నాయుడుపేట : నెల్లూరుజిల్లా నాయుడుపేట మండలం పెరికలంపాటికండ్రిగ గ్రామదేవత గుడిలో గురువారం ఓ వింత చోటు చేసుకుంది. ఆ గ్రామ చెరువుకట్టపై ఉన్న నాగార్పమ్మ గుడిలో మువ్వలసవ్వడి వినిపిస్తోంది. అది కూడా విగ్రహం పాదాల వద్ద నుంచే వస్తుండడం విశేషం. దీంతో గ్రామదేవత గుడివద్దకు గ్రామస్థులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. గత శనివారం నుంచి ప్రతి పదిహేను నిమిషాలకు వినిపించే ఈ శబ్దాలు, గురువారం నుంచి ప్రతి రెండు నిమిషాలకు ఓసారి వినిపిస్తున్నాయి.
అమ్మోరు మహిమే....
నాగార్పమ్మ గుడిలో వినిపిస్తున్న ఈ సవ్వళ్లు అమ్మవారి మహిమ ప్రభావమేనని ఆ గ్రామస్థులు తెలిపారు. గ్రామ ప్రజలు గుడివద్దకు చేరుకోగానే అక్కడ ఉన్న ఓ మహిళకు పూనకం వచ్చి ఊగిపోతూ చిందులేస్తూ ఉండగా... భక్తులు అందరూ నాగార్పమ్మ నామస్మరణ చేశారు. ప్రతియేటా జాతరలు చేయనందునే... అమ్మవారు ఇలా వింతలు చేస్తున్నారని పూనకం వచ్చిన మహిళ చెప్పారు.

No comments:
Post a Comment