నెల్లూరు:శుక్రవారం జిల్లా వ్యాప్తంగా గంటపాటు వర్షం కురిసింది. ఎండల తాపానికి అల్లాడుతున్న ప్రజలకు శుక్రవారం ఉదయం 11గంటల ప్రాంతంలో అనుకోని విధంగా ఆకాశం మేఘావృతమై కొన్ని ప్రాంతాల్లో ఒక మోస్తరు వర్షం కురవగా, మరికొన్ని ప్రాంతాల్లో చిరుజల్లులు కురిసాయి. మబ్బు దట్టంగా కమ్ముకోవడంతో భారీ వర్షాలు కురుస్తాయని ప్రజలు భావించారు. అయితే కొద్దిపాటి వర్షంతోనే ఊరించి సరిపెట్టుకుంది. చిరుజల్లులు పడడడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేసినప్పటికీ రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 50 శాతం వరికోతలు కోయాల్సివుంది. అకాల వర్షం కురవడంతో కల్లాల్లో ధాన్యం తడిసిపోయాయని అనేకమంది రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రైతు పండించిన పంట చేతికొచ్చేంతవరకు ఏమీ చేయలేని పరిస్థితులు నెలకొన్నాయని అంటున్నారు.
No comments:
Post a Comment