నెల్లూరు : 2010-2011 ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్ష రాసిన వారిలో రాష్ట్ర ఉతీర్ణత 52.21శాతం కాగా, జిల్లా ఉత్తీర్ణత 58శాతం అని విద్యాశాఖాధికారులు తెలిపారు. ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షా ఫలితాలను ప్రభుత్వం గురువారం విడుదల చేసింది. జిల్లాలో 2009లో జనరల్ ఉత్తీర్ణత 53, ఒకేషనల్ 47శాతం, 2010లో జనరల్ 53శాతం, ఒకేషనల్ 46శాతం, 2011లో జనరల్ 58శాతం, ఒకేషనల్ 51శాతం నమోదైంది. ఈ ఏడాది బాలురు 14,673మంది పరీక్షలు రాయగా, అందలో 8,118మంది ఉత్తీర్ణులయ్యారు. ఉత్తీర్ణతా శాతం 55గా నమోదైంది. బాలికలు 14,409మంది పరీక్షలకు హాజరుకాగా, అందులో 7,010మంది పాసయ్యారు. ఉత్తీర్ణత శాతం 60గా నమోదైంది. మొత్తం 26,082మంది పరీక్షకు హాజరుకాగా, అందులో 15,128మంది పాసయ్యారు. మొత్తం 58శాతంగా నమోదైంది. ఒకేషనల్ పరీక్షకు 690మంది బాలురు హాజరుకాగా, 320మంది పాసయ్యారు. ఉత్తీర్ణత శాతం 46గా నమోదైంది. బాలికలు 459 మంది హాజరుకాగా, అందులో 267మంది పాసయ్యారు. ఉత్తీర్ణత శాతం 58గా నమోదైంది, మొత్తం 1149మందిలో 587మంది పరీక్షల్లో పాసై, 51శాతం ఉత్తీర్ణత సాధించారు.
27 నుంచి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు
అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు ఈ ఏడాది మే 27వ తేది నుంచి ప్రారంభమవుతాయని అధికారులు తెలిపారు. పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులు, బెటర్‌మెంట్ రాసే విద్యార్థులు మే 3వ తేదీ లోపు తమ కళాశాలల్లో ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది. ఫైన్‌తో ఫీజు చెల్లించేందుకు అవకాశం లేనందున విద్యార్థులు సకాలంలో ఫీజులు చెల్లించాలని ఇంటర్మీడియట్ ప్రాంతీయాధికారి జి వరప్రసాద్ తెలిపారు.
ప్రభుత్వ కళాశాల విద్యార్థుల ప్రతిభ
వెంకటాచలం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎంపిసి మొదటి సంవత్సరం చదువుతున్న పర్వతాల గోపి 470 మార్కులకు గాను 452 మార్కులు, సిఇసి చదువుతున్న తెలపల సుభాషిణి 500 మార్కులకు గాను 435మార్కులు సాధించి మంచి ప్రతిభ కనబరిచారని ఇంటర్ అధికారులు తెలిపారు.

No comments:
Post a Comment