృష్టిపెట్టి సెల్ కంపెనీలను నియంత్రిస్తే సమాజానికి కాస్తయినా మేలు జరుగుతుంది
No comments:
Post a Comment